కర్నూల్

నగర పాలిక ఎన్నికల్లో టిడిపి గెలుపునకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, నవంబర్ 21:నగర పాలక సంస్థ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని మాజీ మంత్రి టిజి.వెంకటేష్ పిలుపునిచ్చారు. నగరంలోని వౌర్య ఇన్ కాంప్లెక్స్‌లో ఉన్న పరిణయ ఫంక్షన్ హాలులో శనివారం టిడిపి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మార్కెట్ యార్డు చైర్మన్ ఎన్.శమంతకమణి పాల్గొన్నారు. ఈ సందర్బంగా టిజి.వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ప్రజా సంక్షేమానికి పాటు పడి, ప్రజా సేవలో ముందుకు నడిచి పార్టీ ఖ్యాతిని పెంచాలని వివరించారు. త్వరలో జరగబోయే నగర పాలక సంస్థ ఎన్నికల్లో పార్టీ గెలుపొందాలంటే ఇప్పటి నుంచే ప్రతి కార్యకర్త ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పెంచాలన్నారు. సోమిశెట్టి మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి జెండా ఎగుర వేయాలని సూచించారు. ప్రతి కార్యకర్త చురుగ్గా పని చేసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల దరికి చేర్చి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నగర రూపు రేఖలు మార్చిన ఘనత టిజికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తిరుపాల్‌బాబు, ముస్త్ఫా, శ్యాంసుందర్, అరుణకుమారి, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

పెను విషాదం
* కృష్ణానదిలో ముగ్గురు యువకుల గల్లంతు
అచ్చంపేట, నవంబర్ 21: బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లివస్తున్న కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం రామన్నపేటకు చెందిన ముగ్గురు యువకులు జిల్లాలోని పుట్లగూడెం వద్ద కృష్ణానదిలో బల్లకట్టుపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యారు. తీవ్ర విషాదం నింపిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.... కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం రామన్నపేటకు చెందిన మీసాల నరశింహారావు (25), మరిబోయిన గోపి (24), ఎం రమణ (25) ఈ ప్రమాదంలో గల్లంతయ్యారు. శనివారం పిడుగురాళ్ల దగ్గర ఎటి అగ్రహారం అనే గ్రామంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి హాజరై తిరిగివస్తూ బల్లకట్టు వెనుకవైపు ఇనుప కడ్డీల (రైలింగ్స్)కు ఆనుకుని ముచ్చటించుకుంటున్నారని అదే గ్రామానికి చెందిన ప్రయాణికులు తెలియజేశారు. బల్లకట్టు నడి యేటిలోకి చేరగానే యువకులు ఆనుకుని ఉన్న ఇనుపకడ్డీ వెల్డింగ్ ఊడిపోయి ముగ్గురు నదిలోకి జారిపోయారు. తోటి ప్రయాణికులు గమనించి కేకలు వేయడంతో వేగంగా ప్రయాణిస్తున్న బల్లకట్టును సిబ్బంది ఆపిచూశారు. నదిలో మునిగి గల్లంతైన యువకుల ఆచూకీ కనిపించలేదు. రాత్రి కావడంతో వెతుకులాటను నిలిపివేశారు. గల్లంతైన యువకుల వయస్సు 27లోపే ఉండవచ్చని తెలుస్తోంది. యువకులంతా వివాహితులని రామన్నపేటకు చెందిన వారు తెలిపారు. సంఘటనా స్థలానికి ఎస్‌ఐ రాజేశ్వరరావు తెలుసుకుని, వివరాలు సేకరించి, చందర్లపాడు మండల ఎస్‌ఐకు కేసు వివరాలను తెలియజేశారు.

రూ 400కోట్లతో పశ్చిమ డెల్టా
ఆధునికీకరణ
* సిఇఇ సుధాకర్
దుగ్గిరాల, నవంబర్ 21: రానున్న ఖరీఫ్ సీజన్ నాటికి కృష్ణాపశ్చిమ డెల్టా కాలువల ఆధునికీకరణ పనులు 400కోట్ల రూపాయలతో పూర్తిచేసి రైతులందరికీ నీరు అందిస్తామని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై సుధాకర్ తెలిపారు. దుగ్గిరాల సబ్‌డివిజన్ పరిధిలోని కాలువల స్థితిగతులను పరిశీలించేందుకు ఆయన శనివారం దుగ్గిరాల వచ్చారు. పాతలాకులు, నిజాంపట్నం, కొమ్మమూరు కాలువలను పరిశీలించారు. జల రవాణాకు అనుగుణంగా కాలువల ఆధునికీకరణ పనులకు సర్వే జరుగుతోందని, త్వరలో పూర్తిచేసి పనులు వేగవంతం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇరిగేషన్ ఇఇ వెంకటరత్నం, డిఇ శ్రీరామమూర్తి, ఎఇలు సత్యవతి, ఫణీంద్ర పాల్గొన్నారు.

డివిజన్ స్థాయి యువజనోత్సవాలు ప్రారంభం
నరసరావుపేట, నవంబర్ 21: యువజన సర్వీసుల శాఖ స్టెప్, స్వశక్తి ఆధ్వర్యంలో శనివారం స్థానిక భువన చంద్ర టౌన్‌హాల్లో డివిజన్ స్థాయి యువజనోత్సవాలను నవ్యాంధ్ర స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్టెప్ సిఈవోకృష్ణ కపర్థి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ డాక్టర్ కోడెల మాట్లాడుతూ స్టెప్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు, యువత తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పించే వేదిక, వేడుకని అన్నారు. భారతదేశానికి బలం 40 సంవత్సరాల లోపు యువతదేనన్నారు. అందరూ చదువుకోవాలని, భారతదేశాన్ని ముందుకు నడిపించేందుకు చదువు దోహదపడుతుందన్నారు. ఇష్టమైన రంగంలో రాణించేందుకు ఇలాంటి క్రీడలు ఉపయోగపడతాయన్నారు. ఆర్డీవో యం శ్రీనివాసరావు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో తొలిసారిగా నరసరావుపేట డివిజన్‌లో ఈ యువజనోత్సవాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. స్టెప్ సీఈవో కృష్ణకపర్థి మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో గెలుపొందిన యువతకు డిసెంబర్ 2న జిల్లా స్థాయిలో గుంటూరులో పోటీలను నిర్వహిస్తామన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారికి డిసెంబర్ మూడో వారం రాష్టస్థ్రాయిలో పోటీలను నిర్వహిస్తామన్నారు. 2016 జనవరి 12 వివేకానందుని జయంతిని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. తొలుత వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఫోక్ డాన్స్, ఫోక్ సాంగ్స్, ఏకాంకిక, క్లాసికల్ డ్యాన్స్, క్లాసికల్ గాత్రం, ఎలక్యూషన్, మోడరన్ సాంగ్, పారడీసాంగ్, మిమిక్రీ, మార్షల్ ఆర్ట్స్, మ్యూజికల్ చైర్, ఏకపాత్రాభినయం పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు వేల్పుల సింహాద్రియాదవ్, కొల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా భువనచంద్ర టౌన్‌హాల్లో శనివారం నిర్వహించిన యువజనోత్సవాల్లో విజేతలైన వారి వివరాలిలావున్నాయ. కూచిపూడి నృత్యంలో నరసరావుపేటకు చెందిన పి దివ్యలత, క్లాసికల్ ఓకల్ కర్ణాటిక్‌లో నరసరావుపేటకు చెందిన ఎ వౌనికదీక్షిత్, ఫోక్ డాన్స్‌లో నరసరావుపేటకు చెందిన షేక్ మహ్మద్ షమీర్ గ్రూప్, జి ప్రత్యూషగ్రూప్, ఫోక్ సాంగ్‌లో బి రాధాబాయి గ్రూప్, ఎకాంకికలో షేక్ శిరాజ్ అహ్మద్ గ్రూప్, ఎలక్యూషన్‌లో నరసరావుపేటకు చెందిన వి ప్రదీప్, బి సుచిత్రరాయ్, పెయింటింగ్‌లో టివిఎన్ మల్లిఖార్జున, ఆర్ అనిత, మెహందీలో టివియన్ మల్లిఖార్జున, ఎం నాగలక్ష్మి, తెలుగు ఎలక్యూషన్‌లో షేక్ శిరాజ్ అహ్మద్, సాయికృష్ణసింగ్, మోడెమ్ సాంగ్ సోలో ఎ వౌనికదీక్షిత్, జి వెంకటేశ్వర్లు, మోడమ్ డాన్స్ సోలో కె రవికిషోర్, ఎన్ నాగలక్ష్మి, మిమిక్రీలో జొన్నలగడ్డకు చెందిన సిహెచ్ శ్రీహరిప్రియ, ఫాన్సీడ్రస్‌లో పట్టణానికి చెందిన బి సాయికృష్ణసింగ్, షేక్ చిన అంజయ్య, మ్యూజికల్ చైర్స్‌లో ములకలూరుకు చెందిన షేక్ వహిదాబేగం, నరసరావుపేటకు చెందిన జి కోటేశ్వరి, ఏకపాత్రాభినయం పోటీల్లో తిరుమల అంకారావు, ఆర్ ఉజ్జ్వల్, టగ్ ఆఫ్ వార్ వంశీకృష్ణ టీం, శివకృష్ణ టీం, మహిళల విభాగంలో జి కోమలి టీం, షేక్ వహిదాబేగం టీం, మార్షల్ ఆర్ట్స్‌లో పట్టణానికి చెంది శివకృష్ణ టీంలు గెలుపొందాయి.

కోర్టులో వౌలిక వసతుల ఏర్పాటుకు కృషిచేస్తా
పొన్నూరు, నవంబర్ 21: పొన్నూరు కోర్టు పరిధిని మరింతగా విస్తరించాలని, ఖాళీగా ఉన్న జడ్జి పోస్టులను భర్తీ చేయాలని, సమస్యలు పరిష్కరించాలని అధికార పర్యటనకు విచ్చేసిన రెండవ అదనపు జడ్జి వి నాగేశ్వరరావుకు పట్టణ బార్ అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంగా జడ్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ పొన్నూరు కోర్టులో వౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తానని, కోర్టు పరిధిని విస్తరింపజేయాల్సిన ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం పెదనందిపాడు, చెరుకుపల్లి మండలాలను కూడా ఈ కోర్టుకు అనుసంధానం చేసిందన్నారు. అయితే అది ఆచరణకు నోచుకోలేని పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఏప్రిల్‌లోపు ప్రభుత్వం జడ్జీల ఖాళీలను భర్తీ చేస్తుందన్నారు. ఎజిపిగా నియమితులైన గండు శ్రీనివాసరావు, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా నియమితులైన వట్టికూటి లీలాప్రసాద్‌లను జిల్లా జడ్జి సమక్షంలో బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. అసోసియేషన్ సభ్యులతో పాటు న్యాయవాది గుమస్తాల సంఘం సభ్యులు కూడా జిల్లా జడ్జిని సత్కరించారు.

నాణ్యమైన విద్యతో దేశంలోనే ప్రథమస్థానం
తుళ్లూరు, నవంబర్ 21: నాణ్యమైన విద్యద్వారా ఆంధ్రరాష్ట్రం దేశంలోనే ప్రథమస్థానంలో నిలవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా గెలిచిన రామకృష్ణ తొలిసారిగా మండలంలోని పలు పాఠశాలలను శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కళలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా తుళ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో దివంగత ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రధానోపాధ్యాయుల కోరిక మేరకు ఉన్నత పాఠశాల చుట్టూ ప్రహరీగోడ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ బృందం ఎమ్మెల్సీ రామకృష్ణను సత్కరించారు.

చిన్నారులకు ఏకరూప దుస్తుల పంపిణీ
కాకుమాను, నవంబర్ 21: మండల పరిధిలోని కొమ్మూరు ప్రాథమిక పాఠశాలలో శనివారం చిన్నారులకు ప్రభుత్వం అందించిన ఏకరూప దుస్తుల పంపిణీ జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గేరా మోహనరావు అధ్యక్షతన జరిగిన చిన్నారుల తల్లిదండ్రుల సమావేశంలో గ్రామసర్పంచ్ మూకిరి మార్తమ్మ చిన్నారులకు ఒక్కొక్కరికీ రెండు జతల చొప్పున పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిషోర్‌బాబు, రంగారావు, విష్ణుమూర్తి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సాగర్ కాల్వను పరిశీలించిన ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ
పెదనందిపాడు, నవంబర్ 21: సాగర్‌కాల్వలో ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో మన్మథనామ సంవత్సరంలో తొలిసారిగా మండల పరిధిలోని సాగర్‌కాల్వలోకి నీరు వచ్చింది. ఐదు నెలలుగా తాగునీటి ఎద్దడితో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో తాగునీరు రావడంతో గ్రామ పాలకులు ఆయిల్ ఇంజన్లతో మంచినీటి చెరువులను నింపే క్రమంలో తలమునకలైవున్నారు. మరోవైపు సాగర్‌కాల్వలో ఆశించిన మేర నీరు విడుదల కాకపోవడంతో కాల్వలో పెరిగిన గడ్డిజాతుల మధ్య నీటి ప్రవాహం మందగించింది. దిగువ ప్రాంతానికి ప్రవహించే పరిస్థితి కనిపిచండం లేదు. దీంతో గడ్డిజాతులు తొలగించుకుంటూ అరకొరగా రంగుమారి వచ్చే నీటితో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ గోపాలకృష్ణ, మండల పరిధిలో గల కొప్పర్రు, అన్నపర్రు, వరగాని, పెదనందిపాడు మంచినీటి చెరువులను శనివారం పరిశీలించారు. త్వరితగతిన చెరువులు నింపుకోవాలని విజ్ఞప్తిచేశారు. సాగర్‌కాల్వ నుండి పెదనందిపాడు చెరువుకు నీటిని అందించే పైపులైను పునర్నిర్మాణానికి అంచనాలు వేయాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో దాహార్తిని తీర్చేందుకు పాతవాగు ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. డిఇ రమేష్, ఎఇ రవిశంకర్, మండల ఉపాధ్యక్షుడు బాలకృష్ణ, సర్పంచ్ కె కోటేశ్వరరావు ఆయన వెంట ఉన్నారు.

చదువుతో పాటు క్రీడలకూ ప్రాధాన్యమివ్వాలి: ఆర్కే
మంగళగిరి, నవంబర్ 21: బాల్యంలోనే చదువుతో పాటు క్రీడలకూ ప్రాధాన్యత నివ్వాలని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. మండల పరిధిలోని ఎర్రబాలెం డాన్‌బాస్కో హైస్కూల్ ప్రాంగణంలో శనివారం రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్ గ్రామీణ క్రీడల పోటీలు 2015-16లో భాగంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను మంగళగిరి నియోజకవర్గం (మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలు) స్థాయిలో నిర్వహించారు. సాయంత్రం విజేతలకు బహుమతులను ఎమ్మెల్యే ఆర్కే, జడ్‌పిటిసి మెంబర్ ఆకుల జయసత్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ పద్మావతి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఆటల్లో అంతర్భాగంగా ఆరో గ్యం దాగి ఉందని అన్నారు. గెలుపు ఓటములతో పనిలేకుండా క్రీడాస్ఫూర్తితో ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. వాలీబాల్ బాలుర విభాగంలో మంగళగిరి టీం, బాలికల విభాగంలోను మంగళగిరి టీం విజేతలుగా నిలిచాయి. కబడ్డీ బాలుర విభాగంలో దుగ్గిరాల టీం, బాలికల విభాగంలో తాడేపల్లి టీం, ఖోఖో బాలుర విభాగంలో మంగళగిరిటీం, బాలికల విభాగంలో తాడేపల్లిటీం విజేతలుగా నిలిచాయని పోటీలో ఆర్గనైజింగ్ సెక్రటరీ బి శివనాగిరెడ్డి తెలిపారు. జడ్‌పిటి మెంబర్ ఆకుల జయసత్య, దుగ్గిరాల ఎంపిడిఓ వీరాంజనేయులు, తాడేపల్లి ఎంపిడిఓ రోశయ్య, డాన్‌బాస్కో పాఠశాల కరస్పాండెంట్ మరియన్న, ప్రిన్సిపాల్ జయరాజు, గుడ్‌న్యూస్ పాఠశాల కరస్పాండెంట్ చార్లెస్ తదితరులు ప్రసంగించారు. వేదికపై ఎమ్మెల్యే ఆర్కేను సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

నెత్తురోడిన రహదారులు..
జిల్లాలో శనివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. అందులో కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలో పాలు తీసుకొచ్చేందుకు రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో తిరుపతమ్మ (16), కావ్య (12), రాజేశ్వరి (14) మృతి చెందారు. అలాగే ఆళ్లగడ్డ పట్టణానికి సమీపంలో వున్న జాతీయ రహదారిపై చింతకొమ్మదినె్న గ్రామం వద్ద నిలిపి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని అంబులెన్స్ కొనడంతో డ్రైవర్ శివ (36), అనిల్‌కుమార్‌రెడ్డి (20) మృతిచెందారు.
ఇటిక్యాలలో లారీ ఢీకొని ముగ్గురు బాలికల మృతి..
కొలిమిగుండ్ల, నవంబర్ 21 : మండల పరిధిలోని ఇటిక్యాల బస్టాండు సమీపంలో ఎస్సీ కాలనీ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు మృతి చెందారు. నెల్లూరు-బళ్లారి ప్రదాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఇటిక్యాల గ్రామ దళిత కాలనీకి చెందిన తిరుపత మ్మ(16), కావ్య(12), రాజేశ్వరి(14) ముగ్గురు బాలికలు ఉదయమే పాల కోసం బయటకు వెళ్లి పాలు తీసుకుని తిరిగి రోడ్డుపై నడుచుకుంటూ తమ ఇళ్లకు వెళ్తుండగా తాడిపత్రి నుంచి కొలిమిగుండ్ల వైపు వస్తున్న లారీ ముగ్గురు బాలికలను ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజేశ్వరి, కావ్య, ప్రమాద స్థలంలోనే మృతి చెందగా, తిరుపతమ్మకు తీవ్రగాయాలు కాగా ఎస్‌ఐ పులిశేఖర్ తమ పోలీసు వాహనంలో చికిత్స కోసం కొలిమిగుండ్లకు తరలించగా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరుపతమ్మ మృతి చెందింది. ఢీకొన్న లారీ ఆపకుండా వెళ్లిపోవడంతో రోడ్డుపైన ఉన్న వారు గమనించి లారీని ఆపాలని కేకలు వేయడంతో డ్రైవర్ బయటపడి వేగంగా లారీని కొలిమిగుండ్ల వైపుకు తీసుకువెళ్తుండగా ఎదురుగా సిమెంటు లోడుతో వస్తున్న మరో లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక లారీ డ్రైవర్ బనగానపల్లె మండలం కాలేనాయక్ తాండాకు చెందిన స్వామినాయక్ కాగా, మరో లారీ డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది. ముగ్గురు బాలికలు మృతి చెందిన సంఘటనతో ఇటిక్యాల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. తిరుపతమ్మ తల్లిదండ్రులు శాంతమ్మ, వెంకటేశ్వర్లు, కావ్య తల్లిదండ్రులు సులోచనమ్మ, ప్రతాప్, రాజేశ్వరి తల్లిదండ్రులు రామలక్షమ్మ, రాముడులు తమ పిల్లలు ప్రమాదంలో మృతి చెందిన విషయం జీర్ణించుకోలేక చేస్తున్న అరణ్యరోధన చూపరులను కలచివేసింది. సంఘటన తెలిసిన వెంటనే ఎస్‌ఐ సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స కోసం తరలించారు. ఇరుక్కుపోయిన రెండు లారీలను ఇతరుల సహాయంతో బయటకు తీసి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండ చేశారు. మృతి చెందిన బాలికలను శవపరీక్ష కోసం తాడిపత్రికి తరలించి తీవ్రంగా గాయపడిన ఇద్దరు డ్రైవర్లను చికిత్స కోసం కడప జిల్లా జమ్ములమడుగు, అనంతపురంకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆళ్లగడ్డలో అంబులెన్స్ ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని ఇద్దరి మృతి..
ఆళ్లగడ్డ, నవంబర్ 21: పట్టణానికి సమీపంలో వున్న జాతీయ రహదారిపై చింతకొమ్మదినె్న గ్రామం వద్ద ఆగివున్న ట్రాక్టర్ ట్రాలీని అంబులెన్స్ కొనడంతో అందులో వున్న ఇద్దరు దుర్మరణం చెందారు. ప్రొద్దుటూరుకు చెందిన ప్రైవేటు అంబులెన్స్ ప్రొద్దుటూరు నుంచి కర్నూలుకు రోగిని తీసుకెళ్లి అక్కడబ వైద్యశాలలో చేర్పించి ప్రొద్దుటూరుకు తిరిగి వస్తున్న సమయంలో చింతకొమ్మదినె్న సమీపంలో ఆగి వున్న నాపరాళ్ల ట్రాక్టర్ ట్రాలీని బలంగా ఢీ కొనడంతో అంబులెన్స్ డ్రైవర్ శివ (36), అనిల్‌కుమార్‌రెడ్డి(20) వాహనంలో ఇరుక్కుపోయి అక్కడి కక్కడే మృతి చెందా రు. విషయం తెలిసిన సిఐ ఓబులేసు సిబ్బందితో వెళ్లి మృతదేహాలను వెలికితీసి ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు చేర్చారు. ట్రాలీని రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా ఆపడం వల్ల, ఇండికేటర్ వేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.