కర్నూల్

ఎయిర్‌పోర్టు నిర్మాణానికి టెండర్లు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 18:ఓర్వకల్లు విమానాశ్రయం నిర్మాణానికి మంగళవారం టెండర్లు ఖరారైనట్లు సమాచారం. రాజధాని అమరావతిలో నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో ఓర్వకల్లుతో పాటు విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదరి విమానాశ్రయాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ముగిసినట్లు జిల్లా అధికారుల ద్వారా వెల్లడైంది. విమానాశ్రయ నిర్మాణానికి రూ. 325కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలవగా సుమారు 6 కంపెనీలు టెండరు ప్రక్రియలో పాల్గొన్నారని తెలుస్తోంది. ఇందులో తక్కువ ధరకు టెండరు దాఖలు చేసిన కంపెనీకి టెండరు దక్కిందని ఆ కంపెనీతో నిర్మాణ ప్రక్రియకు సంబంధించిన ఒప్పంద పత్రాలు మరో రెండు, మూడు రోజుల్లో స్వీకరించి పనులను అప్పగిస్తారని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విమానాశ్రయ నిర్మాణాన్ని మూడు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదిత భూమి చుట్టూ రక్షణగోడ, రెండవ దశలో టర్మినల్ భవనాలు, తుది దశలో రన్‌వే నిర్మిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. రక్షణ గోడ నిర్మాణం పూర్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తారని వెల్లడవుతోంది. గోడ దూకడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే రక్షణాధికారి కార్యాలయానికి తెలిసేలా ఏర్పాట్లు చేస్తారని తెలుస్తోంది. ఇక టర్మినల్ భవనంలో ప్రయాణికులకు సౌకర్యవంతమైన లాంజ్, హోటల్, ప్రయాణికుల బంధు, మిత్రులు వేచిఉండేందుకు రెండు ప్రత్యేక గదులు, ఏటిసి టవర్, తదితరాలు ఉంటాయంటున్నారు. ఇక చివరి దశలో ప్రస్తుతం 2 కి.మీ రన్‌వే నిర్మాణం, విమానాశ్రయంలోకి అధికారిక వాహనాలు తిరగడానికి సిమెంటు రహదారులు నిర్మిస్తారని స్పష్టమవుతోంది. కాగా విమానాశ్రయ నిర్మాణం 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. టెండరు ప్రక్రియ ముగియడంతో ఇక పనుల ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీతో శంకుస్థాపన చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ప్రధాని తిరుపతి పర్యటన ఖరారైనందున అదే రోజు కర్నూలులో కూడా శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు చేస్తారని, లేదంటే తిరుపతి నుంచే రిమోట్ ద్వారా శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది.

ఏడేళ్లుగా నత్తనడకన
పులికనుమ ప్రాజెక్టు పనులు!
* త్వరగా పూర్తి చేయాలని నేడు పాదయాత్ర

ఆదోని, అక్టోబర్ 18:దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పులికమ ప్రాజెక్టు నిర్మాణానికి 2008 సంవత్సరంలో శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 7 సంవత్సరాలు అయింది. పులికనుమ ప్రాజెక్టు ఇంక పూర్తి కాలే దు. అసంపూర్తిగానే ఉంది. రూ. 100 కోట్ల ఖర్చు చేసి ఒక విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం జరిగితే వేల ఎకరాలకు నీరు అందుతుందని రైతులు పేర్కొంటున్నారు. అందువల్ల ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు చేపట్టక నిర్లక్ష్యం చూపుతున్నారని అందువల్ల నిరసనగా బుధవారం పాదయాత్ర చేస్తున్నట్లు తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టు దారుల సంఘం నాయకులు ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదోని డివిజన్‌లోని పులికనుమ గ్రామం వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి 2008, సెప్టెంబర్ 21న వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రాజెక్టు శంఖుస్థాపన చేశారు. పులికనుమ గ్రామం పైభాగంలో బసులదొడ్డి సమీపంలో రెండు కొండల మధ్య పులికనుమ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 759 ఎకరాలలో 1.232 టీఎంసీల నీటిని నిలువ చేసి మంత్రాలయం, ఎమ్మిగనూరు, కర్నూలు ప్రాంతాలలో 20వేల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించడానికి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. అయితే రూ.263కోట్లుతో ప్రాజె క్టు నిర్మాణం చేపట్టగా ఇప్పుడు అంచనలు పెరిగి రూ.400కోట్లకు చేరింది. అయితే ఇంత వరకు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే పెద్దకడబూరు, కోసిగి, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో తాగు, సాగునీటికి కూడా నీరు అందుతుంది. తుంగభద్ర దిగువ కాలువలో నీటి సరఫర తగ్గినప్పుడు పులికనుమ నుంచి రోజుకు 300క్యూసెక్కల నీటిని వినియోగించుకోవడానికి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగ పడుతుంది. 900 మీటర్లు మొదటి కట్ట, 650 మీటర్లు రెండవ కట్ట, 375 మీటర్ల మూడవ కట్టలను రెండు కొండల మధ్య అడ్డగా కట్టితుంగభద్ర నది నుంచ ఎత్తిపోతల పథకం ద్వారా ప్రాజెక్టులో నీటిని నిలువ చేసి ఆయకట్టు భూములకు నీరు అందించేలా పులికనుమ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 14కిమీ పైపులైన్ అలాగే ప్రాజెక్టు నుండి తుంగభద్ర దిగువ కాలువకు 8 కిలో మీటర్ల మేర కాలువ పనులు చేయడం జరిగింది. 2009లో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. కాని ఇంత వరకు ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. మట్టికట్ట నిర్మాణం జరిగింది.పైపుల నిర్మాణం కొద్దిగా మిగిలింది. కేవలం రూ.100కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తే పులికనుమ ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది. కాని ఇంత వరకు 7 సంవత్సరాలు దాటిన ప్రభుత్వం పులికనుమ ప్రాజెక్టు గురించి మరిచిపోయింది.సీ ఎం చంద్రబాబునాయుడు అనేక సభలలో పులికనుమ ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామి కూడా ఇచ్చాడు. కాని రెండున్నర సంవత్సరాలు దాటిన ఆయన పులికనుమకు నిధులు కూడా విడుదల చేయలేదు. చివరకు విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కూడా సాగలేదు. అందువల్లప్రాజెక్టు నుండి చుక్కనీరు రైతులకు అందలేదు. ఎన్నోసార్లు రైతులుప్రాజెక్టు పూర్తి చేయమని ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నారు.ప్రభుత్వం పెడచేవిన పెట్టింది. అందువల్ల రైతులు ఆందోళనకు సిద్దం అవుతున్నారు. ఆందోళనలో భాగంగా బుధవారం రోజు పులికనుమ రిజర్వాయర్ నుంచి జంపాపురం, సజ్జలగుడ్డం, సాతనూరు గ్రామాల వరకు పాదయాత్ర చేసి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రజలకు చాటుతామని తుంగభద్ర దిగువ కాలువ రైతుల హక్కుల సమితి నాయకుడు ఆదినారాయణరెడ్డి తెలిపారు. పాదయాత్రకు కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సంఘిభావం తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈవిధంగా పులికనుమ ప్రాజెక్టు నిర్మాణం కోసం సీమ రైతులు ఆందోళన బాట పట్టారు.పట్టిసీమ కోసం ముఖ్యమంత్రి కోట్ల రూపాయాలు ఖర్చు చేశారని కాని వంద కోట్లు ఖర్చు చేస్తే పూర్తి అయ్యే పులికనుమను విస్మరించారని రైతులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అందువల్లనే బుధవారం పాదయాత్రకు రైతాంగం సిద్దం అవుతుంది. పాదయాత్రతోనైనా పులికనుమప్రాజెక్టుకు ముక్తి లభిస్తోందో లేదో వేచి చూడాలి.

ఎల్లెల్సీ షట్టర్లు మూసేయండి
* సాగునీటి కోసం రైతుల ధర్నా
* ఇఇ కార్యాలయం ముట్టడి

ఆదోనిటౌన్, అక్టోబర్ 18:తుంగభద్ర దిగువ కాలువ నుంచి సాగునీరు ఇవ్వడం చేత కాకపోతే రాతపూర్వంగా రైతులకు లేఖలురాసి షెటర్లను మూసివేయాలని ఇలా రైతుల జీవితాలతో చెలగాటం ఆడడం తగదని రైతులు, సాగునీటి సంఘం నాయకులు రాఘవరెడ్డి, వెంకటపతిరాజు, సుబ్బరాజులు పేర్కొన్నారు. మంగళవారం ఆదోనిలోని ఎల్లెల్సీ ఇఇ కార్యాలయం వద్ద కౌతాళం మండలంలోని రైతులు ముట్టడించి ధర్నా చేశారు. గత 20 రోజులుగా కౌతాళం మేజర్ కాలువకు చుక్కనీరు రావడంలేదని పంటలు ఎండిపోతున్నాయని ప్రతి రోజు నీటి కోసం ఎదురు చూస్తున్నామని ఇంక నీరు ఎప్పుడు ఇస్తారని ఇఇ భాస్కర్‌రెడ్డిని రైతులు శ్రీనివాసరాజు, ముసలయ్య, మూకన్నలు నిలదీశారు. ఎకరాకు రూ. 30 వేలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశామని ఇప్పుడు సాగునీరు ఇవ్వకపోతే ఎలా అన్నారు. ఐడిబి సమావేశంలో నీరు ఇస్తామని ప్రకటించి ఇప్పుడు దీర్ఘకాలిక పంటలకు నీరు ఇవ్వమని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇలా మాట మార్చడం రైతులకు రాదని వాపోయారు. నీటి సరఫరా చేతగాని సమయంలో పేరుకు మాత్రమే కొద్దిగా నీరు సరఫరా చేయడం ఏవరికి అవసరమన్నారు. తమకు రావాల్సిన వాటా నీరు ఇవ్వాలని తమ పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. సిఎం చంద్రబాబు మాత్రం అన్ని పంటలను కాపాడుతామని చెబుతున్నారని ఎండిపోతున్న పంటల విషయంపై ఏమి చేబుతారని నిలదీశారు. దీనిని ఇఇ మాట్లాడుతూ సరిహద్దుకు 600 క్యూసెక్కులకు కేవలం 184 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తున్నాయని ఈవిషయం ఉన్నత అధికారులకు వివరించి ఎక్కువగా నీరు తెచ్చేందుకు కృషి చేస్తామని రైతులు సహకరించాలని కోరారు.
పల్లెలో రూ. 6 కోట్లతో
భూగర్భ డ్రైనేజీ:ఎమ్మెల్యే బిసి
బనగానపల్లె, అక్టోబర్ 18:పట్టణంలోని వివిధ కాలనీల్లో తొలి విడత కింద 16 కి.మీ మేర భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే బిసి పల్లె ఆర్టీసీ డిపో మేనేజర్ శశిభూషణ్, మండల ఇంజినీర్ నాగశ్రీనివాసులు, ఇఓఆర్‌డి వై.నాగేశ్వరరెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ సుబ్బారెడ్డి, డిఇ సుధాకర్, ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టంగటూరు శీనయ్య, పనులు నిర్వహించే కార్తీకేయ ఏజన్సీ వారితో కలిసి పట్టణంలో పలుచోట్ల సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ పట్టణంలో పాతకాలం నాటి మురుగునీరు వ్యవస్థ వుందని, దీంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిల్వ ఉండి దోమల బెడద, దుర్గంధ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. నవాబుల కాలం నాటి వ్యవస్థ గురించి సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకుపో గా ఆయన స్పందించి తొలి విడతగా రూ. 6 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో ఆయా కాలనీల్లో మురుగునీటిని భూగర్భ డ్రైనేజీ ద్వారా జుర్రేరు వాగుకు చేర్చి అక్కడి నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా పట్టణ శివారుకు తరలిస్తామన్నారు. అలాగే జుర్రేరులో చెక్‌డ్యాంలు నిర్మించి ఎస్‌ఆర్‌బిసి కాలువ నీటిని నిల్వ చేయనున్న ట్లు తెలిపారు. ఇందుకు పట్టణ ప్రజలు కూడా సహకరించి పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రతి కుటుం బం వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకుని వినియోగించాలని సూచించారు. పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. ప్రభుత్వం ద్వారా తగిన నిధులు మంజూరు చేయించి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పట్టణంలో కొత్తపోలీస్‌స్టేషన్ నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకూ, ఆర్టీసీ బస్టాండ్ మార్గం, పెట్రోల్‌బంకు నుంచి కాశయ్యతోట, తెలుగుపేటలోని ఆంజనేయస్వామి గుడి నుంచి గంగమ్మ గుడి, బిసి రాజారెడ్డి కాలనీ ప్రారంభం నుంచి పంచమపేట, కరణం మొహిద్దీన్ కాలనీ నుంచి నేలమఠం, మంళవారంపేటలోని ప్రధాన కాలువలు, శివనందినగర్ నుంచి ఎస్సీ కాలనీ, కొత్త నారుూబ్రాహ్మణ కాలనీ నుంచి జుర్రేరువాగు, ఎన్జీఓ కాలనీ నుంచి పంచమపేట, చింతమాను మఠం నుంచి సుంకులమ్మ గుడి, పెద్దపీర్ల చావడి నుంచి కొండపేట ఆంజనేయస్వామి గుడి వరకూ భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
2018 నాటికి యూనివర్శిటీ
భవనాలు పూర్తి
* వ్యవసాయ, హోంసైన్స్‌లో 10 కొత్త కోర్సులు
* డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డా రమేష్‌బాబు
మహానంది, అక్టోబర్ 18:ఆచార్య ఎన్‌జి రంగ అగ్రికల్చర్ యూనివర్శిటీ రాష్ట్రాల బైఫర్‌కేషన్ తరువాత గుంటూరులో కార్యకళాపాలు ప్రారంభించామని, యూనివర్శిటీ ఎపిలో ప్రారంభించిన తరువాత వ్యవసాయ విద్య, హోంసైన్స్ విభాగాల్లో పది నూతన కోర్సులు ప్రవేశపెట్టినట్లు ఎఎన్‌జిఆర్‌యు డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డా.టి.రమేష్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం మహానంది వ్యవసాయ కళాశాలను ఆయన సందర్శించారు. ముందుగా శ్రీ కామేశ్వరిదేవి సమేత మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యవసాయ కళాశాలలో త్వర లో జరిగే సిల్వర్ జూబ్లి ఫంక్షన్ ఏర్పాట్లపై ప్రిన్సిపాల్, సిబ్బందితో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2018 ఆగస్టు నాటికి యూనివర్శిటి గుంటూరు లాంగ్‌ఫామ్ స్టేషన్‌లో పూర్తిస్థాయి నిర్మాణాలతో ప్రారంభం అవుతుందని, కార్యకలాపాలన్ని అక్కడ నుండే కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మహానంది వ్యవసాయ కళాశాల 2016 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, డిసెంబర్ 2,3,4 తేదీల్లో సిల్వర్ జూబ్లి ఫంక్షన్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్నెంనాయుడుతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపిలు, ప్రజా ప్రతినిధులతోపాటు యూనివర్శిటి వైస్ ఛాన్సలర్‌తోపాటు అధికారులు పాల్గొంటారన్నారు. 2న అగ్రి ఫెస్ట్, 3న రైతు సదస్సు, 4న సిల్వర్ జూబ్లి ఫంక్షన్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతు సదస్సుల్లో వెయ్యి మంది రైతులకు 9 మంది శాస్తజ్ఞ్రులతో సూచనలు సలహాలు ఇప్పించనున్నట్లు తెలిపారు. వీరి వెంట ప్రొఫెసర్ ఆఫ్ అకాడమి డా.పి. శ్రీనివాస్, అసోసియేట్ డీన్ డా.డి.బాల గురువయ్య, డా.రవికుమార్, డా.శ్రీనివాసులు, సతీష్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.