క్రైమ్/లీగల్

నగర పాలక సంస్థలో అవినీతి బిల్ కలెక్టర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, సెప్టెంబర్ 22:నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఓ అవినీతి బిల్ కలెక్టర్ శనివారం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాలు.. జహంగీర్ ఖాశీం అనే వ్యక్తి నగరంలోని బాలాజీనగర్‌లో ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఇంటిని తన పేరు పైకి మార్చుకునేందుకు నగర పాలక సంస్థ కార్యాలయంలో బిల్ కలెక్టర్‌గా పని చేస్తున్న ఎస్‌ఎండీ షరీఫ్‌ను కలిశాడు. దీంతో షరీఫ్ రూ. 7 వేలు లంచం డిమాండ్ చేయగా చివరకు రూ. 6 వేల ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే లంచం ఇవ్వడం నేరమని భావించిన జహంగీర్ ఖాశీం ఏసీబీ అధికారులను ఆశ్రయించి జరిగినదంతా వారికి వివరించాడు. దీంతో ఏసీబీ అధికారులు ఓ పథకం రూపొందించారు. ఆ మేరకు శనివారం నగరంలోని ప్రకాష్‌నగర్‌లో ఉన్న రాధాకృష్ణన్ ఆసుపత్రి ఎదురుగా షరీఫ్ రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారని ఏసీబీ డీఎస్పీ జయరాజ్ తెలిపారు. ఇదిలా ఉండగా గత ఏప్రిల్‌లో బిల్ కలెక్టర్ సుధాకర్ స్థానిక శ్రీరామ థియేటర్ ఎదురుగా కుళాయి కనెక్షన్ కోసం రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే. ఆ సంఘటన మరువక ముందే అదే విభాగంలో మరో బిల్ కలెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడం గమనార్హం.