క్రీడాభూమి

కోహ్లీ అభిమానులే ఎక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాక్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ సనా
చెన్నై, మార్చి 13: తమ జట్టులో విరాట్ కోహ్లీ అభిమానులే ఎక్కువగా ఉన్నారని పాకిస్తాన్ మహిళా క్రికెట్ కెప్టెన్ సనా మీర్ చెప్పింది. టి-20 మహిళల వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు ఇక్కడికి వచ్చిన సనా సహచరులతో కలిసి ఆదివారం నెట్స్‌కు హాజరైంది. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ జట్టులో ఎక్కువ మంది కోహ్లీ అభిమానులు ఉన్నప్పటికీ తాను మాత్రం భారత కెప్టెన్ ధోనీ అంటేనే ఇష్టపడతానని తెలిపింది. మైదానంలో ఏ విధంగా వ్యవహరించాలి, జట్టును ఎలా ముందుకు నడపాలి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉత్కంఠకు గురికాకుండా ఏ విధంగా సంయమనం పాటించాలి అన్న విషయాలను ధోనీని చూసి నేర్చుకోవచ్చని చెప్పింది. 11 సంవత్సరాలుగా పాకిస్తాన్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయాన్ని గుర్తుచేసిన ఆమె, కెప్టెన్‌గా బాధ్యతల నుంచి తప్పుకొన్న తర్వాత కూడా కొంతకాలం క్రీడాకారిణిగా కొనసాగుతానని స్పష్టం చేసింది. పరిస్థితులకు కొత్త కెప్టెన్ అలవాటుపడి, జట్టును సమర్థంగా నడిపించే వరకూ తాను మద్దతునిస్తానని చెప్పింది. వరల్డ్ కప్‌లో విజయమే తమ లక్ష్యమని పేర్కొంది.