రాష్ట్రీయం

కొండపల్లి కోటేశ్వరమ్మ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: తొలితరం కమ్యూనిస్టు నాయకురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ (100) కన్నుమూశారు. విశాఖపట్నంలో నివాసముంటున్న ఆమె మనుమరాలు అనురాధ ఇంటి వద్ద తుది శ్వాస విడిచారు. కోటేశ్వరమ్మ ఆగస్టు 5వ తేదీన వంద సంవత్సరాల జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. అనారోగ్యానికి గురైన ఆమె చికిత్స తీసుకుంటూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కమ్యూనిస్టు ఉద్యమం రెండుగా చీలిపోయిన తరువాత ఆమె అతివాద ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. మంచి గాయని, రచయిత్రి. ఆమె మృతదేహాన్ని విశాఖ కింగ్‌జార్జ్ ఆసుపత్రికి అప్పగిస్తామని కుటుంబ సభ్యులు తెలియజేశారు. కోటేశ్వరమ్మ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం తెలియజేశారు.