రాష్ట్రీయం

కొలిక్కి వచ్చిన ‘కొఠారి’ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ శాఖల్లోని ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు కేటాయించే ప్రక్రియలో భాగంగా డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కార్యదర్శి సంజయ్ కొఠారి మంగళవారం నాడు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల సీనియర్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతో పాటు తెలంగాణ సిఎస్ రాజీవ్ శర్మ, ఆంధ్రా సిఎస్ ఐ వై ఆర్ కృష్ణారావులతోనూ, కమలనాధన్ కమిటీతోనూ ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యకార్యదర్శులు, అదనపు ప్రధానకార్యదర్శులు, కార్యదర్శులు ఈభేటీలో పాల్గొన్నారు. అఖిల భారత సర్వీసులకు చెందిన అధికారుల విభజన, గ్రూప్-1 స్థాయి అధికారుల విభజనతో పాటు ప్రధానంగా ఎఎస్‌ఎఫ్, పోలీసు అకాడమి విభజనపై కూడా చర్చ జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సంజయ్ కొఠారి ప్రస్తావించారు.
సీనియర్ అధికారులందరూ ముందుగా తమకు కేటాయించిన ప్రాంతానికి తరలివెళ్లాలని, ఆ తర్వాతే ఏం జరిగిందో, ఏం చేయాలో ఆలోచించాలని, వాస్తవిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని అన్నారు. ప్రజాసంక్షేమానికి వినూత్న కార్యక్రమాలు నిర్వహించి వారి మన్ననలను అందుకోవాలని చెప్పారు. పోస్టింగ్ కంటే ప్రజాసేవ పరమావధి కావాలని అన్నారు. ఇంత వరకూ 30-35 శాఖల విభజన ప్రక్రియ పూర్తయిందని, వారం రోజుల్లో మిగిలిన శాఖల్లో విభజన కూడా పూర్తవుతుందని సంజయ్ కొఠారి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ సిఎస్ రాజీవ్ శర్మ మాట్లాడుతూ అఖిల భారత సర్వీసుల విభజనకు సంబంధించి అనేక సమస్యలు తలెత్తాయని, డిప్యుటేషన్లపై కూడా ఇబ్బందులున్నాయని చెప్పారు. వాటన్నింటినీ పరిష్కరించాల్సి ఉందని చెప్పారు. ఆంధ్రా సిఎస్ ఐ వై ఆర్ కృష్ణారావు మాట్లాడుతూ ఆంధ్రాలో అమలుచేస్తున్న ఉపాధి కార్యక్రమాలు, స్కిల్ డెవలప్‌మెంట్, పరిశ్రమల విధానం, వౌలిక సదుపాయాలు, రక్షిత తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యవసాయం, ఆరోగ్యం, సామాజిక అంశాలు, గ్రామీణాభివృద్ధి, బ్యాంకింగ్ , ఆర్ధిక పథకాల గురించి వివరించారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఎదురైన ఇబ్బందులను , ఉద్యోగ విభజనపైనా చర్చించారు.