కర్నూల్

పాలమూరు, దిండి ప్రాజెక్టులు చేపడితే ఏపి ఎడారే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఏప్రిల్ 11 : కెసిఆర్ ప్రభుత్వం కృష్ణా నదిపై అక్రమంగా నిర్మించబోతున్న పాలమూరు, దిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతుందని పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, 20 సూత్రాల మాజీ చైర్మన్ తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ రోమ్ నగరం తగలబడి పోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్నట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలి అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరుగని అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు నిమ్మకునీరెత్తినట్లుగా ఉన్నారని విమర్శించారు. అలాగే ఓటుకు నోటు కేసు నుంచి వ్యిక్తిగతంగా బయటపడేందుకు చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వద్ద తాకట్టు పెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. పట్టిసీమను మొదట్లో వ్యతిరేకించిన కెసిఆర్ ఇప్పుడు సమర్థించటం ఏంటని, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టుల వల్ల కృష్ణానదిలో నీళ్లు లేవంటూనే కెసిఆర్ ప్రభుత్వం కృష్ణా నదిపై అక్రమ ప్రాజెక్టులను నిర్మించే ప్రయత్నం చేస్తుండటం చూస్తుంటే చంద్రబాబు, కెసిఆర్ మధ్య రహస్య ఒప్పందం ఉన్నట్లు రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందని వివరించారు. ముఖ్యంగా పాలమూరు ప్రాజెక్టు వల్ల శ్రీశైలం రిజర్వాయర్ ఫోర్‌షోర్ నుంచి రోజుకు 1.50 టిఎంసిల చొప్పున 60 రోజుల్లో 90 టిఎంసిల కృష్ణా వరద జలాలను ఎత్తిపోసే పథకమన్నారు. దిండి ఎత్తిపోతల పథకం కూడా ఇదే మాదిరిగా ఉంటుందని, ఈ రెండు ప్రాజెక్టుల వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని పాలమూరు, దిండి ప్రాజెక్టులను వ్యతిరేకించాలని లేనిపక్షంలో రాయలసీమతో పాటు అనేక ప్రాంతాలు నష్టపోవాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాల వల్ల ప్రజలు ఏవిధమైనటువంటి ఇబ్బందులు పడేవారు కాదని, టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తూ ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకుందన్నారు. ప్రజలు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వానే్న కోరుకుంటున్నారని, కావున ప్రతి కార్యకర్త ప్రజలకు అండగా నిలిచి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ సెల్ చైర్మన్ రవిచంద్రారెడ్డి, శివకుమార్, సత్యరాజ్, పెద్దారెడ్డి, శ్రీనివాసరెడ్డి, తిప్పన్న, తదితరులు పాల్గొన్నారు.