సంజీవని

ఆరోగ్య సిరి.. కొబ్బరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయంగా వున్నప్పుడు ప్రకృతి సిద్ధంగా దొరికే అమృతజలం కొబ్బరినీరు. వాంతులు, విరేచనాలు, వడదెబ్బ, ఉపవాసాలు, జాగరణలు, అతిగా ప్రయాణాలు, అమితంగా ఉపన్యాసాలవల్ల అలసిపోతే- శోష వచ్చే పరిస్థితుల్లో శక్తి కలగడానికి కొబ్బరి నీళ్ళల్లో గ్లూకోజ్ కానీ పంచదార కానీ కలిపి తాగిస్తే ప్రాణాపాయ స్థితిలోనుంచి బయటపడతారు. లేత కొబ్బరినీళ్ళు వాంతుల్ని తగ్గిస్తాయి. పైత్యాన్ని పోగొడతాయి.
నేలమీద రాలిపడే కొబ్బరిపువ్వులను సేకరించి నేతిలో వేయించి మెత్తగా దంచి అర చెంచాడు చొప్పున మూడుపూటలా తీసుకుంటే రక్తపోటు అదుపులోకి వస్తుంది. రక్తస్రావం తగ్గుతుంది. రక్తంతో కూడిన వాంతి తగ్గుతుంది. విరేచనాల్లో రక్తంపడటం తగ్గుతుంది. గర్భాశయ వ్యాధులన్నింటిలోనూ ఇది చక్కగా పనిచేస్తుంది.
సక్రమంగా నెలసరి రానివాళ్ళకు, గర్భాశయంలో ఇతర దోషాలు ఉన్నవాళ్ళకు, మైల అసలు కాకపోవడంగాని, అధికమవడంగానీ ఉన్నవాళ్ళకి 25 రోజులపాటు క్రమపద్ధతిలో రోజూ కొబ్బరినీళ్ళను తాగిస్తే నెమ్మదిస్తుంది.
లేత కొబ్బరిని మెత్తగా రుబ్బి రసం తీయండి. కొబ్బరిపాలు, మంచి గంధం చెక్కని అరగదీసి ఒక గ్లాసు పాలకి ఓ చెంచా మంచి గంధాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని తాగిస్తే కామెర్లు తగ్గుతాయి. మంచి గంధం కలపకపోతే కొబ్బరిపాలు పైత్యం చేస్తాయి. మంచి గంధం కలిపిన కొబ్బరుపాలను తాగిస్తే ఎక్కిళ్ళు తగ్గుతాయి. కడుపులో మంట, నొప్పి తగ్గుతుంది. వృద్ధులకు మూత్రబాధలు తగ్గి మూత్రం పలచగా వస్తుంది.
బాగా ఎండిన కొబ్బరి చిప్పలని కుంపట్లో వేసి బాగా కాల్చి చమురు తీస్తారు. ఈ నూనె గజ్జి, తామర లాంటి చర్మవ్యాధులు తగ్గడానికి తోడ్పడుతుంది. తలకు రాస్తే పేలు చచ్చిపోతాయి. నేరుగా కొబ్బరినుంచి తీసిన నూనెని రాస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా నిలుస్తుంది.
కొబ్బరిపీచు తీసేటప్పుడు పొట్టు రాలుతుంటుంది. దీనిని జాగ్రత్తగా తీసుకుని నేతిలో వేయించి బెల్లంతో లేత పాకం పెట్టి కుంకుడు గింజలంత మాత్రలు చేసి పూటకు రెండు మూడు మాత్రలు తీసుకోవాలి. ఇలా కొన్ని రోజులు తీసుకున్నట్లయితే కడుపులో పెరిగే బద్దెపురుగులు (టేప్‌వార్మ్) నశిస్తాయి.
లేత కొబ్బరి పువ్వులో అంటుకుని దూదిలాంటి మెత్తటి పదార్థం ఉంటుంది. దీన్ని గాయంమీద అంటిస్తే వెంటనే రక్తస్రావం తగ్గడమే కాకుండా గాయం త్వరగా మానుతుంది. కొబ్బరినూనెలో సున్నం కలిపి కాలిన గాయాలమీద పలచగా పట్టువేసి ఓ గంట తరువాత కడిగివేస్తే పోటు తగ్గుతుంది.
లేత కొబ్బరి ఆకును కాటుకలా మెత్తగా నూరి సైంధవ లవణాన్ని కూడా మెత్తగా నూరి కలిపి కట్టు కడితే చీముగడ్డలు, గోరుచుట్టు, గవదబిళ్ళలు, వృషణాలలో వాపు తగ్గుతాయి. గడ్డలు త్వరగా పక్వానికి వస్తాయి. నొప్పి తగ్గుతుంది. కొబ్బరి కోరుని వేడిచేసి కడితే చీము గడ్డల్లోను, ఇతర వాపుల్లోను నొప్పి, పోటు తగ్గుతాయి. పచ్చి కొబ్బరి కోరులో పసుపు కలిపి కడితే గోరుచుట్టు పక్వానికి వస్తుంది.
స్వచ్ఛమైన కొబ్బరిని నోట్లో వేసుకొని పుక్కిలిస్తే దంతరోగాలు, ఊపిరితిత్తుల రోగాలు నెమ్మదిస్తాయి. *