క్రైమ్/లీగల్

బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దకడుబూరు, నవంబర్ 8: మండల పరిధిలోని కంబళదినె్న గ్రామంలో బ్యాంక్ ఉద్యోగి కురువ పూజారి నరసప్ప(36) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ అశోక్ గురువారం విలేఖరులకు తెలిపారు. కంబళదినె్న గ్రామానికి చెందిన కురువ పూజారి మారెప్ప, లక్ష్మీల కుమారుడైన నరసప్ప ఆదోనిలోని ఆంధ్రబ్యాంక్‌లో సింగిల్‌విండో ఆపరేటర్ ఉద్యోగిగా పనిచేస్తుడేవాడని, మూడురోజుల క్రితం హైదరాబాద్‌లో శిక్షణ తరగతులకు వెళ్లి వచ్చారని తెలిపారు. బుధవారం ఉదయం కంబళదినె్నకు వచ్చినట్లు, అయితే ఇంట్లో వారందరు పనులకు వెళ్ళిన తరువాత పురుగుల మందు తాగినట్లు తెలిపారు. తల్లి లక్ష్మి సాయంత్రం పని నుండి ఇంటికి రాగా అప్పటికే నరసప్ప మృతి చెంది ఉన్నాడని, దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారన్నారు. తల్లి మాట్లాడుతూ మా అబ్బాయికి ఎటువంటి బాధలులేవని, ఎందుకిలా చేశాడో తెలియదని, మా అబ్బాయి మరణంపై ఎవరిపైనా అనుమానాలు లేవని తల్లిదండ్రులు తెలిపినట్లు ఎస్‌ఐ తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరుకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.