కర్నూల్

సీఎం చంద్రబాబు గుడికి భూమిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఏప్రిల్ 20: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంత వరకు ఏ రాజకీయ నాయకుడికి గుడి కట్టిన దాఖలాలు లేవు. అయితే హిజ్రాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెన్షన్‌తోపాటు పలు సంక్షేమ పథకాలు వర్తింపచేశాడని, ఇంతవరకు దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా చంద్రబాబునాయుడు తమకు చేసిన మేలుకు ప్రతిరూపంగా ఆయన గుడి కట్టించేందుకు నిర్ణయించుకున్నట్లు అఖిల భారత హిజ్రాల సంక్షేమ సంఘం నాయకులు పిడిశల విజయకుమార్ తెలిపారు. శుక్రవారం నంద్యాల పట్టణ శివారులోని పెద్ద కొట్టాల సమీపంలో మహానంది రహదారిలో సీఎం చంద్రబాబునాయుడు గుడికి పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, కలెక్టర్ సత్యనారాయణ హాజరై భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హిజ్రాలు హాజరై చంద్రబాబునాయుడు తమకు దేవునితో సమానమన్నారు. దేశంలోనే హిజ్రాలకు అండగా నిలిచిన వారు ఎవరూ లేరని, చంద్రబాబునాయుడు తమ జీవితాలను ఒక గాడిలో పెట్టేందుకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమను విశేషంగా ఆకట్టుకున్నాయని, తమ బాధలు, అవస్థలు తెలుసుకున్న సీఎం హిజ్రాలకు పెన్షన్లు మంజూరు చేయడం దేశ చరిత్రలోనే తొలిసారిగా చోటు చేసుకుందని, అందుకే దేవుడిలా ఆదుకున్న చంద్రబాబుకు గుడి కట్టిస్తామని వారు తెలిపారు. హిజ్రాలు కట్టిస్తున్న గుడిలో తెలుగుదేశం పార్టీ నాయకులు అభిరుచి మధు ఆర్థిక సహాయం రూ.5 లక్షల ఖర్చుతో చంద్రబాబునాయుడు వెండి విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నామని, గుడి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తారని హిజ్రాలు అన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తమ పార్టీని గెలిపించుకొని మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తారని హిజ్రాలు తెలిపారు.

కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకీ..
* మంత్రి అఖిలప్రియ
ఆళ్లగడ్డ, ఏప్రిల్ 20: ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకీ కూడా పడుతుందని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ అన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేకహోదాను కోరుతూ చేస్తున్న ధర్మపోరాట దీక్షకు మద్దతుగా మంత్రి అఖిలప్రియ ఆళ్లగడ్డలో దీక్ష చేపట్టారు. మంత్రి చేపట్టిన ధర్మపోరాట దీక్షకు పాత్రికేయులు, న్యాయవాదులు, మహిళాసంఘాలు, పొదుపు మహిళలు, కళాశాల విద్యార్థినులు, పాఠశాల బాలబాలికలు, తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీకి అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రకు చెందిన ప్రతి ఒక్కరూ నిలదీయాలన్నారు. కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బడ్జెట్ ఎంతో బాగుందని అనడం సమంజసమేనా అన్నారు. మన రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను అన్నింటిలో ఒకటి కూడా నెరవేర్చకుండా ఏపీకి అన్యాయం చేస్తుంటే విజయసాయిరెడ్డి ఈ విధంగా ప్రధానికి కితాబు ఇవ్వడం వల్ల ప్రజలందరూ ఆయనపై వ్యతిరేకభావంతో వున్నారన్నారు. తెలుగుదేశం ఎంపీలు ప్రధాని ఇంటి వద్ద ధర్నా చేశారని, ఆ ధైర్యం ఒక తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. రైతుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేస్తున్నప్పటికీ వైకాపా నాయకులు చంద్రబాబును విమర్శించడం తగదన్నారు. కేంద్రంపై ప్రత్యేకహోదా ఇచ్చేంతవరకు ఇక్కడే కాకుండా ఢిల్లీ వరకు కూడా ధర్నాలు చేపడతామన్నారు. ప్రత్యేకహోదా వల్ల అనేక పరిశ్రమలు రావడమే కాక నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలతో పాటు అనేక ఇతర వృత్తులవారికి కూడా పని కల్పించిన వారవౌతామన్నారు. అలాగే రేపటి నుండి ప్రతి గ్రామంలో సైకిల్ యాత్ర నిర్వహించి గ్రామప్రజలందరికీ ఈ ధర్మపోరాటం గురించి, కేంద్రం చేసిన అన్యాయం గురించి ప్రతి పౌరునికి తెలియజేసి అందరూ కూడా కేంద్రంపై తిరుగుబాటు చేసేలా చైతన్యం తీసుకొస్తామన్నారు.