కర్నూల్

ఇసుక రవాణాపై నిరంతర నిఘా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 26: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పథకం మండల స్థాయి అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రజలకు ఇసుకను ఉచితంగా అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లాలో కలెక్టర్, ఎస్పీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయినా అక్కడక్కడ ఇసుక దొంగలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు ఉన్నతాధికారుల దృష్టికి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో తక్కువ ధరకే ఇసుకను ప్రజలకు అందించాలని భావించి రీచ్‌లను పొదుపు గ్రూపు మహిళలకు అప్పగించింది. అయితే అది సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో ఉచితంగా అందించి ప్రజలు నేరుగా ఇసుక రీచ్‌లకు వెళ్లి ఇసుకను తరలించుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు ఉచితంగా తీసుకెళ్లే ఇసుకకు ఎవరైనా ఆటంకాలు కల్పించినా, ఇసుకను తవ్వి ప్రజలకు విక్రయించే ప్రయత్నం చేసినా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించిన వారికి రూ. లక్ష జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. దీంతో జిల్లాలోని అన్ని ఇసుక రీచ్‌ల వద్ద వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఆ కెమెరాలను కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు అనుసంధానం చేసి ఎక్కడేం జరుగుతుందో తక్షణం తెలుసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఉచిత ఇసుక పథకాన్ని నీరుగార్చే వారిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్లను సైతం ప్రకటించారు. నిరంతర నిఘా కోసం కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశారు. ఒక వైపు కలెక్టర్ విజయమోహన్, మరోవైపు ఎస్పీ ఆకే రవికృష్ణ ఇసుక పథకంపై ప్రత్యేక దృష్టి సారించి ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తున్నారు. ఉచిత ఇసుక రవాణాకు ఆటంకం కలిగితే తమ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు ఉంటే ఆ అధికారులను, సిబ్బందిని బదిలీ చేయడానికి వెనుకాడటం లేదు. దాంతో ఉచిత ఇసుక విధానంపై మండల స్థాయి అధికారులు, సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
వెల్దుర్తి అధికారులను పరుగులు పెట్టించిన ఫోన్‌కాల్
వెల్దుర్తి మండల పరిధిలోని హంద్రీనది నుంచి ఇసుకను అక్రమార్కులు తరలిస్తున్నారన్న ఫిర్యాదుతో వెల్దుర్తి మండల అధికారులు శుక్రవారం రాత్రి పరుగులు తీసినట్లు తెలిసింది. ఓ వ్యక్తి తాను చెరుకులపాడు సర్పంచ్‌నని అక్రమార్కులు ఇసుకను భారీఎత్తున అక్రమంగా రవాణా చేస్తున్నారని ఫోన్ ద్వారా మీడియా, పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రాత్రికి, రాత్రి అన్ని రహదారుల్లో తనిఖీ చేశారని సమాచారం. అయితే ఇసుక రవాణా జరగలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఒక్క ఫోన్ కాల్ అధికారులను పరుగులు పెట్టించడం విశేషం. మొత్తం మీద ఉచిత ఇసుక పథకం ప్రజలకు ఎంత వరకూ లబ్ధి చేకూరుస్తుందో కాని అధికారులకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని చర్చించుకుంటున్నారు.