కర్నూల్

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెదే ప్రభంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడుమూరు, సెప్టెంబర్ 19: వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని జిల్లా యువనేత కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలో ఏఐసీసీ అధ్యక్షడు రాహుల గాంధీ పర్యటన విజయవంతం కావడంపై బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బరుసు రఘునాథ్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ నేతలతో కొంత సేపు ముచ్చటించారు. సభకు హాజరైన జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కోట్ల అభిమానులకు, సానుభూతి పరులకు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రత్యేక హోదాను సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా పోరాటాలు సాగిస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వైకాపా, జనసేన పార్టీలు హోదాను వ్యతిరేకిస్తున్నాయన్నారు. హోదాను వ్యతిరేకించే వైకాపా పార్టీకి వచ్చే ఎన్నికల్లో అడ్రస్సు గల్లంతు అవుతాయన్నారు. నాల్గేళ్ల పాలనపై బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు విసుగుచెంది, మళ్లీ కాంగ్రెస్ పార్టీని గుర్తించి రాహుల పర్యటనకు భారీగా ప్రజలు తరలి వచ్చారన్నారు. ఆ పాలక వర్గాల పాలన తీరుకు ఇక వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలకు ఓటమి తప్పదన్నారు. ఎన్నికల హామీలను పరిష్కరించడంలో పాలక వర్గాలు ఘోరంగా విఫలమయ్యావని దుయ్యబట్టారు. విభజన చట్టంలోని హామీలను పరిష్కరించడంలో బీజేపీ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, సామాన్య ప్రజల జీవన పరిణామాలు మెరుగుపరుస్తానన్న హామీలు ఎక్కడ అమలు అయ్యాయని ప్రశ్నించారు. రోజు రోజుకి పెరుగుతున్న చమురు ధరలను అదుపుచేయడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రైతులు, ప్రజా సంక్షేమాలు నిర్వీర్యం అయ్యాయని తెలిపారు. రాష్ట్ర విభజనతో ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులతో అభివృద్ధి సాధించడం లేదని, అంతేగాక విభజన తరువాత ఆంధ్రకు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టకోలేదని ఆరోపించారు. రైతులు, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని స్పష్టం చేశారు.

జననేత జగన్ : ఎమ్మెల్యే ఐజయ్య
ఆత్మకూరు, సెప్టెంబర్ 19: ప్రజల్లో ఉంటూ, 2970 కిలో మీటర్లు తిరుగుతూ ప్రజల్లో మమేకమై తిరుగుతున్న వైకాపా అధ్యక్షులు జగన్ జననేతగా అయ్యాడని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. బుధవారం సుప్రసిద్ధమైన కొలను భారతి క్షేత్రాన్ని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. రావాలి జగన్ - కావాలి జగన్ అనే కార్యక్రమం విజయవంతం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పురోహితులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర వల్ల జగన్‌కు విశేష స్పందన లభించిందన్నారు. చంద్రబాబు సీఎం అధికారం చేపట్టినప్పటి నుండి ప్రజలను మోసం చేస్తున్నారని, ఈ విషయాన్ని వారు గమనిస్తున్నారన్నారు. రైతులను, పొదుపు మహిళలను దగా చేయడం ముఖ్యమంత్రికే చెల్లిందన్నారు. దివంగత రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పేరు మార్చి మేమే అమలు చేస్తున్నామని చెప్పడం అన్యాయమన్నారు. పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పెడితే సీఎం చంద్రబాబు ఆయన కాలంలో ఒక్కరికి కుడా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదన్నారు. ప్రజల సహకారం, ఆశీర్వాదంతో జగన్ సీఎం అయితే మద్యపాన నిషేదం చేస్తారన్నారు.

ఫిల్టర్‌బెడ్ నిర్మాణానికి పొలం సర్వే
మిడుతూరు, సెప్టెంబర్ 19: మిడుతూరు పొలిమేరలోని మహిళా రైతు నర్సమ్మకు చెందిన రెండు ఎకరాల పొలాన్ని బుధవారం ఆర్డీఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు. మండలంలోని అలగనూరు రిజర్వాయర్ నుంచి నందికొట్కూరు మున్సిపాలిటీకి మంచినీటి సరఫరా కోసం సుమారు రూ.109కోట్లు మంజూరు కాగా, మిడుతూరు పొలిమేరలోని నర్సమ్మకు చెందిన పొలంలో ఫిల్టర్‌బెడ్ నిర్మాణానికి సరిపోతుండడంతో ఆ పొలాన్ని మున్సిపాలిటీ అధికారులు కొనుగోలు చేస్తున్నారు.