ఆంధ్రప్రదేశ్‌

క్లిష్టతరం..కొల్లేరు అంశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాల్సి వుంది కృష్ణా, పశ్చిమగోదావరి కలెక్టర్లు, అధికారులతో కేంద్ర బృందం భేటీ
విజయవాడ, డిసెంబర్ 10: పర్యావరణ పరిస్థితులు, మానవ ఆర్ధిక వనరులు, చట్టబద్దమైన అంశాలు కలిగిన కొల్లేరు అంశం చాలా క్లిష్టతరమైనది. కాంటూరు కుదింపుపై కీలక నిర్ణయం తీసుకునే సమయంలో కొల్లేరు సరస్సును కాపాడుకోవటంలో ఇప్పటివరకు చోటుచేసుకున్న పరిణామాలన్నింటిని పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం వుందని కేంద్ర ప్రభుత్వం పంపించిన నిపుణుల బృందం అభిప్రాయపడింది. కొల్లేరు కాంటూరు పరిధి మార్పుపై అధ్యయనం చేసి వన్యప్రాణి జాతీయ బోర్డుకు నివేదించేందుకై ఏర్పాటైన నిపుణుల బృందం బుధవారం కొల్లేరు ప్రాంతంలో పర్యటించి ఆయా గ్రామాల రైతుల అభిప్రాయాలను సేకరించింది. ఢిల్లీకి తిరిగి వెళ్లే ముందుగా గురువారం స్థానిక ఒక ప్రైవేట్ హోటల్‌లో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై కూలంకుషంగా చర్చించింది. ఈ కమిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ సుకుమార్, కమిటీ సభ్యులు కేంద్ర అటవీశాఖాధికారి విశిష్ట కొల్లేరు వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రయత్నం చేసారు. ప్రస్తుతం కొల్లేరు సరస్సులో నీరు లేకపోవటానికి కారణాలను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ జల విధానంలో భాగంగా కొల్లేరులోకి ప్రవహించే కాలువలను సేద్యానికి వాడుకుంటే కొల్లేరు జలాశయంగా ఎలా మనుగడ సాధించగలదని వశిష్ట ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎకె ఫరీదా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. కొల్లేరు జలాశయం మనుగడకు ఎలాంటి ఢోకా లేదన్నారు. నాలుగు చిన్న నదులు, 18 కాలువలు, 22 డ్రైన్ల నుంచి నీరు కొల్లేరులోకి వస్తుందన్నారు. వీటి సాధారణ ప్రవాహాన్ని ప్రభుత్వం మళ్లించటం లేదన్నారు. అయితే వరదల రూపంలో సముద్రంలోకి వృధాగాపోయే నీటిని పోలవరం కుడి ప్రధాన కాలువకు మళ్లించి సేద్యానికి వినియోగిస్తున్నామన్నారు. దీనికి సాగర్, శ్రీశైలం జలాశయాల్లో మిగులు చూపించి వాటిని రాయలసీమ జిల్లాలకు తరలించటం ప్రభుత్వ విధానమన్నారు.కొల్లేరు అభయారణ్యం పరిధిలోని ధ్వంసం చేసిన చెరువుల సంఖ్య, వాటి విస్తీర్ణాన్ని అడిగి తెలుసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు మండలాల్లోని నాలుగు గ్రామాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి వుందన్నారు. ఇందులో 29,949 ఎకరాల విస్తీర్ణం కలిగిన 1140 చేపల చెరువులను ధ్వంసం చేసామని భాస్కర్ తెలిపారు. ధ్వంసం చేసిన మొత్తం భూమిని 2006లోనే అటవీశాఖకు అప్పగించామన్నారు. ఇక కృష్ణాలో రెండు మండలాల్లోని 29 గ్రామాల్లో 17,449 ఎకరాల విస్తీర్ణం కలిగిన 636 చెరువులను ధ్వంసం చేసామని ఇన్‌చార్జి కలెక్టర్ గంథం చంద్రుడు తెలిపారు. 2010 ఉపగ్రహ సమాచారం మేరకు ఏలూరు, నిడమర్రు, కైకలూరు మండలాల్లో చెరువులున్నట్లు తెలుస్తుందని, వీటిని నియంత్రించేందు ఏ ప్రయత్నాలు చేస్తున్నారని విశిష్ట ప్రశ్నించారు. జీవనోపాధి కోల్పోయిన 21,015 కుటుంబాలను గుర్తించి రూ.77 కోట్లు ఖర్చు కాగల పలు ప్రత్యామ్నాయ పథకాలను ప్రతిపాదించామని తెలిపారు. భారత వన్యప్రాణి సంస్థ శాస్తవ్రేత్త, కమిటీ సభ్యులు జాన్సన్ మాట్లాడుతూ ఆఫ్రిక్ క్యాట్‌ఫిష్ పెంపకంపై దేశవ్యాప్తంగా నిషేధం అమల్లో వున్నందున దీన్ని ఏ విధంగా నిరోధిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. చీఫ్ కన్జర్వేటర్‌మిశ్రా, రాష్ట్ర అటవీశాఖ సభ్యులు నాయక్, విజయవాడ సబ్ కలెక్టర్ సృజన, ఏలూరు ఆర్డీవో నంబూరి బేజ్ భరత్ తదితరులు పాల్గొన్నారు.