కర్నూల్

నారా లోకేష్ నాయకత్వం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోనిటౌన్, ఏప్రిల్ 8:రాష్ట్ర అభివృద్ధికి పరోక్షంగా ఎంతగానో కృషి చేస్తున్న నారా లోకేష్‌ను మంత్రి వర్గంలో తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ గత ఎన్నో ఏళ్ళుగా పార్టీకి నారాలోకేష్ అనేక సలహాలు ఇవ్వడమే కాకుండా పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేసి అలాగే కార్యకర్తల పిల్లల చదువుల కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారని అన్నారు. రాష్ట్రానికి యువ నాయకత్వం ఎంతో అవసరమని అందువల్ల నారా లోకేష్ మంత్రి వర్గంలో చోటు కల్పించి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈవిషయంపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. నారాలోకేష్‌కు మంత్రి పదవి ఇస్తే అటూ పార్టీలోను ఇటు ప్రభుత్వంలోను కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.