ఆంధ్రప్రదేశ్‌

కోడెల జీవిత విశేషాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:ఇదిలా వుండగా మాజీ స్పీకర్ కోడెల బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు, ఆయన కుటుంబ సభ్యులు తెలియ జేస్తున్నారు. తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న కోడెల సోమవారం ఉదయం అల్పాహారం తీసుకున్న తరువాత తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. డోర్ లాక్ చేసుకోవటం గమనించిన ఆయన భార్య గది వద్దకు వెళ్లి తలుపులు తీయాల్సిందిగా కేకలు వేశారు. ఎంతకు తలుపు తీయకపోవటంతో గన్‌మెన్ తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లారు. అప్పటికే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉన్న కోడెలను బసవతారకం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందారు.
సుదీర్ఘ రాజకీయ జీవితం
సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన కోడెల శివప్రసాదరావు రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు తొలి శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. దిగువ మధ్య తరగతికి చెందిన కోడెల గుంటూరు జిల్లా నకిరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2వ తేదీన జన్మించారు. తన తోబుట్టువులందరూ అనారోగ్యంతో మృతిచెందటం బాల్యంలోనే ఆయనపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఆయన చదువులో అంచెలంచెలుగా రాణిస్తూ వైద్యవృత్తిని స్వీకరించారు. తొలుత లయోలా కళాశాలలో పీయుసీ చదివిన ఆయన మళ్లీ గుంటూరు ఏ.సీ కాలేజీలో పీయూసీలో చేరి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్యకళాశాలలో చేరారు. ఎంబీబీఎస్ పూర్తిచేసిన తరువాత వారణాసిలో ఎం.ఎస్ పూర్తిచేశారు. తదనంతరం నర్సరావుపేటలో ఆసుపత్రిని ఏర్పాటుచేసి సర్జన్‌గా పేరు సంపాదించారు. తదనంతరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఆనాటి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. 2004 వరకు ఆయన వరుసగా ఐదుసార్లు శాసనసభ్యునిగా గెలుపొందారు. 2014లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. టీడీపీలో ఎన్టీయార్, చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. హోంశాఖను కూడా ఆయన నిర్వహించారు. రాష్ట్ర విభజన తరువాత తొలి ఏపీ శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావుకి భార్య శశికళ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ముగ్గురూ కూడా వైద్యులుగా స్థిరపడ్డారు.
కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.