అంతర్జాతీయం

చారిత్రక ఒప్పందంపై సంతకాలు చేసిన ట్రంప్, కిమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్: ఇవాళ సింగపూర్ వేదికగా తమ మధ్య జరిగిన చారిత్రక సమావేశం విజయవంతంగా ముగిసిందని ఉత్తర కొరియా, అమెరికా దేశాలు ప్రకటించాయి. రెండు దఫాలుగా చర్చలు జరిపిన డొనాల్డ్ ట్రంప్, కిమ్ ఇరు దేశాల మధ్య ఎన్నడూ లేని విధంగా నాలుగు కీలక నిర్ణయాలతో ఓ చారిత్రక ఒప్పందంపై సంతకం చేశారు. శాంతి, సౌభాగ్యం నెలకొనేలా అమెరికా, ఉత్తర కొరియా కలిసి పనిచేయడం. కొరియాలో సంపూర్ణ డీన్యూక్లియరేషన్ దిశగా కృషిచేయడం. అమెరికా, ఉత్తర కొరియా దేశాలు తమ జైళ్లలోని ఖైదీలను, తప్పిపోయినవారిని ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు ఇప్పటికే గుర్తించిన వారిని వెంటనే స్వదేశానికి తిప్పి పంపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.