కర్నూల్

ఖరీఫ్ పంట రుణాలు రీషెడ్యూల్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, నవంబర్ 7 : జిల్లాలో 36 మండలాలను ప్రభు త్వం కరవు మండలాలుగా ప్రకటించిన నేపథ్యంలో ఖరీఫ్‌లో తీసుకున్న పంట రుణాలను రీషెడ్యూలు చేయడంతో పాటు రబీలో కొత్త రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ విజయమోహన్ బ్యాంకర్లను కోరారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో లీడ్ బ్యాంకు అధికారి సిబి.గణేష్, ఆంధ్ర బ్యాంకు డిజిఎం గోపాలకృష్ణ, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ నరసింహారావు, నాబార్డు ఏజిఎం నాగేష్‌కుమార్, కెనరా బ్యాంకు డిజిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరవు పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా పంట రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్, బిసి, కాపు కార్పొరేషన్లకు సవరించిన లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ కింద రూ.49.39 కోట్లతో 3024 యూనిట్ల లక్ష్యాన్ని కలెక్టర్ అమోదించారు. ఇందులో బ్యాంకు సబ్సిడి రూ.20.97 కోట్ల, బ్యాంకు రుణం రూ. 28.08 కోట్లతో 3152 మంది లబ్దిదారులకు ఆర్థిక ప్రయోజనం కల్పించాలని బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు. ఆలాగే కాపు కార్పొరేషన్ కింద రూ.19.88 కోట్లతో 50 శాతం సబ్సిడి, 50 శాతం బ్యాంకు రుణంతో 994 మంది కాపు, బలిజ, తెలగ, ఓంటరి కులాల లబ్దిదారులకు ఆర్థిక సహాయం అందించాలని అన్నారు. ఆలాగే బిసి ఫెడరేషన్ కింద రూ.45.35 కోట్లతో 151 గ్రూపులకు రుణాలు అందించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జెడి.ఉమా మహేశ్వరమ్మ, ఎస్సీ కార్పొరేషన్ ఇంచార్జి సత్యం, బిసి కార్పొరేషన్ ఇడి, అన్ని బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.