కర్నూల్

ఫిబ్రవరిలో రుణమాఫీ రెండో దఫా చెల్లింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోవెలకుంట్ల, జనవరి 20: ఫిబ్రవరి నెలలో రుణమాఫీ రెండవ దఫా చెల్లింపులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రైతలు నష్టపోవడానికి వీలులేదన్నారు. నష్టపోయిన రైతులను అన్నివిధాల ఆదుకుంటామన్నారు. రైతులకు చేయూతగా ఉండేందుకు వ్యవసాయంతో పాటు పాడిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ పద్ధతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈనెల 24 తేదీ నుంచి కాకినాడలో ఏడురోజుల పాటు సేంద్రీయ పద్దతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి జిల్లాకు ఒక యూనిట్ చొప్పున ఒక్కో యూనిట్‌లో 10 క్లస్టర్లు, క్లస్టరుకు 30 మంది రైతుల చొప్పున ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తామన్నారు. వీరే కాకుండా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయాలనకునే ఔత్సాహికులు సైతం ఈ శిక్షణకు హాజరుకావచ్చన్నారు. మంగళవారం రాత్రి నుండి జిల్లాలో కురిసిన వర్షానికి పంట దెబ్బతినిందని మండలానికి చెందిన రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఉందన్నారు. కరవు మండలాల రైతుల రుణాలు రీషెడ్యూల్ చేస్తామన్నారు.