జాతీయ వార్తలు

లాంగ్‌రేంజ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాసోర్‌ (ఒడిశా ) : చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి లాంగ్‌ రేంజ్‌ క్షిపణిని మంగళవారం భారత్‌ విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణిని ఇజ్రాయెల్‌, భారత్‌ సంయుక్తంగా రూపొందించాయి. ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలు ఛేదించగల లాంగ్‌ రేంజ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని అధికారులు తెలిపారు. ఈ క్షిపణిలో మల్టీ ఫంక్షనల్‌ సర్వైలెన్స్‌ అండ్‌ త్రెట్‌ అలర్ట్‌ రాడార్‌(ఎంఎఫ్‌-స్టార్‌) సిస్టమ్‌ ఉంటుంది.
గత ఏడాది ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా వాహక నౌకపై నుంచి కూడా ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే లాంగ్‌రేంజ్‌ క్షిపణి(ఎల్‌ఆర్‌-ఎస్‌ఏఎం)ని విజయవంతంగా ప్రయోగించారు.