కర్నూల్

అంగన్‌వాడీలపై చర్యలు అమానుషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, డిసెంబర్ 26: విజయవాడలో ధర్నా చేసిన అంగన్‌వాడీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేయడం, లాక్కురావడం అమానుషమని శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని స్వగృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జీతాలు పెంచినట్లు ప్రకటించి ఇవ్వకుండా కాలయాపన చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. మహిళలను నిర్దాక్షిణ్యంగా కొట్టించడం, ఈడ్చివేయడం ఆక్షేపనీయమన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలకు టిడిపి ప్రభుత్వం రుణమాఫీ చేసి వుంటే వారు వడ్డీ వ్యాపాలను ఆశ్రయించేవారుకాదన్నారు. కాల్‌మనీ వ్యవహారంపై చర్చించడానికి అసెంబ్లీలో సమయం కోరితే తమకు మాట్లాడే ఆవకాశం ఇవ్వకుండా స్పీకర్ దాటవేశారన్నారు. అందుకే స్పీకర్‌పై అవిశ్వాసం నోటీసు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. దళితులపై చంద్రబాబుకు అమాంతం ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందో తెలియడం లేదన్నారు. గతంలో దళిత మహిళ స్పీకర్‌గా వున్నప్పుడు స్పీకర్‌గా పనికిరావన్న బాబు దళిత మహిళను కించపరిచలేదా అని ప్రశ్నించారు. సిఎం ప్రతి సారి తాను తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకుంటూ కాలయాపన చేశారన్నారు. జన్మభూమిలో ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. జనవరి 1 నుండి నగర పంచాయితీ పరిధిలోని ప్రజలకు టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేస్తున్నామని, మున్సిపాలిటీ పరిధిలో ఏ సమస్య ఉన్నా టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి తమ దృష్టికి తెస్తే పరిష్కరిచేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు. సమావేశంలో భూమా బ్రహ్మానందరెడ్డి, కుడాల నారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పీఠాధిపతి ధార్మిక పర్యటన
మంత్రాలయం, డిసెంబర్ 26: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థులు శనివారం ధార్మిక పర్యటనకు బయలుదేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వానం మేరకు ఎర్రపల్లిలోని ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న ఆయుత చండీయాగంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడనుండి ముంబాయికి బయలుదేరినట్లు మఠం మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు.
శ్రీమఠంలో భక్తుల రద్దీ
శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనార్థం శనివారం భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో మఠం భక్తులతో కిటకిటలాడింది. బక్రీద్, క్రిస్మస్ సెలవులు రావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. భక్తులు తొలుత గ్రామదేవత మంచాలమ్మను ధర్శించుకుని అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి అర్చకులు పంచామృతాభిషేకం, ఉత్సవ రాయల పాదపూజ, సంస్తాన పూజలు నిర్వహించి మహా మంగళహారతి ఇచ్చారు. మూలబృందావనానికి బంగారు కవచం అలంకరించి రకరకాల పూలతో పూజలు నిర్వహించారు. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయలను గజ, కొయ్య, వెండి బంగారు, నవరత్న రథాలపై ఊరేగించారు. భక్తుల రద్దీ దృష్ట్యా మఠం మేనేజర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేసి అసౌకర్యం కలుగకుండా చూశారు.
అహోబిలంలో పోటెత్తిన భక్తులు
ఆళ్లగడ్డ, డిసెంబర్ 26: అహోబిలంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొనేందుకు భక్తులు శనివారం పోటెత్తారు. ఎగువ అహోబింలో స్వయంభువుగా వెలసిన నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లు, దిగువలో వెలసిన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లి అమ్మవార్లను గంటల సేపు క్యూలైన్లలో వేచి వుండి భక్తులు దర్శించుకున్నారు.
అహోబిలేసుని సన్నిధిలో లింగారెడ్డి
సివిల్ సప్లయ్ చైర్మెన్ మల్లేల లింగారెడ్డి తమ కుటుంబసభ్యులతో కలిసి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శనివారం దర్శించుకుని పూజలు చేశారు. ఆయనకు ఆలయ ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్, అర్చక బృందం పూర్ణకంభ స్వాగతం పలికారు. అనంతరం ఎగువలో స్వయంభువుగా వెలసిన నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లను, దిగవన వెలసిన శ్రీ ప్రహ్లాద వరదస్వామి, అమృతవల్లి అమ్మవార్లను కుటుంబసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆయనకు ప్రధానార్చకులు నవనారసింహుల చిత్రపటం అందజేశారు.