కర్నూల్

అహోబిలంలో వైభవంగా గరుడోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన ఎగువ అహోబిలంలో గరుడోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. బుధవారం అర్ధరాత్రి ఎగువలో గరుడోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు. గరుడోత్సవంలో భాగంగా ఉత్సవమూర్తులను అభిషేకించి, ప్రత్యేకంగా అలంకరించి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి స్వామి, అమ్మవార్లను గరుడవాహనంపై కొలువుంచారు. ఈ సందర్భంగా తమ తోబుట్టువు అయిన చెంచులక్ష్మిని నరసింహస్వామి పరిణయం ఆడడంతో వరుసకు బావగా భావించి ఆటపట్టించే కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేశాయి. అందులో భాగంనే గరుడోత్సవంపై ఆశీనులైన స్వామి వారి ఆభరణాలను అపహాస్యానికి అపహరించడం, అర్చకులను ఎత్తుకెల్లడం ఇలాంటి కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. దిగువలో గురువారం ఉదయం చక్రవారి తీర్థ స్నానం కార్యక్రమం జరిగింది. అహోబిల మఠం 46వ జియ్యర్ శ్రీవన్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజి ఎగువలో జరిగిన గరుడోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించా రు. అందులో భాగంగా ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీదే వి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ఆలయం నుండి సమీపంలో వున్న కోనేరు వద్దకు మేళతాళాలతో తీసుకెళ్లారు. అక్కడ స్వామి కి, సుదర్శనమూర్తి, నిత్యఉత్సవమూర్తికి పంచామృతాభిషేకాన్ని ప్రధానార్చకులు వేణుగోపాలన్ జియ్యర్ స్వామి సమక్షంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం సుదర్శనమూర్తిని, నిత్య ఉత్సవమూర్తికి కోనేరులో చక్రవారి తీర్థ స్నానం చేయించారు. సాయంత్రం ద్వాదశారాధనం కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో స్వామికి జరిగిన ఆరాధనా దోషాలను నివృత్తి చేసుకోవడం కోసం స్వామికి 12 సార్లు తిరువారాధన చేసి 12 రకాల భక్ష్యాలను, 12 రకాల అన్నం నివేదించారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయం బయట నుండి బారులు తీరారు. అహోబిలానికి వచ్చే భక్తులకు అన్ని కులాల వారు ఏర్పాటు చేసిన అన్నసత్రాలలో అన్నదానం చేశారు.
గరుడోత్సవంలో ఎస్పీ రవికృష్ణ..
పుణ్య క్షేత్రమైన ఎగువ అహోబిలంలో బుధవారం రాత్రి జరిగిన గరుడోత్సవంలో ఎస్పీ ఆకె రవికృష్ణ కుటుంబసమేతంగా స్వామిని దర్శించుకున్నారు. ముందుగా స్వయంభువుగా వెలసిన నరసింహస్వామిని, చెంచులక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గరుడోత్సవంలో పూజలు చేసి స్వామి కొలువుదీరిన పల్లకిని ఇఓ తిమ్మనాయుడుతో కలిసి మోశారు. గరుడోత్సవం సందర్భంగా చెంచులు చేస్తున్న విన్యాసాలను తిలకించారు. గురువారం ఉదయం దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాద వరదస్వామి, శ్రీ అమృతవల్లి అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఇఓ తిమ్మనాయుడు నవనారసింహుల చిత్ర పటాన్ని ఎస్పీకి అందజేశారు. మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామిని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు. తిరుణాల సందర్భంగా అహోబిలంలో జరుగుతన్న రాష్ట్ర స్ధాయి వృషభరాజముల బలప్రదర్శన పోటీలను తిలకించారు. ఎస్పీ వెంట డిఎస్పీ ఈశ్వరరెడ్డి, సిఐలు ఓబులేసు, కేశవరెడ్డి, రూరల్ ఎస్‌ఐ రామయ్య, రుద్రవరం ఎస్‌ఐ హనుమంతయ్య తదితరులు పాల్గొన్నారు.
పనితీరు మార్చుకోకపోతే చర్యలు..
* అధికారులకు కలెక్టర్ హెచ్చరిక
ఆలూరు, మార్చి 24: అధికారులు పనితీరు మార్చుకోక పోతే చర్యలు తప్పవని కలెక్టర్ విజయమోహన్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. గురువారం మం డలంలోని జొన్నగిరి గ్రామాన్ని కలెక్టర్ సందర్శించారు. గ్రామంలో అపరిశుభ్రత లోపించడంతో ఇఓఆర్డీపై మండి పడుతూ ఇన్‌క్రిమెంట్ కట్ చేయాలని ఆదేశించారు. ఉపాధి పనులకు సం బంధించి జాబ్‌కార్డులు ఇవ్వలేదని కూలీలు ఫిర్యాదు చేశారు. ఉపాధి పనులు కింద ఇంకుడు గుంతలు చేపట్టకపోవడంతో కలెక్టర్ ఫీల్డ్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. అలాగే గ్రామానికి నెల రోజులుగా విరుపాపురం రిజర్వాయర్ నుండి నీటి సరఫరా జరగలేదని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో కలెక్టర్ మండిపడుతూ కాంట్రాక్టర్ శ్రీ్ధర్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని ఎస్‌ఐని ఆదేశించారు. గ్రామంలో ఉపాధి పనుల్లో పురోగతి కనిపించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వేసవి దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో నీటి సమస్య రాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ముద్దనగేరి గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడం, సక్రమంగా పనులు చేపట్టకపోవడంతో సర్పంచ్ చెక్ పవర్‌ను రద్దు చేయాలని ఎంపిడిఓను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఆలూరులోని పాత బస్టాండ్‌లో చలివేంద్రాన్ని ప్రారంభించారు. కలెక్టర్ వెంట డిపిఓ శోభాస్వరూపరాణి, జిల్లా పరిషత్ సిఇఓ ఈశ్వర్, ఉపాధి హామీ పథకం అధికారులు, ఎంపిడిఓ మధుభూషన్‌రావు, తహశీల్దార్ సూర్యనారాయణ ప్రసాద్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
వడదెబ్బకు గురై ఇద్దరి మృతి
బేతంచెర్ల, మార్చి 24: జిల్లాలో గురువారం సూర్యుడు ప్రతాపం చూపడంతో ప్రజలు ఎండ తీవ్రతకు అల్లాడిపోయారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. వారిలో బేతంచెర్ల పట్టణంలో యన్.మల్లికార్జునరెడ్డి(52), కొలిమిగుండ్ల మండలం యర్రగుడి గ్రామ మాజీ సర్పంచ్ జిల్లెల్ల పుల్లారెడ్డి (85) వడదెబ్బకు గురై మృతి చెందారు. వివరాలు.. బేతంచెర్ల పట్టణంలోని సంజీవనగర్ కాలనీకి చెందిన యన్.మల్లికార్జునరెడ్డి కుమారుని పెళ్లికి వంటచెరకు సమకూర్చుకు నేందుకు కొండకు వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. రాత్రి ఇంట్లో నిద్రపోయిన మల్లికార్జునరెడ్డి ఉదయం నిద్ర నుండి లేవకపోవడంతో కుటుంబ సభ్యులు కదిలించి చూశారు. అయితే ఎలాంటి స్పందనలేకపోవడంతో వైద్యులకు చూపించగా అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. కుమారుడి పెళ్లి నాలుగు రోజులు ఉండగా మల్లికార్జునరెడ్డి మృతి వార్త ఆ కుటుంబంలో, బంధువుల్లో విషాదం నింపింది. అతడికి భార్య ప్రమీళమ్మతో పాటు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు.
కొలిమిగుండ్లలో..
కొలిమిగుండ్ల : మండల పరిధిలోని యర్రగుడి గ్రామ మాజీ సర్పంచ్ జిల్లెల్ల పుల్లారెడ్డి (85) గురువారం వడదెబ్బకు మృతి చెందాడు. పుల్లారెడ్డి పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి 1966 వరకూ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై కొనసాగారు. గురువారం ఇంటి ముందు కూర్చొని ఉండగా, ఎండ వేడిమి తాళలేక అస్వస్థతకు గురై వడదెబ్బతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. పుల్లారెడ్డి సర్పంచ్‌గా కొనసాగిన కాలంలో గ్రామాభివృద్ధికి కృషి చేసిన మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల మండలంలోని వివిధ గ్రామాల నాయకులు, ప్రజలు కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.
ఎర్రచందనం రవాణాపై ప్రత్యేక నిఘా
* 78 సమస్యాత్మక గ్రామాలు దత్తత : ఎస్పీ
ఆళ్లగడ్డ, మార్చి 24: ఎర్రచందనం రవాణాపై ప్రత్యేక నిఘా వుంచామని ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా ప్రత్యేక టాస్క్‌పోర్స్ బృందాలతో కూంబింగ్ చేయ్తిన్నామన్నారు. జిల్లా లో వుండే 78 సమస్యాత్మక గ్రామాలను పోలీసు అధికారులు దత్తతకు తీసుకున్నారని, వాటిపై దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తాను ఐపిఎస్ శిక్షణలో వున్న సమయంలో కప్పట్రాళ్ల గ్రామానికి వెళ్లానన్నారు. ఆ గ్రామంలోని స్థితి గతులను చూసి ఇలాంటి గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఆలోచన వచ్చిందన్నారు. జిల్లాకు ఎస్పీగా రావడంతో కప్పట్రాళ్ల గ్రామా న్ని దత్తతకు తీసుకొని ఆ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. 10 గదులతో పాఠశాల భవనం, ప్రహరీ నిర్మించామన్నారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేయించామన్నారు. గ్రామాల్లో అక్షరాస్యత శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. బడిఈడు పిల్లందరినీ బడిలో చేర్పించాలన్నారు. కప్పట్రాళ్ల గ్రామంలోనే స్వంత ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలాన్ని కొనుగోలు చేసి ఓటరుకార్డు, ఆధార్‌కార్డు తీసుకుంటామన్నారు. గ్రామాల్లోని యువతలో చైతన్యవంతులు అవుతున్నరన్నారు. పొలీసు అధికారులు దత్తత తీసుకున్న గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తామన్నారు. ఇటీవలి కాలంలో జిల్లాలో నేరాల సంఖ్య తగ్గిందన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా చాలా వరకు తగ్గిందన్నారు. ఎస్పీ వెంట డిఎస్పీ ఈశ్వరరెడ్డి వున్నారు.
క్షయ భయంకరమైన అంటువ్యాధి
* ముందులు వాడితే విముక్తి:జెసి రామస్వామి
కర్నూలు, మార్చి 24:క్షయ భయంకరమైన అంటు వ్యాధి అని జాయింట్ కలెక్టర్-2 రామస్వామి పేర్కొన్నారు. జాతీయ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం ఆసుపత్రిలోని క్లినికల్ లెక్చరీ గ్యాలరీలో ‘ఐక్యమవుదాం-క్షయవ్యాధిని నిర్మూలిద్దాం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన జెసి-2 రామస్వామి మాట్లాడుతూ క్షయ రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ క్రిములు గాలి ద్వారా ఇతరులకు వ్యాపిస్తాయన్నారు. 2 వారాలకు మించి దగ్గు, గళ్ల, జ్వరం, బరువు, ఆకలి తగ్గడం, ఉమ్మిలో రక్తం పడటం తదితర లక్షాలు ఉన్నవారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రందించాలన్నారు. క్షయ వ్యాధి ఉన్న వారు 6 నెలలకు సరిపడే ఖరీదైన మందులు ఉచితంగా పొందవచ్చున్నారు. ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడి క్షయ వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చన్నారు. క్షయ వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా మందులు వాడి నియంత్రించుకోవాలని సూచించారు. క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు, కావాల్సి మందులు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందజేస్తారని తెలిపారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన నంద్యాలకు చెందిన ఎస్‌టిఎల్‌ఎస్ రామామహేష్, కోవెలకుంట్లకు చెందిన ఎస్‌టిఎస్ పరమేశ్వరరెడ్డి, వెల్దుర్తికి చెందిన ఎల్‌టి సత్యరాజ్, ఎమ్మిగనూరుకు చెందిన టిబిహెచ్‌వి నాగేశ్వరమ్మకు జెసి రివార్డులు అందజేశారు. అలాగే టిబి రోగులకు ఉచితంగా దుప్పట్లు అందజేశారు. సమావేశంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. రాంప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వీరస్వామి, ఐఎంఎ అధ్యక్షుడు డా. శంకర్‌శర్మ, టిబి అసోసియేషన్ నాయకులు వెంకటేశ్వర్లు, మలేరియా అధికారి హుసేన్‌పీరా, తదితరులు పాల్గొన్నారు.
సీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలి
* ఆర్పీఎస్ అధ్యక్షుడు బైరెడ్డి
వెల్దుర్తి, మార్చి 24:రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బైరెడ్డి చేపట్టిన బస్సుయాత్ర గురువారం వెల్దుర్తికి చేరుకుంది. ఈ సందర్భంగా బైరెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తూ రాయలసీమ జిల్లాలు అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడి ఉన్నాయన్నారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ జిల్లాలకు పూర్తి అన్యా యం చేస్తున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణం పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. కేవలం రాజధాని జపం చేస్తూ రాయలసీమ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. రాయలసీమ జిల్లాలకు రావాల్సిన నీటి వాటా ను రాబట్టడంలో టిడిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎందరో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడం లేదని దుయ్యబట్టారు.
తాగునీటికి ప్రాధాన్యమివ్వాలి
* కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్‌రెడ్డి
కర్నూలు సిటీ, మార్చి 24: జిల్లా ఉన్నతాధికారులు పంట పొలాలకు కాకుండా తాగునీటికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ. మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ గురువారం సమ్మర్ స్టోరేజీ ట్యాంక్, సుంకేసుల జలాశయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుంకేసుల జలాశయంలో 1.2 టిఎంసిల నీరు నిల్వ ఉంటే కర్నూలు నగర ప్రజలు వేసవిలో తాగునీటికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదన్నారు. అయితే కలెక్టర్ విజయమోహన్ గత నెల 23వ తేదీ పంట పొలాలకు నీరు విడుదల చేయించారన్నారు. దీంతో ప్రస్తుతం సుంకేసుల జలాశయంలో 0.64 టిఎంసిల నీరు మాత్రమే ఉందని, ఈ నీరు కేవలం నెల రోజులకే సరిపోతాయని వెల్లడించారు. ఆ తర్వాత కర్నూలు నగర ప్రజలు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఉన్నతాధికారులు ముందు వెనకా ఆలోచించకుండా పంట పొలాలకు నీరు విడుదల చేయటం ఏంటని ప్రశ్నించారు. సుంకేసుల జలాశయం నుంచి సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు నీటిని తరలించి అక్కడి నుంచి కర్నూలు నగరానికి సరఫరా చేస్తారని, అయితే ప్రస్తుతం ఉన్న జనాభాకు ఒక సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నీరు చాలడం లేదన్నారు. దీంతో మరొక సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ నిర్మాణానికి నిధులు మంజూరైనా స్వార్థ రాజకీయాల వల్ల పనులు చేపట్టకపోవడంతో వచ్చిన నిధులు కూడా వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండ తాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవిధంగా అందరూ ఐకమత్యంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జలమండలి ఎస్‌ఇ చంద్రశేఖర్‌రావు, వైకాపా నాయకులు నరసింహులుయాదవ్, షరీఫ్, సలీం, రాఘవేంద్రనాయుడు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
సమస్యాత్మక గ్రామాల అభివృద్ధికి కృషి
* సామాజిక సేవలో పోలీసులు ముందుండాలి : ఎస్పీ
నంద్యాల రూరల్, మార్చి 24: జిల్లాలో 78 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయని, వాటి అభివృద్ధికి తన వంతు శాయశక్తుల కృషి చేస్తానని ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. గురువారం మండల కేంద్రమైన గోస్పాడు పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పాఠశాలల అభివృద్ధికి, విద్యను ప్రోత్సహించేందుకు తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం అన్నారు. పేద కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. పోలీసులు కూడా విదులతోపాటు సామాజిక సేవల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. అధికారులు కూడా గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఒక దేవరకొండేకాదని, గ్రామాల అభివృద్ధికి పోలీసు వ్యవస్థ ముందుండాలన్నారు. పోలీసు స్టేషన్ ఆవరణలో ఉన్న క్వార్టర్స్‌లో మొక్కలను ఎస్పీ నాటారు. పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. రాత్రి వేళ పోలీసులు అప్రమత్తంగా ఉండి విధు లు నిర్వహించాలన్నారు. గోస్పాడు మండలంలోని సమస్యాత్మక గ్రామాల పరిస్థితిని సిఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఐ జగదీశ్వర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసు స్టేషన్‌లోని పలురికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్పీ వెంట డిఎస్పీ ఈశ్వర్‌రెడ్డి, సిఐలు, ఎస్‌ఐలతోపాటు ఎఎస్‌ఐ లక్ష్మయ్య, సిబ్బంది ఉన్నారు.

విద్యార్థి దశ నుంచే దిశానిర్దేశాలు
ఏర్పరచుకోవాలి:ఆర్‌యూ విసి
కర్నూలు అర్బన్, మార్చి 24:విద్యార్థి దశ నుంచే విద్యార్థులు దిశానిర్దేశాలను ఏర్పరచుకుని ఆ దిశగా సాధన చేయాలని రాయలసీమ యూనివర్శిటీ విసి వై.నరసింహులు పిలుపునిచ్చారు. రాయలసీమ యూనివర్శిటీలో గురువారం వర్శిటీ కళాశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరై విసి మాట్లాడుతూ విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అభివృద్ధి చెందాలని సూచించారు. అలాగే జీవితంలో స్థిరపడిన తరువాత తమకు అన్ని విధాలుగా స్వేచ్ఛ, అవకాశాలను కల్పించిన దేశానికి సేవ చేయడం మరచిపోకూడదన్నారు. అనంతరం విసిని సన్మానించారు. అలాగే వార్షికోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన వివిధ క్రీడాపోటీల విజేతలకు విసి బహుమతులు ప్రదా నం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య బి.అమర్‌నాథ్, ప్రిన్సిపాల్ ఐఇ.చక్రవర్తి, వర్శిటీ పాలకమండలి సభ్యులు శివశంకర్, వివిధ శాఖాధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ముస్లిం మైనార్టీలకు జనాభా
ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలి
* కడప ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా
నంద్యాల, మార్చి 24: ముస్లిం మైనార్టీలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు చేసి సబ్‌ప్లాన్ అమలు చేయాలని, రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని కడప ఎమ్మెల్యే ఎస్‌బి. అంజద్ బాషా, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఎంఎ గఫూర్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక అంజుమన్ షాదీఖానాలో ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ముర్తుజా అధ్యక్షతన ముస్లిం మైనార్టీల సమస్యలపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కడప ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ముస్లింల ఓట్ల కోసం వారి సంక్షేమంపై ప్రేమ ఒలకబోసి ఎన్నికలైన అనంతరం అసలు పట్టించుకోలేదని, ముస్లింలు తమ నిద్రావస్థను పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాలన్నారు. గఫూర్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలు అన్ని ప్రభుత్వాల చేతిలో నిర్లక్ష్యం చేయబడ్డారని, ముస్లింల దీన పరిస్థితి గురించి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రంగనాథ మిశ్ర ఇచ్చిన నివేదికను ప్రభుత్వాలు తుంగలో తొక్కారన్నారు. అదేవిధంగా బడ్జెట్‌లో ముస్లింలకు రూ. 15 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాల్సి ఉన్నా కేవలం రూ. 710 కో ట్లు కేటాయించారన్నారు. ముస్లింలకు కేటాయించిన అరకొర బడ్జెట్‌లో కూ డా నిధులు పూర్తిగా ఖర్చు చేయలేదని విమర్శించారు. ముస్లింలకు సబ్‌ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగా ల్లో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ముర్తుజా, రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల భావ ప్రకటనపై, వస్తధ్రారణపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించి మైనార్టీల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లిం మైనార్టీలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌లో కేటాయింపులు చేసి సబ్ ప్లాన్ అమలు చేయడంతోపాటు రిజర్వేషన్లకు చట్ట బద్ధత కల్పించాలని సభ్యులందరు ఏకగ్రీవ తీర్మా నం ఆమోదించారు. సదస్సులో ఎపిపి ఎసి మాజీ సభ్యులు డాక్టర్ ఎస్‌ఎండి నౌమాన్, మాజీ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ తనయుడు ఎన్‌ఎండి ఫిరోజ్, వౌలానా అబ్దుల్ జబ్బార్, హాఫీజ్ అంజద్‌బాషా సిద్దిఖి, ఆవాజ్ డివిజన్ కార్యదర్శి ఎస్‌ఎ సమ ద్, పట్టణ అద్యక్షులు వౌలానా అబ్దుల్ సుకూర్, నంద్యాల మండల అధ్యక్షులు మాబూహుసేన్, ముస్లింలు పాల్గొన్నారు.