కర్నూల్

టిడిపితోనే అభివృద్ధి సాధ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాగలమర్రి, డిసెంబర్ 26: టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డి అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు వెళ్తుండగా చాగలమర్రిలో లింగారెడ్డికి ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని కూలూరు, గోపాయిపల్లె, పగిడ్యాల, దద్దనాల, తదితర గ్రామాలకు చెందిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు శనివారం ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. పండుగల సమయంలో రేషన్‌షాపుల ద్వారా ప్రజలకు చంద్రన్న కానుకలు అందించిన ఘనత టిడిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. క్రిస్మస్ పండుగతో పాటు సంక్రాంతి పండుగకూ చంద్రన్న కానుకలు ఇస్తామన్నారు. పేద, బలహీన వర్గాల రైతుల అభ్యున్నతి కోసమే తెలుగుదేశం పార్టీ పుట్టిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు.
నకిలీల బెడద!
* విత్తన ధ్రువీకరణ విధానంలో లోపాలు..
* నిండా మునుగుతున్న రైతులు..
* నష్టపరిహారం అందక విలవిల..
నంద్యాల, డిసెంబర్ 26 : నకిలీ విత్తనాలతో రైతన్నలు నిండా మునుగుతున్నారు. విత్తన ధృవీకరణలో తలెత్తుతున్న లోపాలు, దళారుల ప్రమేయంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకప్పుడు నంద్యాల ప్రాంతం స్వచ్ఛమైన విత్తనాలు అందించే సీడ్‌హబ్‌గా ఉండేది. దక్షిణ భారతదేశంలోని పలు సీడ్ కంపెనీలు నంద్యాలలో తిష్టవేసి రైతులతో విత్తన పంటలు సాగుచేయించి విత్తనాలను మార్కెట్ చేసుకునే వారు. అయితే నేడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారింది. అధికారుల అవినీతి, నకిలీ విత్తనాలు ఉత్పత్తి చేసే మోసగాళ్ళతో నష్టపోతున్న ప్రముఖ విత్తనోత్పత్తి సంస్థలు నంద్యాలను వదిలిపెట్టాయి. దీంతో నకిలీ విత్తనాల ముఠాలు పేట్రేగిపోయాయి. తమ వ్యాపారాన్ని గ్రామాలకు విస్తరించాయి. రైతులకు మాయమాటలు చెప్పి తమ విత్తనాలు తీసుకున్న వారికి రసాయనిక మందులు, పురుగు మందులు అందజేయడమే కాక తమ కంపెనీ ప్రతినిధులు సూచనలను, సలహాలు ఇస్తారని నమ్మించి నకిలీ విత్తనాలు అంటగట్టి వారిని నిలువునా ముంచాయి. ఖరీఫ్ సీజన్‌లో వరుణదేవుడు కరుణచూపకపోవడం, సాగునీరు కాల్వలకు సరిగా రాకపోవడంతో దిక్కుతోచని రైతులు బోరుబావులు ఉన్న పొలాలను అధిక రేట్లకు కౌలుకు తీసుకుని గత ఏడాది మంచిపంట వచ్చిన విత్తనాలను తీసుకుని పంటలు సాగుచేశారు. రుద్రవరం, శిరివెళ్ళ, గోస్పాడు మండలాల్లోని పలు గ్రామాల రైతులు రెండేళ్లుగా ఓ కంపెనీకి చెందిన మిరప విత్తనాలు తీసుకుని పంట వేయడంతో మంచి ఆదాయం దక్కింది. దీంతో ఈ ఏడాది మరింత విస్తీర్ణంలో సాగుచేసేందుకు రైతులు ముందస్తు కౌలు చెల్లించి పొలాల్లో మిర్చి పంట సాగుచేశారు. సుమారు 1600 ఎకరాలలో మిర్చి సాగుచేసిన రైతులకు ఎకరాకు రూ.60 నుంచి రూ.80వేల వరకు ఖర్చుచేసి పంటను చీడపీడల నుంచి బతికించుకున్నామన్న ఆనందం ఎక్కువ కాలం నిల్వలేదు. మిర్చిపంట పూతదశకు రాగానే కాయలు రాలిపోవడం, పంట రాకపోవడంతో మిర్చి రైతులు హతాశులయ్యారు. నంద్యాల ప్రాంతంలో తిష్టవేసిన కొంతమంది బ్రోకర్లు గ్రామాల్లో తిరిగి ఓ సంస్థకు చెందిన విత్తనాలను అందించడం వల్లే మోసపోయామని వాపోతూ నంద్యాల ఆర్డీవో, వ్యవసాయ అధికారులు, శాస్తవ్రేత్తలకు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో శాస్తవ్రేత్తలు గ్రామాల్లో పర్యటించి మిర్చి పంటను పరిశీలించారు. కొంత శాంపిల్ సేకరించి ధృవీకరణ కోసం హైదరాబాద్‌కు పంపారు. ఇప్పటికే మిర్చి పంట రాలేదని, విత్తనాలు నకిలీవని తేలిపోయినప్పటికీ వ్యవసాయ అధికారుల నాన్చుడు ధోరణి కారణంగా పంట తీసివేయలేక అధికారుల అనుమతి కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వ్యవసాయాధికారులు మిర్చిపంట సాగులో విత్తన లోపమా లేక నాశిరకం పురుగు మందులా అన్న విషయం తేల్చితే తమకు నష్టపరిహారం అందుతుందని భావించిన రైతులు అటు పాడైపోయిన మిర్చి పంటను దున్నక వదిలేశారు. అయితే అథికారుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో వేసిన పంటను తొలగించలేక ఇటు మరో పంట వేసుకొనే అవకాశం లేక రైతులు లబోదిబోమంటున్నారు. నంద్యాల ఆర్డీవో కార్యాలయం వద్ద ఇటీవల మిర్చి రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయాధికారులు వివరణ ఇచ్చేంతవరకు ఆందోళన విరమించేది లేదని పట్టుబట్టడంతో పోలీసులు నచ్చజెప్పి పంపారు.
పట్టణంలోని బొమ్మలసత్రం ప్రాంతంలో ఉన్న ఓ విత్తన దుకాణంలో కొనుగోలుచేసిన వరి విత్తనాలు సైతం నకిలీవని తేలడంతో సాగుచేసిన రైతులు లబోదిబోమంటున్నారు. నంద్యాల మండలంలోని కానాల గ్రామానికి చెందిన రైతులు ఎక్కువగా ఈ దుకాణం నుంచే కొనుగోలు చేసి వరిసాగు చేపట్టగా కంకిదశలోనే పంట దారుణంగా దెబ్బతిన్నట్లు అటు రైతులు, వ్యవసాయ శాస్తవ్రేత్తలు వెల్లడించారు. అదే విధంగా సాగునీటి సౌకర్యం ఉన్న చోట పత్తిపంట సాగుచేయగా అక్కడ కూడా నకిలీ విత్తనాల దెబ్బతో రైతులు కంగుతిన్నారు. మిర్చి సాగుచేసిన రైతులకు ఎకరాకు రూ.60 నుంచి రూ.80వేల వరకు ఖర్చు కాగా మిగిలింది ఏమీ లేదు. మునిగుత్తలు కట్టి వడ్డీలకు అప్పుతెచ్చి పంటలు సాగుచేస్తే నకిలీల కారణంగా నట్టేట మునిగిపోతున్నా వ్యవసాయ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప ఆదుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు విత్తన దుకాణాలపై తరచూ దాడులు నిర్వహించి నిఘా పెంచితే తప్ప నకిలీలను అరికట్టలేరని రైతులు అంటున్నారు.