కర్నూల్

ఫలితమివ్వని రెయిన్‌గన్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 7:ఎండుతున్న పంటను కాపాడి రైతుకు భరోసా ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన మసకబారుతోంది. వర్షాభావం కారణంగా ఎండే దశకు చేరుకున్న పంటకు రెయిన్‌గన్ ద్వారా నీటి తడులను ఇచ్చి పంటను కాపాడాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు కనీస ఫలితాలను ఇవ్వడం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. రెయిన్‌గన్ ద్వారా పంటను కాపాడేందుకు ప్రధానంగా నీటి కొరత, రైతుల వద్ద పెట్టుబడి సమస్య ఆటంకాలు సృష్టిస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఆగస్టు మాసం లో కురవాల్సిన వర్షం కురవకపోవడంతో ప్రభు త్వం చివరి వారంలో పంటను కాపాడేందుకు పరుగులు తీసింది. అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసినా పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో అరకొర వర్షాలు కురవడంతో అక్కడి పంటలు దాదాపు ఎండిపోయాయ. వీటిని కాపాడేందుకు వారం రోజుల క్రితం రెయిన్‌గన్లు ద్వారా చేసిన ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెయిన్‌గన్ ద్వారా ఒక ఎకరా పంటకు నీటి తడి ఇవ్వాలంటే సుమారు 40వేల లీటర్ల నీరు అవసరమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నీటిని సరఫరా చేసేందుకు రూ.12వేలు ఖర్చు వస్తోంది. ఇందులో 80శాతం ప్రభుత్వం, 20శాతం రైతులు ఖర్చు పెట్టాల్సి ఉంది. నీటి సరఫరా కోసం దూర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకువచ్చి రెయిన్‌గన్ ద్వారా పంటపై చల్లుతున్నారు. అయితే వాతావరణంలో వేడి పెరగడంతో ఒక వైపు నీరు చల్లి రెండో వైపు వెళ్లే సమయానికి మొదట చల్లిన నీరు భూమిలోకి ఇంకి పోయి యథాతధస్థితికి చేరుకుంటోందని రైతులు అంటున్నారు. దీనికి కారణం భూమిలో తేమ లేకపోవడమేనని వారు వెల్లడిస్తున్నారు. మరో 10వేల లీటర్ల నీటిని అదనంగా తడి ఇవ్వాలనుకున్నా ట్యాంకర్లకు డీజిల్ ఖర్చులకు కూడా తమ వద్ద లేదని వాపోతున్నారు. జిల్లాలో 6.21లక్షల హెక్టార్లలో పంట సాగు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 4.80లక్షల హెక్టార్లలో పంట సాగవుతోంది. ఇందులో ఒక్క వేరు శనగ పంట 98వేల హెక్టార్లలో సాగవుతోంది. పత్తి 1.50లక్షల హెక్టార్లు, కంది 86వేల హెకార్టలో ప్రధానంగా సాగులో ఉంది. వీ టిలో వేరుశనగ పంట దాదాపు ఎండిపోయింది. ఒక్క ఎకరాలో కూడా కనీసం పంటను తీసేందుకు చేసే కూలీ ఖర్చు లు కూడా తిరిగి చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర వర్షాభావం పరిస్థితుల కారణంగా ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో వేరు శనగ, పత్తి పంటలు కలిపి సుమారు 18వేల హెకార్లు సాగులో ఉండగా ఆదోని రెవెన్యూ డివిజన్‌లో అధిక భాగం, కర్నూలు రెవెన్యూ డివిజన్‌లోని కోడుమూరు, డోన్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం సుమారు 45వేల హెక్టార్లలో వేరు శనగ, పత్తి పంట సాగులో ఉంది. ఇందులో వేరు శనగ పంట ఒక్క కాయ కూడా దిగుబడి రాని పరిస్థితి నెలకొనగా పత్తి పంట మరో నాలుగైదు రోజుల తరువాత రక్షక తడులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక కొర్ర, కంది, ఉల్లి, టమోటా దిగుబడులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వారంటున్నారు. మరో వైపు ప్రస్తుతం ఉల్లి ధరలు పతనమైనందున రెయిన్‌గన్ ద్వారా ఖర్చును భరించి నీటి తడులను ఇస్తే తమకు తిరిగి కనీసం పెట్టుబడైనా వస్తుందా అన్న అనుమానం రైతుల్లో ఉంది. దీని కారణంగా అత్యధిక మంది రైతులు రెయిన్‌గన్‌లు వినియోగించి నీటి తడులను అందించడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో ఆగస్టు మాసం సగటు వర్షపాతం కన్నా సుమారు 80 నుంచి 85శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. మిగిలిన ఆదోని రెవెన్యూ డివిజన్, కర్నూలు డివిజన్‌లోని కోడుమూరు, డోన్ నియోజకవర్గాల్లో సుమారు 50 నుంచి 60శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. వర్షం లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్లలో నీరు ఎండిపోయింది. దీంతో ఆలూరు, పత్తికొండ ప్రాంతాల్లో రెయిన్‌గన్‌ల వినియోగానికి పందికోన జలాశయం, హంద్రీ-నీవా కాలువ నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. అధికారులు చేస్తున్న ప్రయత్నాలు బాగానే ఉన్నా వాతావరణ పరిస్థితుల కారణంగా రెయిన్‌గన్ తమకు భరోసా ఇవ్వలేకపోతోందని రైతులు స్పష్టం చేస్తున్నారు.

తల్లడిల్లిన తిప్పనపల్లి
చాగలమర్రి, సెప్టెంబర్ 7:చాగలమర్రి మండలం తిప్పనపల్లె గ్రామంలో బుధవారం సాయంత్రం ఊట చెరువులో మునిగి నలుగురు విద్యార్థులు చనిపోయారు. గ్రామానికి చెందిన ప్రతాప్ కుమారుడు గడ్డం విష్ణువర్ధన్ (12), గడ్డం తిరుపాలు కుమారుడు గడ్డం శ్రీహరి (13), గడ్డం బలరాం కుమారుడు గడ్డం రాము (12), బండి నాగేశ్వరరావు కుమారుడు బండి ఓబులేసు (10) అనే విద్యార్థులు మృతి చెందారు. దీంతో గణేష్ నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామంలో వినాయకచవితి సందర్బంగా ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని బుధవారం నిమజ్జనం చేసేందుకు గ్రామోత్సవానికి ముందే మృతి చెందిన ఈ నలుగురు విద్యార్థులు ఈతకై తోటి స్నేహితులతో చెరువు వద్దకు చేరుకున్నారు. చెరువులో తక్కువగా నీరు ఉన్నాయని భావించి ఈత కొట్టేందుకు దిగి మునిగిపోయారు. బుధవారం ఉదయం తెలుగుగంగ నీరు చెరువుకు విడుదల చేయడంతో నీటి మట్టం పెరిగి ఉండడంతో ఈ నలుగురు పిల్లలు గుర్తించకపోవడంతో మునిగిపోయారు. చెరువు గట్టుపై ఉన్న తోటి స్నేహితులు ఈ విషయాన్ని గ్రహించి గ్రామ పెద్దలకు తెలుపడంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని నీటిలో గాలించి నలుగురిని బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న నలుగురు పిల్లలను చాగలమర్రి ఎస్‌ఐ మోహన్‌రెడ్డి పోలీసు జీపులోనే ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తమ సిబ్బంది సహాయంతో తీసుకుని వెళ్లారు. మార్గమద్యలో విష్ణవర్థన్ మృతి చెందగా, ముగ్గురు విద్యార్థులు కొద్ది సేపటికే కన్నుమూశారు. కొన ఊపిరితో ఉన్న పిల్లలను కాపాడలేకపోయానని ఎస్‌ఐ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విష్ణువర్ధన్ శవాన్ని గ్రామానికి తీసుకురాగానే అతని తండ్రి ప్రతాప్, తల్లి కన్న కొడుకు చనిపోయాడన్న బాధను తట్టుకోలేక పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. గ్రామస్థులు, బంధువులు వారిని వారించారు. చిన్న పిల్లలు చనిపోవడంతో వారి తల్లిదండ్రులు, బంధువులు శవాలపై పడి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు పలువురు కంటతడి పెట్టారు. చెరువు తమ పిల్లలను పొట్టన పెట్టుకుందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామాన్ని, చెరువును ఆళ్లగడ్డ సిఐ ఓబులేసు సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నంద్యాల ఆర్‌ఎస్ నుంచి కొత్త వంగడాలు
నంద్యాల, సెప్టెంబర్ 7:రాష్ట్ర విత్తన కమిటీ, ఆచార్య ఎన్‌జి రంగ విశ్వవిద్యాలయం వారు వివిధ పంటలలో రూపొందించిన నూతన వంగడాలను ఇటీవల విడుదల చేసినట్లు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఎడిఆర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం నంద్యాల ఆర్‌ఎఆర్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7 వంగడాలను విడుదల చేయగా, వాటిలో నాలుగు వంగడాలు అత్యల్ప వర్షపాత మండలంలో రూపొందించినవి అని వాటిలో కూడా మూడు వంగడాలు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వారు రూపొందించినవేనని ఆయన తెలిపారు. వీటిలో నాల్గవది కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం వారు విడుదల చేసిన వేరుశనగ నూతన వం గడం అన్నారు. నంద్యాల ఆర్‌ఎఆర్‌ఎ స్ నుంచి విడుదల చేసిన నూతన వం గడాలలో 1. వరి ఎన్‌డిఎల్‌ఆర్ -7 (నం ద్యాల సోనా). ఈ రకం బిపిటి 5204 (కర్నూలు సోనా)కు ప్రత్యామ్నాయం గా రూపొందించినట్లు ఆయన తెలిపారు. నంద్యాల సోనా వరి రకం గిం జ నాణ్యత, పరిమాణం, వండినప్పు డు రుచి, వండిన అన్నం నిల్వ సామ ర్థ్యం ఎక్కువగా ఉంటుందన్నారు. కర్నూలు సోనాతో సమానంగా ఉండడమేకాక కర్నూలు సోనా 150 రోజుల్లో పంట చేతికి వస్తుందని, అయితే నంద్యాల సోనా ఖరీఫ్, రబీలో సాగుచేసుకోవచ్చని, ఖరీఫ్‌లో 140 రోజులు, రబీలో 135 రోజుల్లో పంట కోతకు వస్తుందన్నారు. ఈ వంగడం దోమ పోటు, ఆకు ముడత, అగ్గి తెగులును తట్టుకోవడమేకాక పంట కోత దశకు వచ్చినప్పటికి వరి పైరు పడిపోదని, గింజ రాలదని, సరాసరి దిగుబడి ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళు వస్తుందన్నారు. ఆలస్యంగా నాట్లు వేసేందుకు నంద్యాల సోనా అనుకూలంగా ఉంటుందన్నారు. విడుదలకు ముందుగానే ఈ రకం రాష్ట్రంలోని కర్నూలు, అనంతపురం, కడప, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోను, కర్నాటకలోని రాయచూరు, గంగావతి, హోసూరు, బళ్లారి జిల్లాల్లో ప్రాచూర్యం పొందిందని, ప్రస్తుతం ఈ రకం 75 కిలోల వరి బిపిటి 5204 వరి ధాన్యం కన్నా మార్కెట్‌లో రూ.100 నుంచి రూ.150 వరకు అధిక ధర పలుకుతోందన్నారు. 2015-16 సంవత్సరంలో ఈరకం వరి కర్నూలు జిల్లాలో 8 వేల ఎకరాల్లో కడప జిల్లాలో వెయ్యి ఎకరాల్లో, కర్నాటక రాష్ట్రంలో 3500 ఎకరాల్లో సాగుచేశారన్నారు.
2. పప్పు శనగ ఎన్‌బిజి-49 (నంద్యాల గ్రామ్-49): ఇది అధిక దిగుబడి ఇచ్చు దేశవాలి రకమని, పంట కాలం 90 నుంచి 105 రోజుల్లో కోతకు వస్తుందన్నారు. దిగుబడి 20 నుంచి 25 క్వింటాలు వస్తుందని, గింజలు మంచి సైజు, నాణ్యత, రంగు కలిగి ఉండడం వల్ల మార్కెట్‌లో మంచి ధర లభిస్తుందన్నారు. ఇది రాష్ట్రంలో జెజి -11 రకానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందన్నారు.
3. ప్రొద్దుతిరుగుడు: ఎన్‌డిఎస్‌హెచ్ -1012 (ప్రభాత్) ఇది తక్కువ కాల పరిమితి, అధిక దిగుబడి, అధిక నూనెశాతం గల పొద్దుతిరుగుడు సంకర జాతి రకానికి చెందిన వంగడం. దీని పంట కాలం 90 నుంచి 95 రోజులు. దిగుబడి వర్షాధారం కింద ఎకరాకు 6 నుంచి 7 క్వింటాలు, నీటిపారుదల కింద 10 క్వింటాలు వరకు వస్తుంది. నూనెశాతం 40-41 శాతం ఉంటుందన్నారు. వంద గింజల బరువు 4 నుంచి 5 గ్రాములు. ఈ వంగడం బూజు తెగులును తట్టుకుంటుందని, ఇది కెబిఎస్‌హెచ్ 44, డిఆర్‌ఎస్ హెచ్ 1, ఎస్‌బి 275, ప్రైవేటు సంకరాలకు మంచి ప్రత్యామ్నాయం.
4. వేరుశనగ: కె 1535 (కదిరి అమరావతి) ఇది కె6 (కదిరి 6) రకానికి ప్రత్యామ్నాయం. ఈ రకం వివిధ రకాలైన పురుగులను, వ్యాధులను తట్టుకునే శక్తితోపాటు బెట్టను తట్టుకునే శక్తి కలిగి ఉంటుంది. ఇది వేరుశనగ కాండం కుళ్లు తెలుగు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాగుచేయుటకు అనుకూలం. దీని గింజలు మంచి రకం, పరిమాణం కలిగి ఉంటుందని, ఎగుమతికి మంచి రకమన్నారు.

ఎసిబికి చిక్కిన ట్రెజరీ సీనియర్ అసిస్టెంట్
సంజామల/కోవెలకుంట్ల, సెప్టెంబర్ 7: అవినీతి నిరోదక శాఖ అధికారులు కోవెలకుంట్ల ట్రెజరీ సీనియర్ అసిస్టెంట్ ఫకృద్దీన్ బుధవారం లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఉయ్యాలవాడకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు బషీర్ అహ్మద్‌కు ప్రభుత్వం నుండి రావాల్సిన మొత్తాన్ని తనకు ఇప్పించే విధంగా చూడాలని సీనియర్ అసిస్టెంట్‌ను అడుగడంతో ఆయన రూ.10 వేలు ఇవ్వాలని తెలిపారు. చివరకు రూ.5 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. జిల్లా ఎసిబి అధికారులకు బషీర్ అహ్మద్ సమాచారం ఇవ్వడంతో బుధవారం ఉదయం ట్రెజరీ కార్యాలయంలో బుధవారం ఫకృద్దీన్ రూ.5 వేలు డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈకార్యక్రమంలో ఎసిబి డిఎస్పీ మహబూబ్‌బాషా, సిఐ వెంకటకృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
అవుకు రిజర్వాయర్‌కు భారీ ఇన్‌ఫ్లో
అవుకు,సెప్టెంబర్ 7:శ్రీశైలం జలాశయం నుండి యస్‌ఆర్‌బిసి ప్రధాన కాలువ ద్వారా అవుకు రిజర్వాయర్‌కు భారీగా ఇన్‌ఫ్లో పెరిగింది. అవుకు రిజర్వాయర్‌ను నింపాలన్న అధికారుల ఉత్తర్వుల మేరకు సుమారు 600క్యూసెక్కు ల నీరు రిజర్వాయర్‌కు చేరుతుం ది. ఇఇ పాపరావ్ మాట్లాడుతూ ఈ ప్రకారం నీరు రిజర్వాయర్‌కు చేరితే నెల రోజులలోపే రిజర్వాయర్‌కు రెండు టియంసిల నీరు చేరుతుందన్నారు. అవుకు రిజర్వాయర్, యస్‌ఆర్‌బిసి కాలువ ఆయకట్టురైతులు ఖరీఫ్‌సీజన్‌లో వేసిన వరి పంటను దక్కించుకోవచ్చని తెలిపారు. ప్రస్తుత సీజన్‌లో రిజర్వాయర్‌లో రెండు టియంసిల నీరు నింపుతామని ఇఇ స్పష్టం చేశారు.
ఎమ్మిగనూరులో ఎస్పీ పర్యటన
ఎమ్మిగనూరు, సెప్టెంబర్ 7: ఎస్పీ రవికృష్ణ ఎమ్మిగనూరుకు వచ్చారు. ఈ మేరకు బుధవారం తేరు బజారులోని వినాయక విగ్రహానికి,పోలీసు స్టేషన్‌లో ఆవరణలో ఏర్పాటు చేసిన విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే టౌన్, రూరల్ పోలీసు స్టేషన్‌లు పర్యవేక్షించారు. అనారోగ్యం గురైన కానిస్టేబుల్ లక్ష్మయ్య కుటుంబానికి పరామార్శించి, పోలీసు క్వాటర్స్‌ను పరిశీలించారు. అనంతరం వినాయక చవితి సందర్భంగా పట్టణంలో సోమప్ప నుండి పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ రవికృష్ణ సైకిల్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఉత్తేజ పలికారు. అలాగే నిమజ్జనం ఏర్పాట్లను అయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాస రావు, సిఐ శ్రీనివాసమూర్తి, ఎస్‌ఐలు శంకరయ్య, వేణుగోపాల్ పోలీసు సిబ్బంది సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు.