కర్నూల్

పాండురంగని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోవెలకుంట్ల, మే 16:ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నిర్వహించే కోవెలకుంట్ల పాండురంగవిఠలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం కోటతిరుణాలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి, ఆయన సతీమణి ఇందిర ఉదయానే్న శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగస్వామిని దర్శించుకుని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్‌యార్డు చైర్మన్ గడ్డం నాగేశ్వరరెడ్డి, టిడిపి నాయకులు గడ్డం రామకృష్ణారెడ్డి, బివి ప్రసాదరెడ్డి, భక్తవత్సలరెడ్డి, ఆరికట్ల సుంకిరెడ్డి, కరిమద్దెల మురళి, దాబా మోహన్‌రెడ్డి, లక్ష్మిదుర్గ, పాపిరెడ్డి, తదితరులు ఉన్నారు.