కర్నూల్

పార్టీలు మారే వారికి ప్రాముఖ్యత ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, మార్చి 1:నిరంతరం పార్టీలు మారుతూ జీవితాన్ని ఇచ్చిన పార్టీని వదిలి విమర్శలు చేస్తున్నారని, పార్టీలు మారే నాయకులకు ఎప్పటికి ప్రాముఖ్యత ఉండదని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిఅన్నారు. బుధవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జన ఆవేదన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ద్వార ఎంతో మంది నాయకులు ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా పదవులను అనుభవించి రాష్ట్ర విభజన సమయంలో పార్టీని మారి పార్టీపై విమర్శలు చేస్తున్నారని అలాంటి నాయకులను ప్రజలు క్షమించరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రదాని నరేంద్రమోదీ ఎన్నికల ముందు విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి కుటుంబానికి రూ.15లక్షల చొప్పున పంపిణీ చేస్తామని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని మోసం చేశాడని ఆరోపించారు. నల్ల ధనాన్ని తీసుకరాకుండ పెద్దనోట్లను రద్దు చేసి రైతులను, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేశాడన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి జపం చేస్తూ రాష్ట్భ్రావృద్ధిని గాలికి వదిలేశాడనన్నారు. అలాగే పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టానని, ఆ పథకాలు మొత్తం పచ్చచొక్కా వేసుకున్న వారిరి తప్ప ఇతరులకు ఇవ్వటం లేదని మండి పడ్డారు. పచ్చచొక్కా వేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారే తప్ప సామాన్య ప్రజలకు ఇవ్వటం లూదని విమర్శించారు. రాష్ట్రంలో అధికార పార్టీ టిడిపి పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతను చూపిస్తున్నారని భవిష్యత్ వైకాపాదే నని ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పగటి కళలు పంటున్నాడన్నారు. జగన్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు కారణమని అయితే కాంగ్రెస్ పార్టీని దోషిగా చేసి గడిచిన ఎన్నికల్లో ఓడించారని వెల్లడించారు. కాగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని ఇక తమ పార్టీనే అధికారాన్ని చేపడుతుందని ఊహగానాల్లో కొట్టుమిట్టాడుకొంటున్నారని ఎద్దేవ చేశారు. అంతే కాకుండ కాంగ్రెస్ పార్టీని ప్రజలు భూస్థాపితం చేశారని విమర్శలు చేస్తున్నారని పార్టీని భూస్థాపితం చేసే శక్తి ఎవ్వరికి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికి ప్రతి పల్లెలో కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు ఉన్నారని వారికే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను చెప్పి చైతన్య పరిస్తే ప్రజలు చైతన్య వంతులవుతారని వెల్లడించారు. ఎమ్మెల్సీ కెసి కొండయ్య మాట్లాడుతూ పెద్ద నోట్లను రద్దు చేయటంతో దేశ ఆర్థివ వ్యవస్థ చిన్నాబిన్నం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయటంతో ధనికులంతా బంగారాన్ని కొనుగోలు చేశారని దీంతో నోట్ల సర్క్యులేషన్ తగ్గిపోయి సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ, మండల స్థాయి లో నూతన కమిటీలను ఏర్పాటు చేసి వారి ద్వార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల గురించి వివరిస్తే ఖచ్చితంగా పార్టీవైపు ప్రజలు వస్తారని వెల్లడించారు. పిసిసి క్రమ శిక్షణ కమిటీ సభ్యురాలు కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ ప్రధాని మోడి, ముఖ్యమంత్రి చంద్రబాబులు మాయల మరాఠీలను తమ గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇద్దరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలకు పేర్లు మార్చి తమ ప్రభుత్వమే చేసిందని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవ చేశారు. కాంగ్రె స్ పార్టీని గ్రామ, మండల స్థాయి నుంచి బలోపేతం చేసి వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయటం జరుగుతుందన్నారు. అలాగే ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజక వర్గాల్లో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు లక్ష్మిరెడ్డి, డిసిసి నాయకులు ఆకెపోగు వెంకటస్వామి, సర్ధార్ బుచ్చిబాబు, వైవి. రమణ, అశోక రత్నం, నాగమధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయవాదుల హత్యలను అరికట్టాలి
కర్నూలు ఓల్డ్‌సిటీ, మార్చి 1:కేరళ రాష్ట్రంలో జాతీయవాద కార్యకర్తలపై సిపియం చేస్తున్న హత్యలను అరికట్టాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కపిలేశ్వరయ్య కేరళ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. జాతీయ వాద కార్యకర్తలపై దాడులను నిరశిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక శ్రీ కృష్ణదేవరాయ సర్కిల్ వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్, బిజెపి, ఎబివిపి, మహిళా మోర్చా, విహెచ్‌పి, బిజెవైయం, భజంగ్‌దళ్, బియంఎస్, న్యాయవాద పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కపిలేశ్వరయ్య మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి జాతీయవాద కార్యకర్తలను హత్యచేయడం, భౌతికంగా దాడులు చేయడం పెరిగాయని అన్నారు. కేరళలో దాడులు ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతున్నాయని తెలిపారు. కేరళ సీయం పినరాయి విజయన్ స్వగ్రామం హత్యలకు కేంద్ర బిందువుకావడం గమనర్హమని తెలిపారు. జరిగిన హత్యలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రేరిపిత హత్యలను ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఖండించాలని, కేరళ గవర్నర్ వెంటనే స్పందించి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నా రు. కేరళల మార్క్సిస్టు పార్టీ ప్రణాళికా బద్దంగా దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలలో ఎకతాస్ఫూర్తిని, దేశభక్తిని పెంపొందిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలపాలకు నిరంతరం పెరుగుతున్న ప్రజాదరణకు వామపక్ష పార్టీలు ఎ కారణంగా లేకుండానే సంఘ్ శాఖలపై, కార్యకర్తలపై దాడులు చేయడం దారుణమని అన్నారు. కేరళలో గడిచిన ఏడు దశాబ్ధాలలో 250 మందికిపైగా సంఘ్ కార్యకర్తలు మార్క్సిస్టులు దారుణంగా హతమార్చబడ్డారని అన్నారు. మార్క్సిస్టుకు కంచుకొటైన కన్నూరు జిల్లాకు చెందిన వారు సంఘ్‌లో చేరడాన్ని జీర్ణించుకోలేని వారు దాడులకు పాల్పడుతున్నారని దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు హరీష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రమేష్‌బాబు, నగర అధ్యక్షులు అనంద్ చౌదరి, ఎబివిపి నాయకులు సునీల్‌రెడ్డి, గణేష్, ఆచారి, విహెచ్‌పి నాయకులు ప్రసాద్, హిందూవాహిణి నాయకులు మాధవ ప్రభు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
వేడుకగా గురువైభవ ఉత్సవాలు
మంత్రాలయం, మార్చి 1: పరమపావన క్షేత్రం మంత్రాలయంలో వెలసిన బృందావన వాసి శ్రీ రాఘవేంద్ర స్వామి గురువులకు స్వర్ణపల్లకి మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీరాఘవేంద్ర స్వామి గురువైభవోత్సవాలను పురస్కరించకుని స్వామి మూల బృందావనానికి పంచామృతాభిషేకం, తులసి అర్చన, ఉత్సవరాయల పాదపూజ, నిర్మల్య విసర్జన, తదితర ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. స్వామి మూల బృందావనానికి బం గారు కవచాలతోపాటు వివిధ రకాల పూలతో అలంకరించి భక్తులకు దర్శ నం కల్పించారు. అంతకముందు మూ ల రామ దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు పూజలలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరాయలను కొయ్య, వెండి, బంగారు రతోత్సవాల్లో అధిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అశేష భక్తుల నడుమ మఠం ప్రాకారంలో ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పండిత కేసరి రాజా ఎస్ గిరియాచార్యులు, ఎఎఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాస్‌రావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, సహాయ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, ప్రిన్సిపల్ వాదిరాజాచార్, ధార్మిక సిబ్బంది వ్యాసరాజాచార్, తదితర మఠం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వా మి మఠంలో పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో యోగీం ద్ర కళా మంఠపంలో ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. కర్నాటకలోని ఉడిపికి చెందిన కుమారి విద్యచే భరత నాట్యం, కర్నూలు ఇ ఆర్‌కెవి ప్రసాద్‌చే ఏర్పాటు చేసిన దాసవాణి కార్యక్రమాలు, అలాగే బెంగళూరుకు చెందిన విద్వాన్ విష్ణుతీర్థాచార్ కష్యప్ వారిచే నిర్వహించిన శ్రీరామచరిత్ర మంజరి ప్రవచనలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఫల పుష్ప మంత్రాక్షితలు, జ్ఞాపికను ఇచ్చి ఆశీర్వదించారు.
మల్లన్న హుండీ ఆదాయం లెక్కింపు
శ్రీశైలం, మార్చి 1: శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గత 14రోజుల నుంచి భక్తులచే సమర్పించబడిన కానుకలను మంగళ, బుధవారం లెక్కించడం జరిగింది. ఈలెక్కింపులో రూ.2కోట్ల 92లక్షల 16వేలు నగదు, రూ.91గ్రాముల బంగారు, 5కిలోల 225గ్రాముల వెండి స్వామివారికి కానుకలుగా లభించాయి. వీటితో పాటు 494 యుఎస్ డాలర్లు, 40 కెనడా డాలర్లు, 20 ఇంగ్లాండ్ ఫౌండ్స్, 5 సిరమ్స్, 2 సింగపూర్ డాలర్లు కూడా స్వామివారి హుండీలో రాబడిగా లభించింది.
హిందూ ముస్లిం సమ్మేళనానికి పీఠాధిపతులకు ఆహ్వానం
మంత్రాలయం, మార్చి 1: హిందూ ముస్లిం సమ్మేళనకు ముఖ్య అతిథులుగా హాజరు కావాలని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులకు ముస్లిం మత పెద్దలు బుధవారం ఆహ్వానం పలికారు. ఈనెల 26న కర్నూలులో రాష్ట్ర హిందూ ముస్లిం సమ్మేళన నిర్వహించనున్నట్లు పీఠాధిపతులకు ముస్లిం మత పెద్దలు విన్నవించారని మఠం సహాయ మేనేజర్ ఐపి నరసింహమూర్తి తెలిపారు. అనంతరం వారికి శేష వస్త్రం ఇచ్చి ఆశీర్వదించారు.
ప్రపంచ వైద్యరంగాన్ని శాసిస్తున్న
కర్నూలు మెడికల్ విద్యార్థులు
కర్నూలు, మార్చి1:ప్రపంచ వైద్య రంగాన్ని కర్నూలు మెడికల్ కాలేజి విద్యార్థులు శాసిస్తున్నారని కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్, డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ కమిటి డా.జిఎస్ రాంప్రసాద్ చెప్పారు. కర్నూలు మెడికల్‌కాలేజి డైమండ్‌జూబ్లీ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. బుధవారం మెడికల్ కాలేజిలోని తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ప్రిన్సిపాల్ డా.రాంప్రసాద్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో ఖ్యాతిగడించిన కర్నూలు మెడికల్ కాలేజి తన సుదీర్ఘ ప్రయాణంలో 60 వసంతాలను పూర్తిచేసుకుని వజ్రోత్సవాలను సగౌరవంగా జరుపుకోవడానికి సిద్దమైనామని తెలిపారు. ఈ నెల 3 నుంచి జూలై 20వ తేదీకి ముగిస్తాయన్నారు. ప్రపంచ వైద్య రంగాన్ని శాసిస్తున్న అతికొద్దిమంది వైద్యనిపుణుల్లో కర్నూలు మెడికల్ కాలేజి విద్యార్థులు కావడం ప్రపంచ చిత్రపటాన కర్నూలు మెడికల్ కాలేజికి దక్కిన అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చున్నారు. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రేడియేషన్ అంకాలజిస్టిగా, ప్రపంచ క్యాన్సర్ వైద్యరంగానికి గురువుగా చెప్పుకుంటున్నారన్నారు. మరొకరు డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డి భారతదేశంలో తొలి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌గా ఫ్రపంచ గ్యాస్ట్రో ఎంటరాలజికి గురువుగా కీర్తిపొందుతున్నారన్నారు. ఇంకొకరు సర్జికల్ అంకాలజిస్ట్‌గా భారతేశంలో తొలి బోన్‌మార్ ట్రాన్స్‌ప్లాంటేషన్ బృందంలో ఒకరుగా ప్రఖ్యాతిగాంచిన వైద్యనిపుణులుగా డాక్టర్ జగన్నాథ్ వీరి ముగ్గురి ప్రతిభాపాటవాలు ఈ రోజున ప్రపంచ వైద్యరంగాన్ని ప్రభావితం చేస్తున్నారని ఆయన వివరించారు. ఈనెల 3వ తేదీ నుంచి 25వరకు సైన్స్ ఎగ్జిబిషన్‌లో విద్యార్థులకు ఆరోగ్య విజ్జానం అందించడం, మాఢనమ్మకాలను ప్రజల్లో దూరం చేయడమే లక్ష్యంగా ఎగ్జిబిషన్ న్విహిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు డిప్యూటి సియం కెఇ కృష్టమూర్తితోపాటు యంపిలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ను ఆహ్వానించడం జరిగిందన్నారు. విలేఖర్ల సమావేశంలో ఆసుపత్రి సూపరిటెండెంట్ డా.వీరస్వామి, కర్నూలు మెడికల్ కాలేజి సెలబ్రేషన్ కమిటీ అద్యక్షులు డా.వెంకటరమణ, రేడియాజి విభాగం ప్రోఫెసర్ డా.జోజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.