జాతీయ వార్తలు

కొల్లేరు సమస్యను పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రానికి రాష్ట్ర మంత్రుల వినతి

న్యూఢిల్లీ, మార్చి 14:కొల్లేరు అభయారణ్య ప్రాంతప్రజల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపీ మాగంటి బాబు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఇక్కడ కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, ప్రకాశ్ జావడేకర్ ఈమేరకు కోరారు. కొల్లేరు అభయారణ్యం పరిధిని ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు తగ్గించాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని వారు చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు సమయం పడుతున్నందున స్థానిక ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని మంత్రులు తెలిపారు. కాబట్టి తాత్కాలిక ఉపశమన చర్యలు చేపట్టాలని వెంకయ్య, జావడేకర్‌లకు వారు విజ్ఞప్తి చేశారు. గతంలో కొల్లేరు ప్రాంతంలో ఏర్పాటు చేసిన 136 మత్స్యకార సహకార సంఘాలను పునరుద్ధరించాలన్నారు. ఆరువేల ఎకరాలు, ఎలాంటి పరిహారం లేకుండా లేకుండా తీసుకున్న 14 వేల ఎకరాల జిరాయితీ భూములను, కొన్ని గ్రామకంఠాలకు ఉపశమనం కల్పించాలని కామినేని, బొజ్జల విజ్ఞప్తి చేశారు. మంత్రుల సూచనకు కేంద్రమంత్రి జావడేకర్ సానుకూలంగా స్పందించారు. కాగా మంత్రులు కామినేని, బొజ్జల, ఎంపీ మాగంటి బాబు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డాతో భేటీ అయ్యారు. ఏపిలో ఎయిమ్స్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, ప్రధాని మంత్రి స్వస్థ సురక్షా పథకం కింద అనంతపురం, విజయవాడలకు రూ. 150 కోట్ల మంజూరు చేశారని, ప్రాజెక్టు త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. ఔషధ విద్య, పరిశోధన జాతీయ సంస్థ(నైపర్ ), వైద్య సంబంధిత ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ పార్కు(మెడ్‌టెక్)లపై కేంద్ర మంత్రులు అనంతకుమార్, అరుణ్‌జైట్లీతో చర్చించారు.