క్రీడాభూమి

విమర్శలు బాధిస్తున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత టెస్టు జట్టు కెప్టెన్ కోహ్లీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: కొంత మంది మాజీ క్రికెటర్లు చేస్తున్న విమర్శలు తనను బాధిస్తున్నాయని భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా పాల్గొంటున్న ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపిటిఎల్) మ్యాచ్‌లను కోహ్లీ తిలకించాడు. సానియాతో కలిసి కొంతసేపు ఇందిరా గాంధీ స్టేడియంలో కూర్చొని మ్యాచ్‌లను చూసిన అతను ఆతర్వాత విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల కొంత మంది ఉద్దేశపూర్వకంగా విమర్శలు గుప్పిస్తున్నారని అన్నాడు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించనివారు, కెరీర్‌లో ఒక టెస్టు కూడా ఆడనివారు కూడా విమర్శించడం వింతగా ఉందని వ్యాఖ్యానించాడు. నాగపూర్, ఢిల్లీ టెస్టుల్లో పిచ్‌లు సక్రమంగా లేని కారణంగానే టీమిండియా గెలిచిందని అనడం, తాను ఉద్దేశపూర్వకంగా అలాంటి పిచ్‌లను తయారు చేయమని కోరానని ఆరోపించడం బాధాకరమని కోహ్లీ అన్నాడు. క్రికెట్ గురించి ఏమాత్రం తెలిసిన వారికైనా, సిరీస్‌లు జరిగే సమయంలో ఆటగాళ్లు ఎలాంటి ఒత్తిడికి లోనవుతారో తెలుస్తుందని అన్నాడు. ఆ మాత్రం ఆలోచన కూడా లేకుండానే విమర్శలు చేయడం మంచిది కాదన్నాడు.
జపాన్ వారియర్స్ గెలుపు
ఇలావుంటే, గురువారం నాటి తొలి పోరులో లియాండర్ పేస్ నేతృత్వం వహిస్తున్న జపాన్ వారియర్స్ జట్టు 24-21 తేడాతో యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) రాయల్స్‌పై విజయం సాధించింది.