జాతీయ వార్తలు

సాధికారతతోనే పేదరిక నిర్మూలన:రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సాధికారతతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు, ఆయన ఈరోజు ఉభయ సభలనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. బహిరంగ, అంతర్గత ముప్పు నుంచి దేశాన్ని రక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రైతులందరికీ విస్తరించినట్లు వెల్లడించారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇప్పటి వరకు 12 వేల కోట్ల రూపాయలను పంపిణీ చేసినట్లు తెలిపారు. 2022లో భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నదని వెల్లడించారు. మత్స్య సంపద పెంపుదల కోసం భారీ ఎత్తున నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. నీటి సంరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని, ఇందుకోసం జల శక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసిందని చెప్పారు. మహిళలు గౌరవంగా బతికే పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.