కర్నూల్

అక్రమ ప్రాజెక్టులపై సర్కారు ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 2 : కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రానికి ఎగువన తెలంగాణలో నిర్మించే పాలమూరు, దిండి ప్రాజెక్టులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌కు జరిగే నష్టంపై సోమవారం జరిగిన మంత్రివర్గంలో చర్చించారు. తెలంగాణ ఎవరి మాట వినకుండా అక్రమ పద్ధతుల్లో నిర్మించే ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. దీంతో ఈ రెండు ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నిర్మాణాలను తక్షణం అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని, సరైన స్పందన రాని పక్షంలో సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసి న్యాయ పోరాటం చేయాలని తీర్మానించారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో నిర్మించే పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 1.5 టిఎంసిల చొప్పున 60 రోజులు నీటిని తరలించే పథకానికి తెలంగాణ సర్కార్ పనులు ప్రారంభించింది. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 817 అడుగులకు నీరు చేరుకోగానే ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు ప్రాజెక్టు రూపకల్పన చేశారు. నల్గొండ జిల్లా దిండి వద్ద నిర్మించతలపెట్టిన ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 817.5 అడుగులకు చేరుకోగానే రోజుకు 0.5 టిఎంసిల నీటిని 60రోజులు తోడుకునే విధంగా రూపకల్పన చేశారు. వీటి కారణంగా దిగువన ఉన్న శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పెరుగుదలలో తీవ్ర జాప్యం జరుగుతుంది. శ్రీశైలం నుంచి నీటి మట్టం 831 అడుగులకు చేరుకున్న తరువాతే హంద్రీ నీవా ప్రాజెక్టును ఉపయోగంలోకి తీసుకురావాల్సి ఉంది. పోతిరెడ్డిపాడు గేట్లు తెరుచుకోవాలంటే 841 అడుగులకు చేరుకున్న తరువాతే సాధ్యపడుతుంది. ఇక దిగువన నాగార్జున సాగర్‌కు నీరు విడుదల చేయాలంటే 834 అడుగులకు చేరుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా దిగువ ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ఉంటేనే నీరు విడుదల చేస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులు వరద జలాలపై ఆధారపడి నిర్మిస్తున్నవేనని చెబుతున్నా ఆ నీటిని వాడుకునే హక్కు, స్వేచ్ఛ తెలంగాణ ప్రభుత్వానికి లేవని సాగునీటి రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఏ నదిలోనైనా వరద జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ నది ప్రవహించే చివరి రాష్ట్రానికి మాత్రమే ఉంటుందని వారంటున్నారు. వరద నీటిని ఎవరు వినియోగించుకున్నా కేవలం స్వేచ్ఛ మాత్రమేనని హక్కు ఎట్టి పరిస్థితుల్లో ఉండదని గతంలో పలు న్యాయ స్థానాలు తీర్పునిచ్చాయని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులు పూర్తయితే హంద్రీ-నీవా కింద 6 లక్షలు, గాలేరు-నగరి కింద 2.6 లక్షలు, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బిసి ప్రాజెక్టుల కింద సుమారు 5.65 లక్షలు, వెలిగొండ ప్రాజెక్టు కింద 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. అంతేగాకుండా దిగువన నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని జల వనరుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ చేపట్టే ప్రాజెక్టులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కోర్టుల్లో న్యాయం జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం రాసే లేఖను పరిగణలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకుని రంగంలోకి దిగితే ప్రాజెక్టుల నిర్మాణం ఆపేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించే అవకాశం లేకపోలేదని వారంటున్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్న తెలంగాణ వ్యవహార శైలిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలకు సిద్ధపడటంతో తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావంతో వారున్నారు.
విజిలెన్స్ దాడులు
* రూ. 15 లక్షల జరిమానా
నంద్యాలరూరల్, మే 2:నంద్యాల మండలంలోని అయ్యలూరు, ఊడుమాల్పురం, నూనెపల్లె, మూలసాగరం గ్రామాలలో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చిన యజమానులపై విజిలెన్స్ అధికారులు గత మూడు నెలల క్రితం దాడులు చేశారు. 191/1 సర్వే నెంబరు 136, 84లో మొత్తం 36మంది యజమానులు వ్యవసాయ భూమిని సాగుభూమిగా మార్చినందుకు విజిలెన్స్ అధికారులు దాడులు చేసి 50శాతం ప్రభుత్వానికి జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. విజిలెన్స్ అధికారుల ఉత్తర్వుల మేరకు సోమవారం 36మంది యజమానులు రూ. 54వేలు చెల్లించినట్లు తహశీల్దార్ శివరామిరెడ్డి తెలిపారు. ఈసందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో 136లో రూ. 1.53కోట్లు, 84లో రూ. 54 లక్షలు 36మంది యజమానులకు జరిమానా విధించారు. వీటిలో ఇంతవరకు రూ. 15లక్షలు వసూలు చేసినట్లు తహశీల్దార్ తెలిపారు. మిగతా జరిమానాను కూడా త్వరగా చెల్లించాలని వారిని ఆదేశించారు. అందరికీ నోటీసులు ఇచ్చామని వివరించారు. ఎపి వాల్టా యాక్టు కింద అనుమతులు లేకుండా అక్రమంగా లే అవుట్లు వేసినా, బోర్లు వేసినా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కానాల గ్రామంలో చెట్లు నరికేశారని, వీటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈయన వెంట డిటి శ్రీనివాసులు పాల్గొన్నారు.
అహోబిలంలో వైభవంగా కల్యాణం
ఆళ్లగడ్డ, మే 2:ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబింలో సోమవారం శ్రీ ప్రహ్లాదవరదస్వామి, గోదాదేవి అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తులు ప్రహ్లాదవరదస్వామి, గోదాదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి కొలువు మండపంలో ఆశీనులను చేసి ఆలయ ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్ అర్చక బృందం సంతానం, కళ్యాణరంగన్, రాఘవయ్యలు కల్యాణం తంతును నిర్వహించారు. అర్చకులు ఉత్సవమూర్తులకు చేసిన ఎదురుకోళ్ల సేవ చూడముచ్చటగా జరిగింది. అనంతరం సాంప్రదాయం ప్రకారం కంకణధారణ, జీలకర్రా, బెల్లం, మంగళ్యధారణ కార్యక్రమాలను గావించారు. స్వామి, అమ్మవారి పాదాల వద్ద అర్చకులు తలంబ్రాలను పోశారు. ఈ కల్యాణోత్సవాన్ని తిలకించిందుకు అనేక మంది భక్తులు తరలివచ్చారు.
కాస్త తగ్గిన ఎండలు
* కర్నూలులో 42.2 డిగ్రీలు
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, మే 2 : జిల్లాలో సోమవారం ఎండలు కాస్త తగ్గుముఖం పట్టాయి. సగటున 41.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక కర్నూలులో 42.2, నంద్యాలలో 41.8, ఆదోనిలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే వడగాలుల ప్రభావం యథాతథంగా కొనసాగుతుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గినా వేడి నుంచి మాత్రం ప్రజలకు ఉపశమనం కలగడం లేదు. రాత్రి వేళల్లో సగటున 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.
5న బిజెపి ప్రాజెక్టుల పర్యటన
ఆదోని, మే 2 : కేంద్రం రాష్ట్రంలో కరవు సహాయక చర్యల కోసం ఇచ్చిన రూ. 4,500 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన లెక్కలు చెప్పాలని బిజెపి నాయకులు కునిగిరి నాగరాజు, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌జైన్, బిజెవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునిగిని నీలకంఠ, పట్టణ నాయకులు విజయకృష్ణ విలేఖర్ల సమావేశంలో స్పష్టం చేశారు. సోమవారం బిజెపి కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో బిజెపి నాయకులు మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన నిధులు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తే తిరిగి మంజూరు చేస్తుందని వారు స్పష్టం చేశారు. ఖర్చు చేసిన లెక్కలు చూపించకుండా మళ్ళీ నిధులు కేంద్రాన్ని ఆడగడం ఎంత వరకు సబబు అని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు పూర్తిగా నెలకొని ఉన్నాయని వెంటనే కరవు పనులు చేపట్టి, కరవు బారిన పడిన ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు అయిన హంద్రీనీవా, గాలేరు నగరి, గురురాఘవేంద్ర కెనాల్, పులికనుమ మొదలగు ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన ఆలూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి వెంటనే వేదావతి ప్రాజెక్టును చేపట్టాలని వారు కోరారు. రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి పట్టిసీమ ప్రాజెక్టు వద్ద రాత్రి పూట నిద్రపోయారని అలాగే రాయలసీమలో కొనసాగుతున్న ప్రాజెక్టుల వద్ద ప్రాజెక్టుల నిద్ర చేయాలని వెంటనే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. పూర్తిగా వెనుకబడి ఉన్న రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న డిమాండ్‌తో మే 5న బిజెపి ఆధ్వర్యంలో ప్రాజెక్టుల యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంత్రి మాణిక్యలరావు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కపిలేశ్వర్‌రావు, తదితరులు వెలుగోడుప్రాజెక్టు, వేదావతి ప్రాజెక్టు ప్రాంతాలను పరిశీలిస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం వలసల నివారణ చర్యలు కూడా చెపట్టకపోవడం శోచనీయమని అన్నారు. అసంపూర్తిగా ఉన్న, పూర్తికాని ప్రాజెక్టుల పరిస్థితులను ముఖ్యమంత్రి ధృష్టికి తీసుకువస్తామని చెప్పారు. రూ.300కోట్లతో తుంగభద్ర దిగువ కాలువ బైపాస్ నిర్మాణం చేపట్టాలని కోరారు. అలాగే రాష్ట్ర వాటా నీటిని రాబట్టుకోవడానికి తుంగభద్ర ప్రాజెక్టు నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు పైపులైన్ వేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ది ఉంటే వెంటనే ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేసి రాయలసీమ బిడ్డా అని నిరూపించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా అధ్వానంగా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వలసలు నివారించి గ్రామీణ పేద ప్రజలను ఆదుకోవాలని కోరారు.
వారంలోగా తాగునీటి
సమస్య పరిష్కరిస్తాం..
* విద్యుత్ మోటార్లు ఉపయోగిస్తే చర్యలు:ఎమ్మెల్యే బుడ్డా
ఆత్మకూరు ఏప్రిల్ 2:ఆత్మకూరు పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను వారం రోజుల్లోగా పరిష్కరించాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో సోమవారం నగర పంచాయతీ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యపై చర్చించారు. అయితే ఈ సమావేశానికి పలువురు కౌన్సిలర్లు గైర్హాజరవడం, నీటి వ్యాపారులపై ఉదాసీనత చూపించడం పట్ల ఎమ్మెల్యే కమిషనర్‌పై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇక పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేట్ బోర్లు, వెలుగోడు జలాశయం నుంచి వచ్చే నీరు గురిం చి ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో 8 ప్రైవేట్ బోర్లు, 6 మినీ ట్యాంకుల ద్వారా ప్రజల దాహార్తి తీర్చే ప్రయత్నం చేస్తున్నామని, 30 శాతం మాత్రమే తాగునీటి సమస్య ఉందన్నారు. దీంతో కొందరు కౌన్సిలర్లు 18వ వార్డులో 3 నెలల నుంచి తాగునీరు రావడం లేదని, రహమత్‌నగర్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. దీనిపై స్పందించిన కమిషనర్ ఆయా కాలనీలకు పాత బస్‌స్టాండ్ వద్ద ఉన్న ట్యాంకు నుంచి నీరు తీసుకు రావాల్సి ఉందన్నారు. 6వ వార్డు కౌన్సిలర్ అల్లీసా మాట్లాడుతూ ప్రైవేట్ వాటార్ ప్లాంట్‌ను బంద్ చేయించి తమ కాలనీ ప్రజల గొంతు తడపాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఆ వాటర్ ప్లాంట్‌కు నీరు నిలిపేయాలని కలెక్టర్‌తో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. కొందరు పైపులైన్లకు విద్యుత్ మోటార్లు తగిలించి నీరు తోడుకుంటున్నారని, దీంతో కింద వైపు ఉన్న ప్రజలకు తాగు నీరు అందడం లేదని కమిషనర్ తెలుపగా అలాంటి వారిపై కఠన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే పట్టణంలోని నీటి వ్యాపారుల బోర్లను స్వా ధీనం చేసుకుని ప్రజలకు ఉచితంగా నీరు సరఫరా చేయాలని కమిషనర్‌ను అదేశించారు. ఇదిలా ఉండగా మండలంలోని నల్లకాలువ గ్రామ శివారులో ఉన్న చెంచుగూడెం, నాగలూటి గూడంకు చెందిన గిరిజనులు ఎమ్మెల్యేని కలిసి తమకు 5 కిలోల బియ్యం ఇస్తున్నారని, అవి సరిపోవడం లేదని బియ్యం కోటా పెంచాలని కోరారు. ఇక నాగలూటిగుడెంకు వచ్చి పింఛన్లు పంపిణీ చేయడం లేదని ఆత్మకూరు, ఎస్‌ఎన్ తండాకు వచ్చి మీరే తీసుకెళ్లాలని అధికారులు పేర్కొంటున్నారని వారు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ నూర్‌అహమ్మద్, తహశీల్దార్ రాజశేఖర్‌బాబు, ఇఇ రామ్మూర్తి, డిఇ ఏ