కర్నూల్

దళితుల అభివృద్ధికి రూ. 1,090 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 25: దళితుల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా పని చేస్తున్న ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో వారి కోసం రూ. 1,090 కోట్లను కేటాయించిందని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు చెప్పారు. సోమవారం కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిధిగృహంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రణాళికలతో దళితుల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. దళితులు, మహిళల సాధికారత కోసం ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం మార్గదర్శకాలు రూపొందించి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. పథకాల అమలులో ఏ స్థాయిలో అవకతవకలు జరిగినా ఊరుకునేదిలేదని హెచ్చరించారు. నాలుగు నెలల క్రితం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి, రాష్ట్రం మొత్తం తిరిగి ఎస్సీల స్థితిగతులపై అవగాహన పెంపొందించుకున్నానన్నారు. గతంలో ఎస్సీ లబ్ధిదారులకు రుణాల మంజూరు అనుకున్న మేర చేయలేకపోయారన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ విధంగా కాకుండా లబ్ధిదారులకు రుణాలు, సబ్సిడీలు పూర్తి స్థాయిలో అందేలా చూస్తామన్నారు. దళితుల కోసం కేటాయించిన నిధులు వారికే ఖర్చు పెట్టాలన్నారు. కర్నూలు జిల్లాలో దళితులకు నిధులను ఖర్చు చేయటలో అలసత్వం చూపిస్తున్నారని, ఇకపై అలా జరగకుండా చూస్తామన్నారు. రెండు నెలలకొకసారి లక్ష్యాలు నిర్ణయించి లక్ష్యసాధనకు కృషి చేస్తామని, అవసరమైతే ఉద్యోగులకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందాలని, ఆ దిశగా అందరిలో చైతన్యం కలిగిస్తామన్నారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 15 ఎకరాల్లో నిర్మించి, స్టడీ సెంటర్‌వంటి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. సమావేశంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రభాకర్ పాల్గొన్నారు.