ఆంధ్రప్రదేశ్‌

స్పీకర్‌పై వీగిన అవిశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అనుకూలంగా 57, వ్యతిరేకంగా 97 ఓట్లు
* అవిశ్వాస చర్చలో స్పీకర్, ఆయన కుటుంబీకులపై ప్రతిపక్షం విమర్శల దాడి
* తిప్పికొట్టిన మంత్రులు యనమల, పల్లె, కామినేని, అచ్చెన్నాయుడు
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై వైకాపా సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. స్పీకర్ అధికారపక్ష సభ్యునిగా వ్యవహరిస్తున్నారని, ఆయనపై అవిశ్వాసం ప్రకటిస్తున్నామని వైకాపా అధినేత జగన్ ప్రకటించగా అన్ని పార్టీల సభ్యులు ఈ అంశంపై మాట్లాడారు. దాదాపు రెండు గంటలసేపు చర్చ జరిగింది. అనంతరం శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి యనమల రామకృష్ణుడి సూచన మేరకు అవిశ్వాస తీర్మానంపై ఉపసభాపతి బుద్ధప్రసాద్ ఓటింగ్ నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా 57మంది, వ్యతిరేకంగా 97మంది ఓటువేయడంతో వీగిపోయింది.