కర్నూల్

నీటి గండం తప్పదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 25:కర్నూలు నగరానికి తాగునీటి గండం పొంచి ఉందని అధికారులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి లభ్యత తగ్గిపోవడంతో ప్రజలకు తాగునీరు అందించడం అధికారులకు భారంగా మారింది. కర్నూలు నగరానికి వేసవి కాలంలో మూడు నెలలకు పైగా తాగునీరు అందించాలంటే అవసరమైన నీరు నిల్వ లేకపోవడం, నగరంలో చాలా బోర్లు ఇంకిపోవడం వంటి కారణాలతో అధికారులు నీటి సరఫరాలో నెలకొన్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు. నగరానికి తాగునీటి అవసరాలు తీర్చేందుకు సుంకేసుల జలాశయం నుంచి నీటిని సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు తరలించి అక్కడి నుంచి నగర ప్రజలకు సరఫరా చేస్తారు. మార్చి నుంచి జూన్ మాసాంతం వరకూ 5 లక్షల జనాభా ఉన్న నగరంలో ప్రజలకు నీటి అవసరాలకు సరఫరా చేయాలంటే సుంకేసుల జలాశయం, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో 1.20 టిఎంసిల నీరు అందుబాటులో ఉండాలని అధికారులు వెల్లడిస్తున్నారు. నగరంలో ప్రజలకు ప్రతిరోజూ ఒకొక్కరికి సగటున 135 లీటర్ల చొప్పున ప్రతి రోజూ 70 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేయాలని నిబంధనలు ఉన్నాయని వెల్లడవుతోంది. అయితే ప్రస్తుతం సుంకేసుల జలాశయం, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో కేవలం 0.64 టిఎంసిల నీరు అందుబాటులో ఉంది. ఈ నీటిని పొదుపుగా వినియోగించేందుకు ప్రజలకు నిబంధనల ప్రకారం రోజుకు 135లీటర్లకు బదులు సుమారు 80 లీటర్లకు మించి నీరివ్వలేని పరిస్థితి నెలకొని ఉంది. నగరంలోని ప్రధాన కాలనీలకు నీటి సరఫరా ప్రతి రోజూ 2 గంటల చొప్పున సరఫరా చేయగా ప్రస్తుతం ఒక గంటకే పరిమితం చేశారు. ఇక శివారు కాలనీల్లో నీటి సరఫరా రోజు విడిచి రోజు ఇంత వరకూ రెండు గంటలు సరఫరా చేయగా తాజా పరిస్థితుల నేపథ్యంలో అది గంటకే పరిమితం చేశారు. దీంతో ప్రజలు ప్రైవేట్ నీటి వ్యాపారుల మీద ఆధార పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీటి కోసమైతే ప్రతి రోజూ ఒక్కో కుటుంబం సగటున రూ. 50 ఖర్చు చేస్తున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కర్నాటకలోని తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత లేకపోవడం వల్ల నీరు సుంకేసుల జలాశయానికి తీసుకురావడంలో ఇబ్బందులు ఉన్నాయని సాగునీటి అధికారులు పేర్కొంటున్నారు. మరో వైపు భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున బోర్లు కూడా శరవేగంగా ఇంకి పోతున్నాయని భూగర్భ జల వనరుల శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర అవసరాలకు ఉన్న 0.64 టిఎంసిల నీరు కూడా ఎండల కారణంగా ఆవిరవుతున్న నేపథ్యంలో రానున్న 20 రోజుల లోపు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉందని నగర పాలక సంస్థ అధికారులు వెల్లడిస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపామని, అక్కడి నుంచి అందే సూచనల ప్రకారం నీటి సమస్య రాకుండా చూస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.
అదనపు జలాశయం నిర్మించాలి:ఎమ్మెల్యే ఎస్వీ
కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం అదనంగా మరో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మించాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా రాజకీయ కారణాలతో నిర్మాణానికి నోచుకోలేదని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. దీని కారణంగా మంజూరైన నిధులు తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి కర్నూలు నగర ప్రజల దాహార్తి కోసం అదనపు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత వేసవిలో తాగునీటి అవసరాలను తీర్చడం కోసం తుంగభద్ర నదిలో బోర్లు వేయడం, కర్నాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి ఎల్లెల్సీ ద్వారా గాజులదినె్న ప్రాజెక్టుకు అక్కడి నుంచి సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు నీటిని తరలిస్తే సమస్య పరిష్కరించే అవకాశముందని ఆయన సూచించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమాని కలిసి తాగునీటి సమస్య పరిష్కారం కోసం విన్నవిస్తామని తెలిపారు.

విద్యార్థినులను చితకబాదిన టీచర్..
* ఏడుగురికి గాయాలు.. * పరామర్శించిన ఎంఇఓ
హొళగుంద, మార్చి 25: హొళగుంద కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులను తెలుగు ఉపాధ్యాయురాలు ప్లాస్టిక్‌పైపుతో చితకబాధడంతో గాయిత్రీ, మేఘన, రాజమ్మ, స్వాతి, చంద్రమ్మ, పార్వతి, లావణ్య గాయపడ్డారు. శుక్రవారం కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఉపాధ్యాయురాలు చితకబాధడంపై విద్యార్థినులు విలేఖర్లతో వాపోయారు. బుధవారం పాఠశాలకు హోలీ పండుగ సందర్భంగా సెలవు కావడంతో పాఠశాల బయట మైదానంలో ఆడుకోవడానికి వెళ్లామని, దీంతో తెలుగు ఉపాధ్యాయురాలు కోపంతో ప్లాస్టిక్‌పైపుతో కొట్టిందని విద్యార్థినులు తెలిపారు. ఉపాధ్యాయరాయులుపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారికి విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కాగా ఎంఇఓ మహబూబ్‌జాన్ విద్యార్థినులను పరామర్శించారు. ఉపాధ్యాయరాయులు విద్యార్థులను కొట్టింది వాస్తవమేనని ఆమెపై శాఖాపరమైన చర్యలు తీలసుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.