కర్నూల్

నదుల అనుసంధానంతో ఇరు ప్రాంతాలకూ లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, ఆగస్టు 6:ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నదుల అనుసంధానం చేయడం, పట్టిసీమ నిర్మాణం చేపట్టడంతో ఇరు ప్రాంతాలకు సమాన లబ్ధి చేకూరిందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పట్టిసీమ ఫలాలు వైకాపా అధినేత జగన్‌కు ఇప్పటికైనా కనిపిస్తున్నాయా లేదా అని మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం టిడిపి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని, త్వరలోనే కేంద్రం నుంచి ప్రకటన కూడా వచ్చే అవకాశం వుందని మంత్రి దేవినేని వెల్లడించారు. మండల పరిధిలోని మల్యాల గ్రామ సమీపంలోని హంద్రీనీవా మొదటి ఎత్తిపోతల పథకాన్ని శనివారం మంత్రి దేవినేని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ గోదావరి జలాలను పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు, కృష్ణా జలాలను శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు అందిస్తున్నామన్నారు. గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా 6.3 టిఎంసిల నీటిని కృష్ణా డెల్టాకు అందించామన్నారు. కృష్ణానదికి వరద జలాలు రావడంతో నీటిని కిందకు వదలకుండా 6.3 టిఎంసిల నీటిని రాయలసీమకు సాగు, తాగునీటి కోసం విడుదల చేశామన్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఇరు ప్రాంతాలకు సమాన స్థాయిలో నీటి సరఫరా జరుగుతుందన్నారు. పట్టిసీమ నిర్మాణ సమయంలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారని, నేడు ఆ పథకం వల్ల ఇరుప్రాంతాల రైతులు పంటలు పండించుకుంటున్నారన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులు కూడా త్వరలో పూర్తి చేసి శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గితే అక్కడి నుంచి సీమకు నీరు విడుదల చేస్తామన్నారు. హంద్రీనీవా ఫేజ్-2 పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. గోదావరికి వరద జలాలు భారీగా రావడంతో కేవలం 46 టిఎంసిలు మాత్రమే ఉపయోగించుకుంటున్నామని, దాదాపు వెయ్యి టిఎంసిల నీరు సముద్రంలో వృథాగా కలిసిపోతుందన్నారు. పట్టిసీమ కుడి కాలువకు గండి కొట్టిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే మరిన్ని జలాలను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. మంత్రి దేవినేని ఉమా వెంట నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, ప్రాజెక్టు ఇఇ రెడ్డిశేఖర్‌రెడ్డి, పాండురంగయ్య, మార్కెట్‌యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి, సూపర్‌బజార్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ మునాఫ్, నాయకులు గిరీశ్వరరెడ్డి, లాయర్ జాకీర్‌బాషా, శివరామిరెడ్డి, మోహన్‌రెడ్డి, కౌన్సిలర్లు ముర్తుజావలి, దేశెట్టి శ్రీనివాసులు ఉన్నారు.