కర్నూల్

మళ్లీ మొండిచెయ్యి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, డిసెంబర్ 2: ఆదోని నియోజకవర్గంలో ఉన్న ఇద్దరు కీలకమైన నేతలకు అధికార పదవులు దక్కలేదు. అధికార పదవులు దక్కకపోవడంతో నేతల ఆశలపైన నీళ్ళు చల్లినట్లు అయింది. కార్యకర్తలు కూడా పెదవి విరుస్తున్నారు. ఆదోని నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మీనాక్షినాయుడు గెలిచాడు. అయితే 18 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీనాక్షినాయుడు ఓడిపోయాడు. అయినప్పటికి నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైన వారందందరూ ఇన్‌ఛార్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పదవుల నియామకంలో మీనాక్షినాయుడు సీనియార్టి రీత్యా ముందు వరసలో ఉన్నారు. అందువల్ల ఆయనకు మొట్ట మొదట ఎమ్మెల్సీ దక్కుతుందని కొంత వరకు ప్రచారం జరిగింది. స్థానిక నేతలు, కార్యకర్తలు కూడా తమ నేతకు ఎమ్మెల్సీ దక్కుతుందని, మళ్ళీ తమ నియోజకవర్గానికి పూర్వ వైభవం వస్తుందని ఆశించారు. అయితే ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. ఆ తరువాత రాష్ట్ర కమిటీ పదవులను కూడా పార్టీ నేతలు నియమించారు. రాష్ట్ర కమిటీ పదవుల్లో కూడా మీనాక్షినాయుడు, కిష్టమ్మకు ఎలాంటి పదవులు దక్కలేదు. ఆతరువాత కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో మీనాక్షినాయుడుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కుతుందని అంతా ఆశించారు. అయితే మంగళవారం ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో కూడా ఆయనకు పదవి దక్కకపోవడంతో పార్టీ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. మొదటి నుంచి ఆదోని నియోజకవర్గంలో మీనాక్షినాయుడు ప్రధాన కేంద్ర బిందువుగా ఉండి పార్టీ కోసం పని చేశారు. అయినప్పటికీ ప్రస్తుతం అధికారం వచ్చిన తరువాత ఆయనకు రాష్ట్ర పార్టీ పదవుల్లోకాని, కార్పొరేషన్ల చైర్మన్ల పదవులుగాని ఇప్పటి వరకు ఎలాంటి పదవులు దక్కలేదు. దీనిపై పార్టీలో కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిష్టమ్మ 10 సంవత్సరాల క్రితం ఆదోని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఆ రోజుల్లో ఆమెను వెంటనే రాష్ట్ర తెలుగు మహిళ కార్యదర్శిగా నియమించారు. ఆతరువాత కిష్టమ్మను పార్టీ ఎలాంటి పదవుల్లో నియమించలేదు. అయినప్పటికీ కిష్టమ్మ తెలుగుదేశంలోనే ఎలాంటి పదవులు లేకుండా కొనసాగుతుంది. గత ఎన్నికల్లో వారి కుటుంబం నుంచి మండిగిరి ఎంపిటిసి స్థానానికి పోటీ చేసి ఆమె కుటుంబ సభ్యురాలు గెలవడం జరిగింది. అంతకుమించి కిష్టమ్మకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి పదవులను ఇవ్వకపోవడంపై ఆమె ఆనుయాయులు కొంత అసంతృప్తితో ఉన్నారు. తాము ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనప్పటికి తమ నాయకురాలు పార్టీ కోసం పని చేసినా ఎలాంటి పదవులు ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కూడా కిష్టమ్మ, ఆమె తండ్రి రామలింగప్ప, సోదరుడు శ్రీరాములు చురుకుగా పాల్గొంటున్నారు. పార్టీలో పదవులుగాని లేదా ఇతర సంస్థలు పదవులుగాని ఇవ్వకపోవడం అసంతృప్తి మాత్రం ఉంది. ముఖ్యంగా ఆదోని నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమైన నేతలకు పదవులు ఇచ్చి ఈ ప్రాంతంలో పార్టీ అభివృద్ధి చేసి పార్టీకి పూర్వవైభవం తీసుకొని రావాల్సిన అవసరం ఎంది. అందుకు రాష్ట్ర నేతలు కూడా సహకరించాలి. అందువల్ల మీనాక్షినాయుడుకు, కిష్టమ్మకు పదవులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పప్పు ధాన్యాల సాగుపై రైతుల ఆసక్తి..

ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, డిసెంబర్ 2: వర్షాభావ పరిస్థితుల్లో రబీలో వేసే వరి పంట పూర్తిగా తగ్గిపోగా పప్పు ధాన్యాల సాగుకు రైతులు మక్కువ చూపుతున్నారు. పప్పు ధాన్యాల్లో మినుము, పెసర పంటకు కర్షకులు పెద్ద పీట వేశారు. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌లో 3.70లక్షల హెక్టార్లలో పంట సాగు కావాల్సి ఉండగా వరుణుడి కరుణ కరువవడంతో ఈ ఏడాది 2.35లక్షల హెక్టార్ల సాగుకే పరిమితమైంది. గత ఏడాది రబీ సీజన్‌తో పోలిస్తే పంట సాగు ఎక్కువే అయినా సగటు సాగు విస్తీర్ణంలో 63.52శాతం మాత్రమే పంటలు సాగయ్యాయి. రైతులు సాగు చేస్తున్న పంటల్లో మినుము సాధారణ సాగు విస్తీర్ణం 7,720 హెక్టార్లు కాగా ఈ ఏడాది 13,813హెక్టార్లలో సాగవుతోంది. గత ఏడాది సుమారు ఆరు వేల హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. సగటు సాగు విస్తీర్ణం కన్నా ఈ ఏడాది 178శాతం అధికంగా మినుము పంట సాగులో ఉండటం విశేషం. ఆ తరువాత పెసర పంట 171శాతం అధికంగా రైతులు పండిస్తున్నారు. సగటు సాగు విస్తీర్ణం 1316హెక్టార్లకు గాను ఈ ఏడాది పెసర పంట 2,258హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌తో పోలిస్తే కంది పంట రబీ సీజన్ తక్కువ విస్తీర్ణంలో సాగయ్యేది. అయితే కంది పప్పు ధర మండిపోతుండటంతో రైతు ఆ పంట సాగుకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. రబీలో కంది పంట సగటు సాగు విస్తీర్ణం 911హెక్టార్లే కాగా ఈ ఏడాది 1040హెక్టార్లలో సాగు చేశారు. గత ఏడాది రబీ సీజన్‌లో కేవలం 65హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. కాగా రబీ సీజన్‌లో అత్యధికంగా సాగు చేసే శనగ పంటపై రైతులు ఈ ఏడాది అంతగా ఆసక్తి కనపర్చ లేదు. రబీలో శనగ పంట సగటు విస్తీర్ణం 1.96లక్షల హెక్టార్లుగా ఈ ఏడాది 81శాతం విస్తీర్ణంలో సుమారు 1,58.860హెక్టార్లలో సాగులో ఉంది. గత ఏడాది రబీలో సైతం 1.12లక్షల హెక్టార్లలో పంట వేసినట్లు వ్యవసాయ శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. జొన్న సగటు విస్తీర్ణం 58,252హెక్టార్లకు గాను 67.29శాతం 39,197హెక్టార్లలో రైతులు పండిస్తున్నారు. రబీలో వరి పంట సగటు సాగు విస్తీర్ణం 24వేల హెక్టార్లు కాగా ఈ ఏడాది కేవలం 1.67శాతం అంటే 450హెక్టార్లలో మాత్రమే వరి సాగవుతోంది. గత ఏడాది కూడా ఇదే స్థాయిలో వరిని రైతులు సాగు చేశారు. పొద్దు తిరుగుడు పంటపై కూడా రైతులు పూర్తిగా అనాసక్తి ప్రదర్శించారు. ఈ పంట సగటు సాగు విస్తీర్ణం 24,331హెక్టార్లు కాగా ప్రస్తుతం 1742హెక్టార్లు మాత్రమే పంట సాగులో ఉంది. రబీ సీజన్‌లో రైతులు పంట సాగుకు ఆసక్తి కనపర్చకపోవడంతో భారీ ఎత్తున భూమి బీడుగా మారిన పరిస్థితి నెలకొని ఉంది.
ఈశాన్యంలోనూ వర్షం కరువే..
నైరుతి రుతు పవనాలు రైతులను ఇబ్బందులు పెట్టగా అదే దారిలో ఈశాన్య రుతు పవనాలు సైతం సహకరించ లేదు. నైరుతి రుతుపవనాల సీజన్ అయిన జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 455.10మి.మీ. వర్షపాతానికి గాను 26శాతం తక్కువగా 338.20మి.మీ. వర్షం కురిసింది. గత ఏడాది కంటే పరిస్థితి దారుణంగా నైరుతి రుతు పవనాల ప్రభావం ఉండింది. ప్రస్తుత ఈశాన్య రుతు పవనాలు కూడా కర్షకులకు తగిన సహాయాన్ని అందించలేకపోయాయి. ఈశాన్య రుతు పవనాలు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటాయి. గడిచిన రెండు నెలల్లో 142మి.మీ. సగటు వర్షపాతానికి గాను 68.90మి.మీ. వర్షం మాత్రమే కురిసింది. గత ఏడాది నైరుతిలో 110మి.మీ. వర్షపాతం నమోదైంది. వరుణుడి కరుణ లేకపోవడంతో రబీలోనూ కరవు పరిస్థితులు నెలకొని ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై తగిన నివేదికలను ప్రభుత్వానికి పంపి సహాయం చేయాలని కోరడానికి సిద్ధపడుతున్నారు.

జిల్లాకు లక్ష మరుగుదొడ్లు మంజూరు

మహానంది, డిసెంబర్ 2: జిల్లాకు లక్ష మరుగుదొడ్లు మంజూరు అయినట్లు జెడ్పి సిఇఓ ఈశ్వర్ తెలిపారు. బుధవారం ఆయన మహానంది పుణ్యక్షేత్రంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. క్షేత్రానికి వచ్చిన వీరికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలుకగా, వారు శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్లకు అభిషేకార్చన పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించగా అధికారులు శేష వస్త్రంలో సత్కరించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మీ కోసం కార్యక్రమం ద్వారా జిల్లాలో 45 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో 50 శాతం పూర్తి చేశామన్నారు. ప్రతి ఏడాది మండలంలో మూడు గ్రామాలను ఎంచుకొని వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం చేస్తున్నామన్నారు. మహానంది మండలంలో ఈ ఏడాది సీతారామాపురం, నందిపల్లె, బొల్లవరం గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. జడ్పీలో నిధుల కొరత ఉందన్నారు. ఇసుక క్వారీ ద్వారా రూ.2 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈ నిధులను మండల పరిషత్‌కు, గ్రామ పంచాయతీలకు వాడడం జరుగుతుందన్నారు. సిపిడబ్ల్యుఎస్ ద్వారా 52 చోట్ల నీటి సరఫరా ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ తాగునీరు, పారిశుద్ధ్యంపై మక్కువ చూపుతున్నారని, వీటిలో వంద శాతం ఫలితాలు సాధిస్తున్నామన్నారు. ప్రజలకు బోర్లు వేసి తాగునీరు అందించడం జరిగిందన్నారు. వీరి వెంట ఎంపిడిఓ నరసింహులు, పంచాయతీ రాజ్ ఎఇ మన్మదబాబు, సర్పంచ్ జయసింహారెడ్డి, పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, విఆర్‌ఓ కృష్ణనాయక్, విఎఓ నాగసంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

స్పీకర్ దృష్టికి బుడగజంగాల సమస్యలు

నందికొట్కూరు, డిసెంబర్ 2 : బుడగజంగాల కులస్థులకు అడ్డంకిగా మారిన 144 జిఓను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర బుడగజంగం సంఘం అధ్యక్షుడు ఎలమర్తి మధు స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను కోరినట్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుడగజంగాల అభివృద్ధికి 144 జిఓ నిరోధకంగా మారిందని, ఈ జిఓ వల్ల బుడగజంగాల పిల్లలు విద్యకు దూరం అవుతున్నారన్నారు. ఈ జిఓ పై కమిషన్ వేస్తామని రాష్ట్ర మంత్రి రావెల కిశోర్‌బాబు హామీ ఇచ్చినా ఇంత వరకు కమిషన్ వేయని విషయం స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈనెల 17 నుంచి జరుగబోయే అసెంబ్లీ సమావేశాల్లో తమకు న్యాయం చేయాలని స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను కోరామన్నారు. సమావేశంలో బుడగజంగాల తాలుకా అధ్యక్షుడు శిరిగిరి గోవిందు, నాయకులు లింగప్ప, శ్రీనివాసులు, మురళి, జమ్మన్న, లక్ష్మన్న, తదితరులు పాల్గొన్నారు.

రైతులకు టిడిపి అండగా వుంటుంది - ఎమ్మెల్యే బిసి

కోవెలకుంట్ల, డిసెంబర్ 2: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడు అండగా వుంటుందని బనగానపల్లె ఎమ్మెల్యే బిసి.జనార్థనరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అమడాల, సౌదరదినె్న, బిజినవేముల, వల్లంపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే బిసి.జనార్థనరెడ్డి జనచైతన్యయత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రైతుల కొరకు పాటుపడుతోందని, రుణమాఫీ కుదరదని ప్రతిపక్షాలు చేతులెత్తేసినా అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేసి చూపించామన్నారు. అలాగే ఇటీవల వర్షాభావంతో నీరులేక రైతులు ఇబ్బందుకు గురౌతున్నట్లు తన దృష్టికి వచ్చిన వెంటనే ఎస్సార్బీసి, కుందూలకు నీరు విడుదల చేయించి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పూడూ ప్రాధాన్యమిస్తున్నానన్నారు. ఎరవులు ఇబ్బందులు లేకుండా సొసైటీల ద్వారా అందించామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో అప్పటి పాలకులు వేలకోట్లు దండుకుంటే మా నాయకుడు ప్రాజెక్టుల వెంట తిరుగుతూ వాటి ద్వారా ప్రజలకు తాగు, సాగు నీరును అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు.
అర్హులైన ప్రతి పేదవానికి పార్టీ బేధాలు లేకుండా పెన్షన్లు అందిస్తామన్నారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అమడాల గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, సౌదరదినె్న గ్రామంలో మంచినీటి పథకాన్ని, బిజినవేములలో నూతనంగా నిర్మించిన సి.సి రహదారిని ప్రారంభించారు. అమడాలలో నెలకొన్న రహదారి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో కోవెలకుంట్ల మార్కెట్‌యార్డు ఛైర్మన్ గడ్డం నాగేశ్వరరెడ్డి, ఎంపిపి చెన్నక్రిష్ణమ్మ, టిడిపి నాయకులు బి.వి.ప్రసాదరెడ్డి, గడ్డం రామక్రిష్ణారెడ్డి, గడ్డం అమర్‌నాధ్‌రెడ్డి, సుంకిరెడ్డి, కలుగొట్ల రామేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి, మల్లునాగిరెడ్డి, నరసింహారెడ్డి, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

ప్రజల కోసం అహర్నిశలు పాటుపడుతున్న చంద్రబాబు

ఆళ్లగడ్డ, డిసెంబర్ 2: టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ప్రజా సమస్యల కోసం అహర్నిశలు పాటుతున్నారని టిడిపి ఇంచార్జి గంగుల ప్రభాకరరెడ్డి అన్నారు. జనచైతన్య యాత్రలో భాగంగా బుధవారం రాత్రి నగరపంచాయతీ పరిధిలోని పడకండ్లలో ఆయన ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తూ గోదావరి నుండి కృష్ణాకు నీళ్లు మళ్లించడం వల్ల అక్కడి నీరు అక్కడే వారు వాడుకోవడంతో శ్రీశైలం డ్యాం నుండి ఆరున్నర టిఎసిల అలాగే పత్తికొండ, అనంతపురం జిల్లాకు 8.5 టిఎంసిల నీటిని వాడుకోవడానికి అవకాశం వచ్చిందన్నారు. పడకండ్ల గ్రామంలో మన భూమి మన ఇంటికి 78 దరఖాస్తులు రాగా వాటిలో 58 పరిష్కారం అయ్యాయన్నారు. రైతులకు రుణమాఫీపై ఇచ్చిన వాగ్ధానం నెరవేర్చారన్నారు. డ్వాక్రా మహిళలకు గ్రూపుకు 3 వేల చొప్పున రూ. 12 వేల కోట్లు మంజూరు చేశారన్నారు. రేషన్‌కార్డులు లేని వారికి జనవరి నాటికల్లా దరఖాస్తులు చేసుకుంటే కార్డులు ఇప్పిస్తామన్నారు. రేషన్‌కార్డులు లేనందునే కొందరికి పింఛన్లు సమస్య ఏర్పడిందన్నారు. పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. రూ. 2 వేలు కడితే రెండు మాసాల్లో గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తామన్నారు. నగర పంచాయతీ వారు పడకండ్ల, చింతకుంట్ల, ఆళ్లగడ్డలో పన్నులు వసూలు చేస్తున్నారు కానీ, పనులు మాత్రం ఆళ్లగడ్డకే పరిమితమయ్యాయని, పడకండ్లకు, చింతకుంట్లకు కూడా పనులు జరిగేటట్లు చూస్తామన్నారు. 24 గంటలు విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. అహోబిలం నుండి మంచి నీటిని అధికారులతో మాట్లాడి చింతకుంట వరకు నీళ్లు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కెసి కెనాల్ నుండి వకుళానదికి నీరు విడుదల చేయించామన్నారు. చింతకుంట్ల, ఆళ్లగడ్డ పట్టణంలోని కొత్త మసీదు వద్ద జనచైతన్య యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు గంగుల బ్రిజేంద్రారెడ్డి, ఎంపిపి బండి చంద్రుడు, పలుచాని బాలిరెడ్డి, బాబాలాల్, గంధం రాఘవరెడ్డి, బద్రి సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి

మిడుతూరు, డిసెంబర్ 2 : తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నందికొట్కూరు మార్కెట్‌యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి, పిఎసిఎస్ అధ్యక్షుడు కాతా రమేష్‌రెడ్డిలు ప్రజలకు సూచించారు. బుధవారం మిడుతూరు మండలంలోని తిమ్మాపురం, పైపాలెం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు జనచైతన్యయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేనన్ని పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టాడని, రాజకీయాలకతీతంగా వాటిని ప్రతి ఒక్క అర్హుడు పొందాలని కోరారు. నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్ మాండ్ర శివానందరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలను గ్రామాల్లో నాయకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శివరామిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నగరాన్ని అభివృద్ధి చేసింది నేనే..!

కర్నూలు సిటీ, డిసెంబర్ 2: కర్నూలు నగరాన్ని కుల మతాలకు అతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని మాజీ మంత్రి టిజీ వెంకటేష్ పేర్కొన్నారు. బుధవారం నగరంలో 5,6, 16 వార్డుల్లో నిర్వహించిన జన చైతన్య యాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నగరంలో ముస్లింలు అధికంగా ఉన్నారని కర్నూలులో ఉర్దూ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని గత 12 సంవత్సరాలుగా తాను చేసిన పోరాటం ఫలితం గానే ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో మంజూరు అయ్యిందన్నారు. నగర ప్రజలకు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే తన పరిశ్రమను బంద్ చేసి స్వంత ట్రాక్టర్ల ద్వార నీటిని అందించానని వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సమ్మర్ స్టోరేజి ట్యాంక్ నిర్మించి ప్రతి రోజు నీళ్లు అందించి ప్రజల దాహార్తిని తీర్చానన్నారు. అలాగే దేశంలో ఎక్కడ లేని విధంగా నగరంలో మినరల్ వాటర్ ప్లాంట్లను ఉచితంగా ఏర్పాటు చేసి నగర ప్రజలకు శుద్ధ జలాన్ని అందించానని ధీమాను వ్యక్తం చేశారు. నగరంలో హౌజ్ హౌస్ నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించి నిధులు మంజూరు చేయించానని వివరించారు. నగరం మరింత అభివృద్ధి చెందేందుకు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ని గెలిపించు కోవల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఈ జన చైతన్య యాత్రల్లో భాగంగా టిడిపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి వాటని నిజమైన లబ్ధిదారులకు అందించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేసి పార్టీపట్ల నమ్మకాన్ని పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణ సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిరుపాల్ బాబు, కూసుపాటి శ్యాం, అబ్బాస్, పర్వేజ్, శేషగిరి శెట్టి, మాలిక్, అంజాద్ ఖాన్, ఇర్పాన్, షరీప్, షుకూర్ తదితరులు పాల్గొన్నారు.

బలహీనవర్గాల అభ్యున్నతే టిడిపి ధ్యేయం

నందవరం, డిసెంబర్ 2: బడులు బలహీన వర్గాల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలో భాగంగా బుధవారం మండలపరిధిలోని జగ్గాపురం, బాపురం, ధర్మాపురం, ముగతి, హాలహర్వి గ్రామాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనులను సమీక్షించారు. గ్రామాల్లో డ్రైనేజీ, సిసి రోడ్లు, పింఛన్లు, తదితర అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులపై ప్రజలకు వివరించారు. గ్రామాల్లో మరోసారి పర్యటించే సమయానికి జరుగుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులకు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకుప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో మండల ఎంపిపి చిన్న నరసింహారెడ్డి, మండల ఉపాధ్యక్షులు రఘుస్వామి, ఎల్లెల్సీ డిస్ట్రిబ్యూటర్ డైరెక్టర్ గడ్డం నారాయణరెడ్డి, మండల తెలుగుదేశం నాయకులు నాగరాజుగౌడ్, ముగతి ఈరన్నగౌడ్, గడ్డం బజారి, చిన్న రాముడు, దావీద్, కిష్టప్ప, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూములను నిరుపేదలకు పంచాలి
కర్నూలు ఓల్డ్‌సిటీ, డిసెంబర్ 2: జిల్లాలోని మద్దికేర మండలం బొమ్మన పల్లిలోని 192 ఎకరాల ప్రభుత్వ మిగులు భూమిని భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేయాలని సిపిఐ కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపియం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు, ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జగన్నాథంలు మాట్లాడుతూ బొమ్మన పల్లి గ్రామంలో మిగులు భూములను భూమి లేని నిరుపేదలు ఆక్రమించుకొని అనుభవిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం తాలుకా కార్యదర్శి మద్దికేర నేట్టెకంటయ్య, సిపిఐ మద్దికేర మండల కార్యదర్శి హనుమప్ప, మండల సహాయ కార్యదర్శి కోదండలు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల వేతనాల బిల్లులు సకాలంలో పంపాలి
కర్నూలు సిటీ, డిసెంబర్ 2: నగర పాలక సంస్థలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాల బిల్లులను సకాలంలో ట్రెజరీకి పంపాలని ఎపి మున్సిపల్ హెల్త్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పులగం మద్దిలేటి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. పర్మినెంట్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెల 1న వేతనాలు చెల్లించాలని జీవో నెం.300 ఉన్నప్పుటికి అమలు చేయటం లేదని విమర్శించారు. గతంలో నెల నెల వేతనాలు అందక ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడటమే కాకుండ కొంత మంది పారిశుద్ధ్య కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ప్రతి నెల 1న ట్రెజరీ ద్వార వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం నాయకులు దేవసహాయం, రాజేశ్వరావు, బాబులాల్, నాగన్న, బాలరాజ్, భాస్కర్, శ్రీనివాసులు, శ్యాంబాబు, మధు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ గృహ నిర్మాణాల రుణం పెంచాలి

కర్నూలు ఓల్డ్‌సిటీ, డిసెంబర్ 2: మూడవ విడత ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు రుణం పెంచాలని కోరు తూ సిపిఎం కల్లూరు జోన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక బిర్లాగేట్ వద్ద ఉన్న సంక్షేమ భవనం ఎదు ట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జోన్ కమిటీ నాయకు లు సుధాకరప్ప, సాయిబాబాలు మా ట్లాడుతూ 2008-9 సంవత్సరంలో 3వ విడత ఇందిరమ్మ ఇళ్ళ పేరురతో పది వేల మందిని గుర్తించి జిరాక్స్ పట్టాలు మంజూరు చేశారని, ఇంత వరకు ఇంటి నిర్మాణాలు నత్తనడకన నడుస్తున్నాయని, బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదని అన్నారు. పేదోడి సొంతింటి కళ నేరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వారు ఆరోపించారు. గత ఏడాది మార్చి నుండి బిల్లులు మంజూరు కావడం లేదని, టిడిపి సర్కార్ ఇందిరమ్మ గృహాల ఊసే ఎత్తడం లేదని తెలిపారు పందిపాడు వద్ద 369 గృహాలు మాత్రమే నిర్మాణంలో ఉన్నాయని వాటి నిర్మాణానికి లబ్ధిదారుడు లక్ష రూపాయాలు అప్పు చేసి నిర్మించుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభు త్వం ఇచ్చే లక్ష రూపాయలు బేస్ మట్టం వరకే సరిపోవడం లేదని, అదనంగా రూ.3 నుండి రూ.4లక్షల వర కు ఖర్చు అవుతుందని ప్రభుత్వం రు ణం రూ.5లక్షలకు పెంచాలని వారు డి మాండ్ చేశారు. ధర్నా వద్దకు హౌసిం గ్ పిడి, డిఇలు వచ్చి బిల్లులు మంజూ రు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు అయ్యస్వామి, ఆజాద్, దేవేంద్ర, నాగేశ్వరరాజు, ఆటో యూనియన్ నాయకులు రాధాక్రిష్ణ, ప్రభాకర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.