కర్నూల్

చౌకదుకాణాల భర్తీకి 30న నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 26:కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 75 శాశ్వత చౌకాదుకాణాల భర్తీకి ఈ నెల 30వ తేదీ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కర్నూలు రెవెన్యూ అధికారి రఘుబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు అర్బన్‌లో ఓసి-2, బిసి-1, ఎస్సీ-1 ఎస్టీ-1, కర్నూలు రూరల్‌లో ఓసి-1, ఎస్టీ-1, కల్లూరులో ఓసి-1, ఎస్టీ-1, ఓర్వకల్లులో ఓసి-1, ఎస్సీ-1, గూడూరులో బిసిఎ-1, బిసిడి-2, బిసిఇ-1, కోడుమూరులో ఓసి-2, బిసిబి-1, ఎస్టీ-1, సి.బెళగల్‌లో ఓసి-2, క్రిష్ణగిరిలో ఓసి-3, బిసిఎ-1, బిసిడి-1, బిసిఇ-2, డోన్ ఓసి-1, వెల్దుర్తిలో ఓసి-2, బిసిడి-1, ప్యాపిలిలో ఓసి-4, బిసిఎ-1, ఎస్సీ-2, బెతంచర్లలో ఓసి-2, బిసిబి-1, ఎస్సీ-2, ఎస్టీ-1, నందికొట్కూరులో ఓసి-2, బిసిఎ-1, ఎస్సీ-1, ఎస్టీ-1, వికలాంగులకు-1, పగిడ్యాలలో ఓసి-5, బిసిడి-1, మిడుతూరులో ఓసి-3, బిసిబి-1, బిసిడి-1, ఎస్సీ-2, ఎస్టీ-2, జూపాడుబంగ్లాలో ఓసి-1, బిసిఇ-1, వికలాంగులకు-1, ఆత్మకూరులో ఓసి-1, ఎస్సీ-2, వెలుగోడులో ఓసి-1, వికలాంగులకు-1, కొత్తపల్లి ఎస్సీ-1 దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 8వ తేదీ లోపు సంబంధిత తహశీల్దార్ కార్యాలయంలో ఇచ్చి తగిన రశీదు పొందాలన్నారు. రాత పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రాల వివరాలను హాల్‌టికెట్ ద్వారా తెలుపుతామని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు.
రైతుల కళ్లల్లో ఆనందం నింపుతాం..
* టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి కెఇ ప్రతాప్
డోన్, డిసెంబర్ 26:ఏడాది లోగా నియోజకవర్గంలోని చెరువులతో పాటు కుంటలను హంద్రీనీవా నీటితో నింపి రైతుల కళ్లల్లో ఆనందం నింపుతామని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కెఇ ప్రతాప్ స్పష్టం చేశారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్‌లో రూ. కోటి వ్యయంతో తలపెట్టిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంతో పాటు వివిధ అబివృద్ధి పనులకు శనివారం కెఇ శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 1.8 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ఎద్దుల బండ్లు, నీటి పంప్ మోటార్లు, స్ప్రేయర్ పంపులు, ట్రాక్టర్‌లతో పాటు వ్యవసాయ పరికరాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ ఆవరణలో కమిటీ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కెఇ ప్రతాప్ ప్రసంగించారు. కోస్తా ప్రాంతంలో రైతులు మూడు పంటలు పండిస్తారని, ఆ ప్రాంతానికి దీటుగా కర్నూలు జిల్లాను అబివృద్ధి చేయాలనే సంకల్పంతో డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి, కలెక్టర్ విజయ్‌మోహన్ కృతనిశ్చయంతో వున్నారని తెలిపారు. అందులో భాగంగానే ఏడాదిలోగా జిల్లాలోని చెరువులు, కుంటలను నీటితో నింపి రైతులు రెండు పంటలు పండించాలనే ధ్యేయంతో పని చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రైతుల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలు చేపడుతున్నట్లు తెలిపారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ ఏర్పాటైన 40 ఏళ్లలో రూ. 5 కోట్ల పనులు జరిగితే డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి, టిడిపి ఇన్‌చార్జి కెఇ ప్రతాప్ సహకారంతో ఏడాదిలోనే రూ. 5 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం మార్కెట్ యార్డ్‌లో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. కెఇ సోదరుల సహకారంతో మరింత అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో గొర్రెల సహకార సంఘ జిల్లా చైర్మన్ వై.నాగేశ్వరరావుయాదవ్, మున్సిపల్ చైర్మన్ కొట్రికె గాయత్రిదేవి, డోన్, ప్యాపిలి, క్రిష్ణగిరి ఎంపిపిలు టిఇ లక్ష్మిదేవి, సరస్వతి, ఆలంకొండ గంగమ్మ, జడ్‌పిటిసిలు శ్రీరాములు, పద్మావతి, వైస్ ఎంపిపిలు టివి చలం, కెఇ సుభాషిణి, నాయకులు ఆలంకొండ నబిసాహెబ్, మహేశ్‌కన్నా, పోచా ప్రభాకరరెడ్డి, భాష్యం వెంకటరమణ, భాష్యం శ్రీనివాసులు, తెలుగుయువత నాయకులు సుధీష్‌రాజ్, కాలేషా, కిరణ్ యాదవ్, కౌన్సిలర్లు పెద్దయ్య, రాజు, కవీశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.