క్రైమ్/లీగల్

శ్రీశైలం డ్యాం వద్ద విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, ఆగస్టు 21: శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మ సోయగాలను తిలకించేందుకు వచ్చి కృష్ణానదిలో నలుగురు యువకులు గల్లంతైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురంకు చెందిన అనిల్‌కుమార్, జిలాని, కాశీంవలి, వెంకటేశ్వర్లు రెండు బైక్‌లపై శ్రీశైలం డ్యాం వద్దకు మంగళవారం మధ్యాహ్నం చేరుకున్నారు. గేట్లను తిలకించేందుకు శ్రీశైలం డ్యాం వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికి నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో గేట్లను అధికారులు మూసి వేశారు. దీంతో ఆ యువకులు సమీపంలోని లింగాలగట్టు మత్స్యకారుల గ్రామం వద్ద గల హై లెవెల్ పుష్కర ఘాట్ వద్ద నది స్నానం ఆచరిస్తుండగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటి ప్రవాహం ఉండడంతో వారికి ఈత రాక నదిలో కొట్టుకొని పోతుండగా, అక్కడే చేపలు పట్టుకుంటున్న మత్స్యకారులు గమనించి యువకులను కాపాడేందుకు ప్రయత్నించారు. అందులో ముగ్గురిని కాపాడగా అనిల్ కుమార్ అనే యువకుడు నీటిలో మునిగి పోయాడు. ఆ యువకుని ఆచూకీ కోసం మత్స్యకారులు ఎంత గాలించినా లభించలేదు. ఘటనా స్థలాన్ని రెండవ పట్టణ పోలీసులు పరిశీలించి గాలింపు చర్యలు చేపట్టారు.

బకెట్‌లో పడి ఏడాది బాలుడి మృతి
నందికొట్కూరు, ఆగస్టు 21:మండల పరిధిలోని కొణిదేల గ్రామంలో మంగళవారం ఒక ఏడాది వయస్సు గల బాలుడు బకెట్‌లో పడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆదికొండ కృష్ణమోహన్, హరిత దంపతులకు భవదీప్(1) సంతానం. కుటుంబ సభ్యులు ఇంటి పనిలో నిమగ్నమైన సమయంలో భవదీప్ ఇంట్లో వున్న బకెట్‌లో పడి శవంగా కన్పించడంతో కుటుంబీకుల బోరుల విలపించారు. బాలుడు ఆడుకుంటూ వెళ్లి బకెట్‌లోని నీటిలో పడి ఊపిరి ఆడక మృతి చెంది వుంటాడని గ్రామస్థులు తెలిపారు.

అరెస్టు చేస్తే ఆత్మహత్య చేసుకుంటా..
* భవనం ఎక్కి బెదిరించిన హత్య కేసులో నిందితుడు
నందికొట్కూరు, ఆగస్టు 21:తనను అరెస్టు చేస్తే ఆత్మహత్యకు పాల్పడుతానని పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన సంఘటన మంగళవారం మండల పరిధిలోని మల్యాల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. నందికొట్కూరు సర్కిల్ పరిధిలో 2 హత్య కేసుల్లో నిందితుడిగా వున్న బ్రాహ్మణకొట్కూరుకు చెందిన రాజు మంగళవారం నందికొట్కూరులో పోలీసుల కంటపడ్డాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అతడు తప్పించుకుని మల్యాల గ్రామానికి వెళ్లాడు. అతడిని పోలీసులు వెంబడించడంతో రాజు అక్కడ పాత గ్రామపంచాయతీ కార్యాలయం భవనం పైకి ఎక్కి తనను అరెస్టు చేస్తే కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించాడు. దీంతో సీఐ వెంకటరమణ సమయస్ఫూర్తితో వ్యవహరించి గ్రామస్థుల సహకారంతో సర్ది చెప్పి అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.