కర్నూల్

పోటెత్తిన పుష్కర భక్తులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఆగస్టు 22: కృష్ణా పుష్కరాలు పురస్కరించుకుని దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం చేరుకున్నారు. శివునికి ప్రీతకరమైన రోజు సోమవారం కావడంతో శ్రీశైలానికి భక్తు ల రద్దీ పెరిగింది. అందకనుగుణంగా ఆలయ అధికారులు పుష్కరఘాట్‌ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాతాళగంగ, లింగాలగట్టులోని స్నాన ఘాట్‌ల వద్ద వేకువజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి నదీమతల్లికి ప్రత్యేక పూజలు చేశారు. మరికొందరు తమ పితృలకు పిండప్రదానాలు చేసి ఆత్మలకు శాంతి కలుగాలని కోరుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు మల్లికార్జున, భ్రమరాంబిక అమ్మవార్ల నిరంతరాయంగా దర్శనం ఏర్పాటు చేశారు. ఆలయ పురవీధులు భక్తులతో కిటకిటలాడాయి. నేటితో పుష్కరాలు ముగియనుండడంతో భక్తుల రద్దీ పెరిగింది. అటు దేవస్థాన అధికారులు, ఇటు పోలీసు సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ అన్ని సౌకర్యాలు సమకూరుస్తు ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణలో పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండ ప్రశాం త వాతావరణంలో పుష్కర స్నానాలు ఆచరించి తమ గమ్య స్నానాలకు చేరుకొనేందుకు అన్ని సౌకర్యాలను చేస్తున్నారు. క్యూలైన్ల వద్ద, రద్దీ ప్రదేశాల్లో పోలీసు శాఖ వారు ప్రత్యేక దృషి టసారించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. కాగా పుష్కరోత్సవాల చివరి రోజైన మంగళవారం సాయంకాలం 1,116మంది దంపతులు పాతాళగంగ నుంచి పుష్కర జలాలు తీసుకువచ్చి మల్లికార్జునస్వామికి కలశాభిషేకం జరుపనున్నారు.
పుష్కర స్నానమాచరించండి
* లింగాలగట్టు ఘాట్‌లో కృష్ణమ్మకు సిఎం హారతి
శ్రీశైలం, ఆగస్టు 22 : కృష్ణా పుష్కరాలు పురస్కరించుకుని సిఎం చంద్రబాబు సోమవారం 12.30 గంటలకు శ్రీశైలంలోని లింగాలగట్టులో లెవెల్ స్నాన ఘాట్లను పరిశీలించారు. ముందుగా సిఎం సంప్రదాయబద్ధంగా కృష్ణవేణి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. అనంతరం భక్తులతో ముఖాముఖిగా మాట్లాడి అధికారులు చేసిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. పలువురు భక్తులు సిఎంతో పుష్కర ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం పుష్కర ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన ఆయుర్వేద స్టాల్, మరికొన్ని స్టాల్స్‌లను పరిశీలించారు. అనంతరం పుష్కరఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పలువురు భక్తులకు భోజనాలు వడ్డించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి సిఎం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుష్కర స్నానాలు చేసి దేశం సుభిక్షంగా ఉండాలని నదికి పూజలు చేయాలని కోరారు. శ్రీశైల క్షేత్రాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తామని తెలిపారు. అలాగే పుష్కరాలకు వచ్చే భక్కులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలుగకుండ ఉండేలా ఎపిలోని అన్ని పుష్కర ఘాట్లలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని, రెండు నదీ పుష్కరాలు తమ హయాంలో రావడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు. పుష్కర సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండ డ్యాంకు నీరు వచ్చి భక్తులకు చాలా సంతోషాన్ని మిగిల్చిందని, అందుకు కూడా కృష్ణానదికి పూజలు చేయాలని కోరారు. సిఎం రాకతో లింగాలగట్టు వద్ద 2 కి.మీ మేర శ్రీశైలం నుండి వచ్చే వాహనాలు ముఖ ద్వారం నుండి సున్నిపెంట వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
అశ్వవాహనంపై
ఊరేగిన ప్రహ్లాదరాయలు
మంత్రాలయం, ఆగస్టు 22: పవిత్ర తుంగా తీరంలో వెలసిన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో సోమవారం రాత్రి శ్రీ ప్రహ్లాదరాయలు అశ్వవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. 345వ సప్త ఆరాధనోత్సవాలు పురస్కరించుకుని మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ఉదయం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం, తులసి అర్చన ఉత్సవ రాయల పాదపూజ, కనక మహాపూజ, నిర్మల్య విసర్జన తదితర ప్రత్యేక పూజలు చేసి మహామంగళ హారతి ఇచ్చారు. అనంతరం బంగారు కవచాలు, వివిధ రకాల పూలతో అలంకరించి భక్తులకు దర్శనం కలిగించారు. భక్తులు గ్రామ దేవత మంచాలమ్మను, శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పీఠాధిపతి శ్రీ మూల రాములుకు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు పూజలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాత్రి శ్రీ ప్రహ్లాద రాలకు ఊంజల సేవ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ మూర్తిని అశ్వవాహనంపై అధిష్ఠించి మఠం ప్రాకారంలో అశేష భక్తుల నడుమ ఘనంగా ఊరేగించారు. అలాగే కొయ్యా, వెండి, బంగారు రథోత్సవాలపై స్వామిని ఊరేగించారు. రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. బెంగళూరుకు చెందిన క్రిష్ణప్ప జోగిచే దాసవాణి, విజయవాడకు చెందిన రోహిత్‌చే కూచిపూడి కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారికి పీఠాధిపతి శేష వస్త్రం, ఫల మంత్రాక్షితలు, జ్ఞాపిక ఇచ్చి ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎఎఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, శ్రీపతాచార్, ఐపి నరసింహమూర్తి, ఇంజనీరు కోణాపూర్ సురేష్, ద్వారపాలక అనంతస్వామి, ప్రిన్సిపల్ వాదిరాజాచార్, ధార్మిక సిబ్బంది వ్యాసరాజాచార్, వాసు, కొప్రేష్, తదితర మఠం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దశాబ్దాల కల సాకారం..
* పట్టాలెక్కనున్న నంద్యాల-యర్రగుంట్ల రైలు
* నేడు జాతికి అంకితం చేయనున్న సిఎం, రైల్వే మంత్రి
నంద్యాల, ఆగస్టు 22: నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూసిన నంద్యాల - ఎర్రగుంట్ల రైలు మంగళవారం ప్రారం భం అవుతుండడంతో ప్రయా ణికుల కల నేటితో తీరనుంది. మంగళవారం రైల్యే మంత్రి సురేష్‌ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడ నుండి రిమోట్ ద్వారా జాతికి అంకితం చేయనున్నారు. అలాగే ఈ మార్గంలో నంద్యాల నుండి కడప వరకు నడిచే డెమో రైలును విజయవాడ నుండి రిమోట్ ద్వారా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం డెమో రైలు నంద్యాలకు చేరుకోగా రైలు వెంటే దక్షిణ మధ్య రైల్వే అధికారులు వచ్చారు. నంద్యాల రైల్వే స్టేషన్‌లోని 1వ నెంబరు ప్లాట్ ఫాం మీద రైల్వే అధికారులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వేదిక సిద్ధం చేశారు. మంగళవారం మధ్యాహ్నం విజయవాడ నుండి రైల్వే మంత్రి, సిఎం రిమోట్ ద్వారా స్విచ్ ఆన్ చేసేందుకు వేదికపై వీడియోలింక్‌లు ఏర్పా టు చేసి అక్కడి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సిసి టివి ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్, సిఎం రమేష్, నంద్యాల ఎంపి ఎస్‌పివై రెడ్డి, కడప ఎంపి అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ప్రొద్దులూరు ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నంద్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన తదితరులకు నంద్యాల రైల్వే అధికారులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వాన పత్రికలు అందజేశారని వీరందరూ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరతారని రైల్వే నంద్యాల అధికారులు తెలిపారు. అలాగే గుంటూరు డిఆర్‌ఎం విజయశర్మ, గుంతకల్లు డిఆర్‌ఎం మల్యాలతో పాటు రెండు డివిజన్‌లకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొంటున్నారు. నంద్యాల నుండి కడప 165 కిమీ ప్రయాణం. నంద్యాల నుండి కడప మధ్య 13 స్టేషన్లు వున్నాయి. నంద్యాల మద్దూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, నొస్సం, ఎస్ ఉప్పలపాడు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, ఎర్రగుడిపాడు, కమలాపురం, గాంగేయపల్లి, కృష్ణాపురం, కడప. నంద్యాల- కడప మధ్య తిరిగే ఈ రైలు బుధవారం ఉదయం నుండి రోజుకు రెండు సార్లు కడపకు వెళ్లి వస్తుంది. వారంలో ఆరు రోజుల్లో మాత్రమే ఈ రైలు నడుస్తుంది. నంద్యాల నుండి ఉదయం, మధ్యాహ్నం కడపకు బయలు దేరుతుంది. ఇలా రోజుకు రెండు ట్రిప్పులు తిరుగుతుంది. ఆదివారం డెమో రైలు మరమ్మతు పనులకు వౌళాలి షెడ్డు వెళ్లి పనులు పూర్తి చేసుకొని సోమవారం తెల్లవారే సరికి నంద్యాల చేరి ఉదయం యథావిధిగా సర్వీసును కొనసాగిస్తుంది. ఈ రైలుకు 8 బోగీలు వుంటాయి. ఒక్కొక్క బోగీలో ప్రయాణికులు కూర్చునేందుకు 80 సీట్లు వున్నాయి.
ఏసిబి వలలో అవినీతి అధికారి
* లంచం తీసుకుంటుండగా టెక్నికల్ అసిస్టెంట్ పట్టివేత
నంద్యాల, ఆగస్టు 22: నంద్యాల పట్టణంలో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పొగాకు కంపెనీ వద్ద ఓ గుత్తేదారు ద్వారా రూ. 66 వేలు నగదును సర్వశిక్ష అభియాన్ టెక్నికల్ అసిస్టెంట్ తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వల వేసి పట్టుకున్నారు. ఎసిబి డిఎస్పీ మహబూబ్‌బాషా తెలిపిన వివరాలు.. సర్వశిక్ష అభియాన్ కింద గుత్తేదారు వెంకటచిన్నారెడ్డి రూ.31 లక్షల విలువ గల పనులను పూర్తి చేసి సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో బిల్లులు చే యాలని టెక్నికల్ అసిస్టెంట్ జి.్భస్కర్‌ను కోరగా కాంట్రాక్టు మొత్తంపై 10 శాతం ఇస్తే బిల్లులుచేస్తామని అన్నట్లు డిఎస్పీ తెలిపారు. పది శాతం మొత్తం ఇవ్వలేక సర్వశిక్ష అభియాన్ అధికారితో బేర సారాలు చేసి రూ. 66 వేలు ఇచ్చేందుకు సంసిద్ధం కావడంతో ఈ విషయాన్ని గుత్తేదారు ఎసిబి అధికారులకు తెలుపగా వారు అవినీతి అధికారిని వల వేసి పట్టుకున్నారు. రూ. 66 వేల నోట్లపై ఎసిబి అధికారులు తమదైన శైలిలో పౌడర్ చల్లి గుత్తేదారు చెన్నా వెంకటరెడ్డి ద్వారా పట్టణంలోని పొగాకు కంపెనీ సమీపంలో గుత్తేదారు బాబాయి ఇంటి వద్ద నగదు ఇవ్వాలని చెప్పడంతో, ఎసిబి అధికారులు మాటువేసి గుత్తేదారు వెంకటచెన్నారెడ్డి టెక్నికల్ అసిస్టెంట్ భాస్కర్‌కు నగదు ఇస్తున్న సమయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. ఈ దాడిలో ఎసిబి సిఐ కృష్ణారెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.