కర్నూల్

గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 19: గణేష్ నిమజ్జనం, మొహర్రం పండుగలు ఈనెల 21న జరగనున్న సందర్భంగా పోలీసుశాఖ కట్టుదిట్టమైన భారీ బందోబస్తు చర్యలు చేపట్టిందని ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ చెప్పారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ పండుగలు ప్రశాంత వాతవారణంలో శాంతియుతంగా నిర్వహించేకునేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగంతోపాటు భారీ సంఖ్యలో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరింపజేశామన్నారు. నిబంధనలకు ఎవరు నిరుద్దంగా ప్రవర్తించినా, ఆవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనుమానిత వస్తువులుగాని, వ్యక్తులు గాని తారసపడితే డయల్ 100గాని, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చే మహిళలు, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలన్నారు. మతపెద్దలు, శాంతి కమిటీ సభ్యులు, రాజకీయ పార్టీలు, యువత, మీడియా నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు సహాయ సహకారాలు అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 21వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు నగరంలో ట్రాఫిక్‌ను మళ్లించినట్లు ఎస్పీ తెలిపారు. అత్యసవర (108, పైర్, అంబులెన్స్‌లు, పోలీసు వాహనాలు) సేవల కోసం పోలీసు వారితో అనుమతి పొందిన వాహనాలు మాత్రమే నిమజ్జన మార్గంలో అనుమతిస్తామన్నారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ మీదుగా రాజ్‌విహార్ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి, వినాయక్‌ఘాట్, మద్దూర్‌నగర్, రోడ్డు భవనాలశాఖ మీదుగా వాహనాల రాకపోకలను నిషేధించామన్నారు. ఆ వాహనాలను బళ్ళారి చౌరస్తా నుండి జాతీయ రహదారి మీదుగా మళ్లించామన్నారు. ఆత్మకూరు, నంద్యాల, నందికొట్కూర్, నంద్యాల చెక్ పోస్టు వైపు నుండి నగరంలోకి వచ్చే వాహనాలు సి.క్యాంపులోని రైతుబజారు, బిర్గాగేటు మీదుగా గుత్తి పెట్రోల్ బంక్ వద్ద బైపాస్‌రోడ్డు నుండి కల్లూరు, బళ్ళారి చౌరస్తా మీదుగా ఆర్టీసీ బస్టాండ్ చేరుకుంటాయన్నారు. హైదరాబాదు, గద్వాల, అలంపూర్ నుం వచ్చే వాహనాలు మామిదాలపాడు తుంగభద్ర బ్రిడ్జి జంక్షన్ క్రాస్ నుండి కర్నూలు నగరంలోనికి రాకుండా జాతీయ రహదారి మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుంటాయన్నారు. అనంతపురం నుండి వచ్చే వాహనాలు గుత్తి పెట్రోల్ బంక్ నుండి బైపాస్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ చేరుకుంటాయన్నారు. గణేష్ నిమజ్జన వేడుకల్లో ఏ చిన్న పాటి సంఘటనలు చోటు చేసుకున్నా బాధ్యలైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

చురుగ్గా వినాయక నిమజ్జన ఏర్పాట్లు
కర్నూలు సిటీ, సెప్టెంబర్ 19: నగరంలో ఈ నెల 21వ తేదీన అత్యంత వైభవ పేతంగా జరగనున్న వినాయక నిమజ్జనానికి నగర పాలక సంస్థ అధికారులు చేస్తున్న పనులు చురుగ్గా సాగుతున్నాయి. నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి ఆదేశాల మేరకు ఎం ఈ సురేంద్రబాబు నేతృత్వంలో బుధవారం మరమ్మతుల పనులు, ప్యాచ్ వర్క్స్, చెత్త వ్యర్థాలను తొలగించే పనులను పారిశుద్ధ్యం సిబ్బంది చేపట్టారు. నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చే ప్రముఖులు, ప్రజలకు ఎలాంటి అ సౌకర్యాలు కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. వెలుతురు కోసం లైట్లను అమర్చటం, పలు కూడళ్లలో మైకుల ఏర్పాటు, నీటిలో తేలియాడే తెప్ప సంబంధించిన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అయ్యప్ప స్వామి ఆలయం వైపుగా ఉన్న మరో ఘాట్‌లో నిమజ్జనాన్ని చేయటానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.