రాష్ట్రీయం

తుపాకీ, బుల్లెట్లు సరఫరా చేస్తూ దొరికిపోయన పరిటాల హత్యకేసులో నిందితుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండపాక, డిసెంబర్ 19: పరిటాల రవి హత్య కేసులో 17వ ముద్దాయగా ఉన్న బత్తిని వెంకటేశం (38) శనివారం అక్రమంగా తుపాకీ, బుల్లెట్లు సరఫరా చేస్తుండగా మెదక్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఇప్పటికే వెంకటేశం బెయన్‌పై ఉన్న సంగతి తెలిసిందే. వెంకటేశాన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొగుట సిఐ వెంకటయ్య, కుకునూరుపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. కొమురవెళ్లి కమాన్ వద్ద రాజీవ్ రోడ్ మీద వాహనాలు తనిఖీ చేస్తుండగా నంగునూరు మండలం వెంకటాపూర్‌కు చెందిన ఈ వెంకటేశం.. అక్రమంగా తుపాకీ, మూడు బుల్లెట్లు హైద్రాబాద్‌కు తీసుకెళ్తూ దొరికిపోయాడు. అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో వెంకటేశంను అదుపులోకి తీసుకొన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.