కర్నూల్

కర్నూలు, నంద్యాలలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 12:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సోమవారం రాత్రి కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్లలో భారీ వర్షం కురిసింది. నిత్య కరవుతో అల్లాడుతున్న పడమర ప్రాంతంలోని ఆదోని రెవెన్యూ డివిజన్‌లో చిరుజల్లులతో సరిపెట్టింది. నంద్యాల డివిజన్‌లో అత్యధికంగా 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కర్నూలు రెవెన్యూ డివిజన్‌లో 2.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా నంద్యాల డివిజన్‌లోని ఆళ్లగడ్డలో 5.8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు ప్రకటించారు. ఆ తరువాత చాగలమర్రి మండలంలో 5.7, మహానందిలో 4.3, రుద్రవరంలో 3.3, గోస్పాలో 3.25, నంద్యాలలో 2.95 సెం.మీ వర్షం కురిసింది. కర్నూలు రెవెన్యూ డివిజన్‌లో అత్యధికంగా జూపాడుబంగ్లా మండలంలో 3.5 సెం.మీ, నందికొట్కూరు మండలంలో 2.75 సెం.మీ, కర్నూలు, కల్లూరు మండలాల్లో 1 సెం.మీ చొప్పున వర్షం కురిసినట్లు పేర్కొన్నారు. ఆదోని డివిజన్ మినహా ఇతర అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైందని స్పష్టం చేశారు. కాగా ఆదోని డివిజన్‌లో మంగళవారం వర్షం కురుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో కురిసిన వర్షంతో పత్తి, కంది పంటలకు మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పత్తి పంట జిల్లాలో 1.5 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా ఇందులో సుమారు 70 వేల హెక్టార్లు ఒక్క ఆదోని డివిజన్‌లో సాగవుతోంది. అయితే ఈ ప్రాంతంలో చినుకు జాడ లేకపోవడంతో రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. కర్నూలు, నంద్యాల డివిజన్‌లో సాగులో ఉన్న
సుమారు 80వేల హెక్టార్ల పత్తి పంటకు ఈ వర్షం జీవం పోసిందని వెల్లడిస్తున్నారు. కంది పంట జిల్లా వ్యాప్తంగా 86వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఈ పంట అధికంగా కర్నూలు, నంద్యాల డివిజన్లలో సాగవుతుంగా సుమారు 20వేల హెక్టార్లు ఆదోని డివిజన్‌లో సాగులో ఉన్నట్లు వెల్లడవుతోంది. కాగా 99వేల హెక్టార్లకు పైగా సాగు చేసిన వేరుశెనగ పంటలో అతికొద్ది పంట మాత్రమే ఎంతో కొంత దిగుబడి ఇచ్చే అవకాశం ఉందని 95శాతానికి పైగా పంట ఎండిపోయిందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా సోమవారం కురిసిన వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా తమ ప్రాంతంలో కురవకపోతుందా అని పడమర రైతులు ఆశాభావంతో ఉన్నారు.
రెయిన్‌గన్ బూటకం..
* కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య
ఆలూరు, సెప్టెంబర్ 12: టిడిపి ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు రైయిన్‌గన్ల ద్వారా పంటలను కాపాడుతున్నామని మోసం చేస్తున్నారని కేంద్ర మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి విమర్శించారు. సోమవారం మండలంలోని అరికెర గ్రామంలో వేరుశెనగ పంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ముఖ్యమంత్రి అరికెరలో ప్రారంభించిన రెయిన్‌గన్ వేరుశెనగ పంటకు ఏమాత్రం లాభం లేదన్నారు. ప్రభుత్వం వేరుశెనగ, ఉల్లి రైతులకు ఎకరాకు రూ.10వేలు నష్ట పరిహారం అందించాలని డిమాండు చేశారు. ప్రభుత్వం దిగిరాక పోతే పాదయాత్రలు చేపడతామని హెచ్చరించారు. కోట్ల వెంట మాజీ ఎమ్మెల్లే కోట్ల సుజాతమ్మ, లక్కసాగరం లక్ష్మిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు లోకనాథ్, శంకర్‌రెడ్డి గుండయ్య, తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు అన్నింటా విఫలమే...
చిప్పగిరి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా నుంచి ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు పరిష్కారంలో సిఎం చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి విమర్శించారు. మండలంలోని నగరడోణ వద్ద ఆలూరు బ్రాంచి కెనాల్‌ను సోమవారం కోట్ల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరవు రైతుల సహాయం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే పాదయాత్ర చేపట్టి చంద్ర బాబు వైఫల్లాలను ప్రజలముందు ఎండగడుతామన్నారు. ఆయన వెంట డోన్ మాజి ఎమ్మెల్లే సజాతమ్మ, నాయకులు లక్కసాగరం లక్ష్మీరెడ్డి, నాయకులు వున్నారు.