కర్నూల్

‘హోదా’ బంద్ పాక్షికం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 10:రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్రం, తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందాయని ఆరోపిస్తూ ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనన్న డిమాండ్‌తో వైకాపా పిలుపునిచ్చిన బంద్, కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమాలను శనివారం జిల్లాలో పాక్షికంగా నిర్వహించగలిగారు. బంద్ నిర్వహించడానికి వచ్చిన నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేయడం, పలువురు నాయకులను గృహ నిర్బంధం చేయడంతో ఉదయం 11 గంటలకే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా బంద్‌కు సిపిఎం, సిపిఐతో పాటు పలు విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమానికి పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి రాకతో పోలీసులు ఆచితూచి నిర్ణయం తీసుకోవడంతో బెంగళూరు జాతీయ రహదారిపై సుమారు గంట పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, డిసిసి అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నగర శివారులోని తుంగభద్ర నది వంతెనపై ఉదయం 10గంటల ప్రాంతంలో బైఠాయించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనను విరమించుకోవాలని కోరినా ఫలితం లేకపోవడంతో 11గంటల సమయంలో వారిని అరెస్టు చేసి నగరంలోని 2వ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాంతో జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం తొలిగిపోయింది. ఇక వైకాపా బంద్ నిర్వహించకుండా పోలీసులు ఉదయం నుంచే వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. ఆర్టీసీ అధికారులకు ముందస్తు సూచనలు ఇచ్చి జిల్లా వ్యాప్తంగా ఉన్న 935 ఆర్టీసీ బస్సులను డిపోలకు పరిమితం చేశారు. బంద్ నిర్వహించడానికి వచ్చిన నాయకులను కొద్ది సమయం ఆందోళన నిర్వహించడానికి అనుమతించి ఆ తరువాత పోలీస్‌స్టేషన్లకు తరలించారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్యతో పాటు ఇతర నియోజకవర్గాల్లో వైకాపా ఇన్‌చార్జిల్లో అత్యధిక మందిని గృహ నిర్బంధం చేయడంతో వారు బంద్‌లో పాల్గొనడానికి వీలులేకపోయింది. వైకాపాకు చెందిన ఇతర ముఖ్య నేతలను, సిపిఎం, సిపిఐ నాయకులను కూడా పోలీసులు బంద్‌లో పాల్గొనకుండా అడ్డుకుని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. బంద్ నిర్వాహకులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవడంతో ఉదయం 8 గంటల ప్రాంతంలో కొన్ని ఆర్టీసీ సర్వీసులను రోడ్డుపైకి అనుమతించారు. ఆ తరువాత 10గంటల సమమానికి సుమారు 450 బస్సు సర్వీసులను, 11 గంటలకు అన్ని సర్వీసులను నడపగలిగారు. ఇక వారం రోజుల క్రితమే జాతీయ సమ్మెలో పాల్గొన్న ఆటో డ్రైవర్లు కూడా శనివారం బంద్‌లో పాల్గొనడానికి ఇబ్బందులు పడ్డారు. ఆటోలు రోడ్డెక్కినప్పటికీ పెద్దగా అవాంతరాలు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా 11గంటల సమయానికి సాధారణ పరిస్థితి నెలకొంది. ఇక ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు 2వ శనివారం కావడంతో తెరచుకోలేదు. ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ కారణంగా ముందుగానే సెలవు ప్రకటించడంతో అవి కూడా మూతబడ్డాయి. బంద్ పాక్షికంగా ఉండటంతో వ్యాపారులు ఉదయం 11గంటల సమయానికి దుకాణాలు తెరిచి యధావిధిగా వ్యాపారాలు నిర్వహించుకున్నారు. సినిమా హాళ్లలో అన్ని ఆటలను ప్రదర్శించగలిగారు. ప్రధానంగా ప్రజా రవాణా వ్యవస్థకు ఎలాంటి ఆటంకాలు లేకపోవడంతో బంద్ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. జాతీయ రహదారిపై మాత్రం గంటకు పైగా కాంగ్రెస్ నేతలు బైఠాయించడంతో అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. నేతలను అరెస్టు చేసిన తరువాత ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి పోలీసులు సుమారు గంట పాటు శ్రమించాల్సిన వచ్చింది. బంద్‌ను అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో పాక్షికంగా నిర్వహించగలిగినా ప్రజల మద్దతు కూడగట్టగలిగామని ఆయా పార్టీల నాయకులు పేర్కొన్నారు.
టిడిపిలోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ!
* చంద్రబాబుతో సుధాకర్‌బాబు చర్చలు..
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, సెప్టెంబర్ 10:కర్నూలు డిసిసి ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యుడు సుధాకర్‌బాబు తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై సుధాకర్‌బాబు శనివారం హైదరాబాద్‌లో శాసన మండలి సమావేశాలకు హాజరైన టిడిపి అధినేత చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం. ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని స్థానిక నేతలు సుధాకర్‌బాబు వద్ద ప్రస్తావించగా టిడిపిలో చేరాలని చంద్రబాబు ఆహ్వానించారని, అయితే తాను సమాధానం చెప్పలేదని వెల్లడించినట్లు పేర్కొంటున్నారు. కర్నూలు పురపాలక సంఘం చైర్మన్‌గా పని చేసిన సుధాకర్‌బాబు కోట్ల కుటుంబానికి వీర విధేయుడిగా ముద్రపడ్డారు. ఆయనను ఆరేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గవర్నర్ కోటాలో శాసన మండలికి ఎంపిక చేశారు. ఈ ఏడాది చివర్లో ఆయన పదవీ కాలం ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో సుధాకర్‌బాబు మరోమారు శాసన మండలికి వెళ్లడానికి సిఎం చంద్రబాబు సహాయం కోరి ఉండవచ్చని ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో కొందరు చర్చించుకుంటున్నారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ చేసిన ప్రయత్నాల్లో భాగమే సుధాకర్‌బాబు పార్టీ మార్పుపై ఆలోచించి ఉండవచ్చని మరి కొందరు చర్చించుకుంటున్నారు. కాగా ఈ విషయం తనకు తెలియదని పార్టీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌పార్టీ పిలుపు మేరకు శనివారం నగరంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో సుధాకర్‌బాబు పాల్గొనకపోవడంతో ఆ పార్టీ నాయకుల్లో సైతం సుధాకర్ పార్టీ వీడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన బివై రామయ్య రెండు వారాల క్రితం కాంగ్రెస్ నుంచి వైకాపాలో చేరిన విషయం విదితమే. తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌బాబు అధికార పార్టీలో చేరుతున్నారన్న ప్రచారం కార్యకర్తలను ఆలోచనలో పడేసిందని నాయకులు పేర్కొంటున్నారు.
ఆరుతడి పంటలు వేసుకోవాలి
* తుంగభద్ర బోర్డు ఎస్‌ఇ శశిభూషణ్‌రావు
హొళగుంద, సెప్టెంబర్,10: తుంగభద్ర జలాశయంలో తగినంత నేరు లేనందున రైతులు వరికి బదులు ఆరుతడి పంటలైన జొన్న, సజ్జ, మిరప, ప్రొద్దుతిరుగుడు వేసుకోవాలని తుంగభద్ర బోర్డు ఎస్‌ఇ శశిభూషన్‌రావు అన్నారు. శనివారం హొళగుందలోని గభద్ర బోర్డు అతిథిగృహంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం డ్యాంలో 44 టీఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉందన్నారు. ఖరీఫ్ పంటలు వేసుకోవాలంటే డ్యామ్‌లో 62 టీఎంసిల నీరు ఉండాలన్నారు. రెండు రాష్ట్రాల నిర్ణయం మేరకు ఎల్లెల్సీకి నీటి సరఫరా జరగుతుందన్నారు. కర్నాటకలో జలచౌర్యం అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సకాలంలో వర్షాలు పడితే సాగునీటి సమస్య తీరుతుందన్నారు. సమావేశంలో ఎస్‌డిఓలు పంపన్నగౌడ్, మల్లికార్జున పాల్గొన్నారు.
దోచుకోవడానికే ప్యాకేజీ వైపు మొగ్గు
* టిడిపి సర్కారుపై ఎంపి రేణుక ధ్వజం
కర్నూలు సిటీ, సెప్టెంబర్ 10: ప్రత్యేక హోదా వల్ల అధికార పార్టీ నాయకులకు దోచుకోవటానికి వీలుకాదని, దాంతో టిడిపి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపుతుందని ఎంపి బుట్టా రేణుక విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు వస్తాయి.. పారిశ్రామికవేత్తలు స్వచ్ఛందంగా వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని, సిఎం చంద్రబాబు విదేశాల్లో పర్యటించాల్సిన అవసరం ఉండదని ఎంపి బుట్టా రేణుక పేర్కొన్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం వైకాపా ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా ఎంపి రేణుక మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నో అడ్డంకులు వచ్చాయని, ఇలాంటి తరుణంలో రాష్ట్భ్రావృద్ధి కోసం అందరూ కలిసి పోరాడాల్సింది పోయి టిడిపి కేంద్రానికి వత్తాసు పలకడం దారుణమన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాల మేరకు ప్రత్యేక హోదాతో పాటు ఇవ్వాల్సిన రాయితీల కంటే తక్కువగానే ప్యాకేజీ కేటాయించినా సిఎం చంద్రబాబు, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా సిఎం స్పందించి ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై వత్తిడి తేవాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి బివై. రామయ్య, కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జి హఫీజ్‌ఖాన్, సురేంద్రరెడ్డి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
రైతులకు నష్టపరిహారం చెల్లించేదాకా
సోలార్ పవర్ గ్రిడ్ పనులు నిలిపివేయాలి
* జిల్లా సిపిఎం కార్యదర్శి ప్రభాకరరెడ్డి
ఓర్వకల్లు, సెప్టెంబర్ 10:్భ నిర్వాసిత రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించేదాకా మండల పరిధిలోని శకునాల గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని జిల్లా సిపి ఎం కార్యదర్శి ప్రభాకరరెడ్డి సూచించారు. సిపిఎం ఆధ్వర్యంలో శనివారం భూ నిర్వాసిత రైతులు మరోసారి సోలార్ పవర్ గ్రిడ్ పనులను అడ్డుకుని నిలిపివేశారు. ఈ సందర్భంగా ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ భూనిర్వాసిత రైతులు గత రెండు రోజులుగా నష్టపరిహారం కోసం నిరాహార దీక్ష చేపట్టినా ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడం శోచనీయమన్నారు. నష్టపరిహారం చెల్లించే దాకా ప్రభుత్వం కూడా పవర్ గ్రిడ్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారుల తప్పిదం వల్ల లబ్ధిదారుల ఎంపిక కూడా సక్రమంగా జరగలేదన్నారు. మళ్లీ పూర్తిస్థాయిలో విచారణ చేసి లబ్ధిదారులను గుర్తిస్తామని అధికారులు మాయమాటలు చెప్పి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రత్యేక పోర్టు ఏర్పాటు చేసి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పిన మాటలు ఇంతవరకూ అమలు కాలేదన్నారు. పవర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పేద రైతులు పొలాలతో పాటు ఉపాధి కోల్పోతున్నా వారికి నష్టపరిహారం చెల్లింపులో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందని ప్రశ్నించారు. లబ్ధిదారుల ఎంపికలో జరిగిన తప్పిదం వల్ల ఇప్పటికే గ్రామానికి చెందిన ఒక రైతు గుండెపోటుతో, మరొక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడని అయినా అధికారులు, అధికార పార్టీ నేతలు పట్టించుకోకపోవడం ఎంతవరకూ న్యాయమని ప్రశ్నించారు. మృతిచెందిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. రైతులకు నష్టపరిహారం చెల్లించే వరకూ పవర్ గ్రిడ్ పనులను అడ్డుకుంటామని సృష్టం చేశారు. ప్రజా, రైతు సంఘాలతో కలిసి సిపిఎం, సిపిఐ రైతుల పక్షాన వుండి పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో పాణ్యం డివిజన్ కార్యదర్శి కె.రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు నాగన్న, గోపాల్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
14న కెసికి నీటి విడుదల
* నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి మాండ్ర
నందికొట్కూరు, సెప్టెంబర్ 10:ఈ నెల 14వ తేదీ డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కెసికి కృష్ణా జలాలు విడుదల చేస్తారని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి తెలిపారు. మాండ్ర శనివారం మల్యాల హంద్రీనీవా ప్రాజెక్టు వద్ద కృష్ణా జలాలను కెసికి విడుదల చేసే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాండ్ర విలేఖరులతో మాట్లాడుతూ 12వ పంపు నిర్మాణం పూర్తి కావడంతో ట్రయల్ రన్ విజయవంతమైందని, 1వ పంపు నిర్మాణం పూర్తి చేసి సోమవారం ట్రయల్న్ నిర్వహించి ఈ నెల 14వ తేదీ డిప్యూటీ సిఎం కెఇ, మంత్రి దేవినేని ఉమా నీటి విడుదలను ప్రారంభిస్తారన్నారు. కాగా మరో రెండు పంపుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశామని, అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభించి కెసి రైతులకు సమృద్ధిగా సాగునీరు అందిస్తామన్నారు. కెసి రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. మాండ్ర వెంట మార్కెట్‌యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి, వైస్ చైర్మన్ సాయిజ్యోతి, ఎంపిపి వీరం ప్రసాదరెడ్డి, టిడిపి నాయకులు, తదితరులు ఉన్నారు.