గుంటూరు

కోటప్పకొండ తిరునాళ్లకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, మార్చి 6: మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న కోటప్పకొండ తిరునాళ్ళకు అన్ని శాఖల అధికారులు ఆదివారం సర్వం సిద్ధం చేశారు. తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల నుండి లక్షలాది మంది వచ్చే కోటప్పకొండ తిరునాళ్ళకు అన్ని హంగులు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుండి సుమారు 44ప్రభలు కొండకు చేరుతున్నాయి. సోమవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కొండ ఎగువ, దిగువ ప్రాంతాల్లో పండుగ సందడి పూర్తిస్థాయిలో నెలకొంది. ఇప్పటికే చిన్నారులకు సంబంధించిన ఆటవస్తువులు, బొమ్మలు, జయింట్‌వీల్, బావిలో మోటారు సైకిల్, చెరుకులు, చిన్నచిన్న హోటల్స్, కూల్‌డ్రింక్ షాపులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రజాసంబంధాల శాఖ ఆధ్వర్యంలో తిరునాళ్ళ సందర్భంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కోటప్పకొండ జిల్లా పరిషత్ హైస్కూల్లో వివిధ ప్రతిభావంతుల (వికలాంగులచే) మెగా సంగీత విభావరిని ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేశారు. సంగీత విభావరితోపాటు నృత్యాలు, కోలాటం, మిమిక్రీ, ఏకపాత్రాభినయనం తదితర కార్యక్రమాలు జరుగనున్నాయి. కొండ దిగువన ఉన్న మెట్ల మార్గం వద్ద ఎప్పటిలాగానే తాత్కాలిక పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. రూరల్ ఎస్పీ నారాయణనాయక్, అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు ఆదివారం పరిస్థితిని పరిశీలించారు. 12మంది డిఎస్పీలు, 45మంది సిఐలు, 143మంది ఎస్‌ఐలు, 2000మంది పోలీసులు తిరునాళ్ళలో బందోబస్తును నిర్వహించనున్నారు. ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ అధికారులు కొండ ప్రాంతంలో మద్యం విక్రయాలు జరుగకుండా నిరోధించారు. చిలకలూరిపేట మేజర్‌కు సాగర్‌నీరు రాకపోవడంతో కొండ పైభాగానికి ట్యాంకర్లద్వారా నీటిని చేరవేస్తున్నారు.ఇప్పటివరకు మూడు లక్షల లీటర్ల నీటిని కొండపైకి చేరవేసినట్లు ఆలయ ఇవోశ్రీనివాసరావు తెలిపారు. కొండపైన దేవాలయ అధికారులు చలువ పందిళ్ళు, షామియానాలు, వాటర్ పాయింట్లు, క్యూలైన్లు, భక్తులు దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు, గొల్లభామ గుడి వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు, మెట్ల మార్గంలో వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, టాయిలెట్స్, బాత్‌రూమ్స్, ఉచిత ప్రసాదాలను ఏర్పాటు చేసినట్లు దేవాలయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. అదే విధంగా లక్షలాదిగా రానున్న భక్తుల కోసం 1.50వేల లడ్డూప్రసాదం, 75వేల అరిసెల మహాప్రసాదాన్ని తయారు చేయించి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించనున్నారు.లడ్డూప్రసాదం పది రూపాయలు, అరిసె ప్రసాదం పది రూపాయలకు విక్రయిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కొండ ఎగువ, దిగువకు ఆర్టీసీ అధికారులు 40 బస్సులను ఘాట్‌రోడ్డులో నడిపేందుకు సిద్ధం చేశారు. వీఐపీ, వీవీఐపీలకు పది ప్రత్యేక హైటెక్ బస్సులను ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనాలు కొండపైకి అనుమతించడంలేదు. అదేవిధంగా వీఐపీ, వీవీఐపీలకు సంబంధించిన కార్లు కొండ దిగువ భాగానే నిలిపి, ప్రభుత్వం, ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్టీసీ హైటెక్ బస్సుల్లో కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని కొండ దిగువకు రావాల్సి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణా రాష్ట్రం నుండి సుగాలీలు ఈ తిరునాళ్ళకు ఎక్కువగా రావడం ఆనవాయితీ. మొక్కుబడులు తీర్చుకుని, తలనీలాలు స్వామి వారికి ఇచ్చేందుకు ప్రత్యేక షెడ్డును ఏర్పాటు చేశారు. అక్కడే తాత్కాలిక నీటి ట్యాంకర్‌ను ఏర్పాటు చేశారు. కొండ దిగువ భాగంలో బారికేడ్లను ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఘాట్‌రోడ్డులో ఆదివారం స్ధంభించిన ట్రాఫిక్
నరసరావుపేట, మార్చి 6: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం రాలేని భక్తులు ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలి వచ్చారు. వీరి కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. వీటికి తోడు ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, వందలాదిగా కొండకు చేరుకున్నాయి. తిరిగి వచ్చే సమయంలో పర్యాటక కేంద్రం వద్ద ఎదురెదురుగా రెండు బస్సులు రావడంతో ట్రాఫిక్ స్ధంభించింది. రెండు ఆర్టీసీ బస్సుల వెనుక వందలాది వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. అయితే కోటప్పకొండ తిరునాళ్ళ రోజున ప్రతి ఏటా ట్రాఫిక్ స్ధంభించడం జరుగుతుంది. కానీ ఈ ఏడాది తిరునాళ్ళ ముందు రోజే ట్రాఫిక్ స్ధంభించడంతోభక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ సమస్య తలెత్తకుండా పోలీస్ ఉన్నతాధికారులు ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉంది.

మహాశివరాత్రి ఉత్సవాలకు శ్రీసంగమేశ్వరస్వామివారి ఆలయం సిద్ధం
* ఏర్పాట్లపై విచారించిన ఎమ్మెల్యే ఆలపాటి
* అన్నదాన నిమిత్తం రూ 10.116 అందించిన సేవాసమితి
తెనాలి, మార్చి 6: తెనాలి మండలంలో అతిపురాతన ఆలయంగా పేరుగాంచిన శ్రీగంగాబాలత్రిపురసుందరి సమేత శ్రీసంగమేశ్వరస్వామివారి ఆలయం శివరాత్రి మహోత్సవాలకు సిద్దమైంది. సంగంజాగర్లమూడి గ్రామానికి వందమీటర్ల దూరంలో కృష్ణాడెల్టా నుండి వచ్చే కొమ్ముమూరు ప్రధాన కాలువ ఒడ్డున వేంచేసియున్న స్వామివార్ల ఆలయాన్ని అధికారులు, సిబ్బంది సహకారంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి ప్రత్యేక రంగులు, విద్యుత్ అలంకారణలతో భక్తులకు ఉల్లాసాన్ని కలిగించేలా తీర్చిదిద్దుతున్నారు. ఆదివారం నుండే భక్తులు వందలాదిగా స్వామివార్లను దర్శించుకొనేందుకు వస్తుండటంతో అధికారులు వారికి ఎటువంటి అంతరాయాలు కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రతియేటా మహాశివరాత్రి పర్వదినాని ఈ ఆలయంలో నిద్రచేస్తూ స్వామివార్లను నిత్యం ఆరాధిస్తే సకల పాపాలు, కల్ముషాలు రూపుమాపుతాయని, ప్రజలు సుఖసంతోషాలతో విరాజిల్లుతారని ఈప్రాంత భక్తుల నమ్మకం. ఈ క్రమంలోనే ఆదివారం స్థానిక శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్వామివారి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులను ఆరాతీశారు. ఈ సందర్భంగా అన్నప్రసాద సేవాసమితి అధ్యక్షులు బాలిశెట్టి శ్రీనివాసరావు సభ్యులతో ఎమ్మెల్యేను కలిసి స్వామివారి ఉత్సవం సందర్భంగా భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు 10,116రూపాయల నగదు ఎమ్మెల్యే చేతుల మీదగా ఆలయ అధికారులకు అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెనాలి పరిసర ప్రాంతాలలో సంగమేశ్వర ఆలయం ఆత్యంత ప్రాచీనమైందని, భక్తులు ఎక్కువశాంత ఈఆలయానికి శివరాత్రనాడు వచ్చి రాత్రంతా జాగారణచేసి వెళ్ళటం ఆచారంగా ఉన్నందున అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకొని భక్తులకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేకు నగదు అందజేసిన వారిలో సమితి ప్రధాన కార్యదర్శి ప్రత్తిపాటి మాధవయ్య, సంగమ వెంకట్రామయ్య, కెవిఎన్ రాజు, బి శ్రీనివాసరావు, వై సదానారాయణ, ఎస్‌ఐ రామకృష్ణ తదితరులు ఉన్నారు.