కర్నూల్

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 11:జిల్లాలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని, వారి పిఎఫ్ ఖాతాల్లో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఆకే రవికృష్ణ కంపెనీ ఏజెన్సీలను హెచ్చరించారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అగ్రిమెంటు నియమ నిబంధనలు పాటించాలన్నారు. జిల్లాలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగల పిఎఫ్ ఖాతాల్లో అవకతవకలకు పాల్పడే కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలోగా పిఎఫ్ ఖాతాల్లోని అవకతవకలను సరి చేయాలని లేనిపక్షంలో ఆయా కంపెనీల ఏజెన్సీలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ తెలిపారు. ప్రతి నెల పిఎఫ్ ఖాతాల్లో జమ చేసిన నగదును ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సెల్‌ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందజేయాలని కంపెనీ ఏజెన్సీలకు సూచించారు. సమావేశంలో ఏఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, బాబుప్రసాద్, జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలన అధికారి అబ్దుల్‌సలాం, ఆర్‌ఐ రంగముని, ఆర్‌ఎస్‌ఐ రాధాకృష్ణమూర్తి, ఏఆర్ ఏఎస్‌ఐ దేవదానం, డిపిఓ సిబ్బంది మదర్‌థెరిస్సా, చరిత, లోటస్, ఓంకారేశ్వర, జానసాధికర ఏజెన్సీల యాజమానులు, ఉద్యోగులు పాల్గొన్నారు.