కర్నూల్

విభజన హామీలను అమలు చేయాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఏప్రిల్ 20:రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు చేస్తున్న ధర్మపోట దీక్షకు మద్దతుగా జడ్పీ ఎదరుగా ఉన్న గాంధీ విగ్రహం ముందు జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ చేస్తున్న దీక్షలు శుక్రవారానికి రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో టీజీతో పాటు ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన రాష్ట్ర విభజన హామీలను అమలు చేయకుండా కేంద్రం నమ్మక ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. పుట్టిన రోజును పండుగలా జరుపుకోవాల్సిన చంద్రబాబు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ధర్మ పోరాట దీక్షగా మార్చుకున్నారన్నారు. చంద్రబాబును కేంద్రం తక్కువగా అంచనా వేస్తుందని, ఆయన దేశంలోని అన్ని పార్టీలను ఏకం చేసి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ రేణుక మాట్లాడుతూ తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ విస్మరించడం సరికాదన్నారు. జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించేంత వరకూ పోరాటం చేస్తామన్నారు. నాలుగేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మించి చివరకు సాధ్యం కాదని చెప్పటం నమ్మక ద్రోహమే అవుతుందన్నారు. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం చేస్తున్న ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే బీజేపీ భవిష్యత్తును అంధకారం చేస్తామన్నారు.

హోదా సాధించడమే టీడీపీ ధ్యేయం
* ఎమ్మెల్యే మణిగాంధీ
కోడుమూరు, ఏప్రిల్ 20:ప్రత్యేక హోదా సాధించడమే టీడీపీ ధ్యేయమని ఎమ్మెల్యే ఎం.మణిగాంధీ తెలిపారు. కోడుమూరులో శుక్రవారం చేపట్టిన ధర్మ పోరాట దీక్షల్లో ఎమ్మెల్యే కూర్చుని ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్షను కొనసాగించారు. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడు దండు సుందర్‌రాజు, ప్రభాకర్‌రెడ్డి, కేఈ రవీంద్ర కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విభజన తరువాత రాష్ట్రం చాలా నష్టపోగా బీజేపీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టాక మాట తప్పిందని విమర్శించారు. అందుకే టీడీపీ ప్రభుత్వం బీజేపీతో పొత్తును విరమించుకుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు చేస్తున్న దీక్షకు ప్రజలంతా మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.

బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారు
* ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి
బనగానపల్లె, ఏప్రిల్ 20:ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా ఏపీకి మోసం చేసిన బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా శుక్రవారం పట్టణంలో ఎమ్మెల్యే బీసీ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ విభజన మోసం, ఇప్పుడు బీజేపీ ప్యాకేజీ మోసాన్ని ప్రజలు గమనించారని, రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. ఇక వైసీపీ డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. జగన్ తనపై వున్న కేసులను మాఫీ చేయించుకునేందుకే కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. అనంతరం డా. విజయకుమార్ ఎమ్మెల్యే బీసీకి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.