కృష్ణ

మన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నవంబర్ 26: ప్రపంచ దేశాలకు ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు డా. బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. డా. అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్‌లో ఆమోదించిన రోజును పురస్కరించుకుని గురువారం ‘రాజ్యాంగ దివస్’ కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశపు మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం రాజ్యాంగ పాలనా దినోత్సవాన్ని నిర్వహించడం హర్షణీయమన్నారు. సామ్యవాద లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా దేశాన్ని నిర్మించేందుకు, దేశ పౌరులందరికీ రక్షణ కల్పించేందుకు అంబేద్కర్ పటిష్ఠవంతమైన రాజ్యాంగాన్ని నిర్మించారని మంత్రి రవీంద్ర వివరించారు. ఇన్‌చార్జ్ డిఆర్వో సాయిబాబు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక మహోన్నత శక్తి అన్నారు. గొప్ప నాగరికత గల దేశమని, భిన్న జాతులు సంస్కృతి మేళవించిన మన దేశాన్ని పాలించేందుకు అన్ని దేశాల రాజ్యాంగాలను అంబేద్కర్ క్షుణ్ణంగా అధ్యక్షనం చేసి ఉత్తమ రాజ్యాంగాన్ని మనకు అందించారని కొనియాడారు. హిందూ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ విజెఎస్ రాయులు మాట్లాడుతూ రాజ్యాంగ విశిష్ఠత వివరించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, పాలకులు చట్టానికి లోబడి పరిపాలన చేయాలని, స్వచ్ఛ సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ, ప్రాథమిక హక్కుల పరిరక్షణ, దేశ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ నిర్భయంగా జీవించగలిగే ఎన్నో అంశాలు రాజ్యాంగంలో పొందుపర్చిన మహానుభావుడు అంబేద్కర్ అని శ్లాఘించారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు విక్టర్ పాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, కలెక్టరేట్ ఎఓ పిబి సీతారాం, ట్రజరీ డిడి ఎన్ నాగేశ్వరరావు, తహశీల్దార్ నారదముని, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.