కృష్ణ

పలు రంగాల్లో ప్రసిద్ధులకు స్కోర్‌మోర్ పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 18: భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మగా నిలిచిన కళారంగంలో అత్యున్నత స్థానాన్ని పొందినవారికి, వ్యక్తి సమున్నత స్థానానికి మార్గాన్ని చూపే ఉపాధ్యాయులకు, పలు రంగాల్లో విశేష కృషి చేసి సేవలందిస్తున్నవారికి స్కోర్ మోర్ ఫౌండేషన్ సంస్థ ఆదివారం సాయంత్రం గాంధీనగరంలోని ఒక ఫంక్షన్ హాలులో విశిష్ట పురస్కారాలను, ప్రతిభ, నాట్య శిరోమణి పురస్కారాలను, విద్యాశిరోమణి పురస్కారాలను ప్రదానం చేసింది. విశిష్ట పురస్కారాలను డాక్టర్ దార్ల నాగేశ్వరరావు, ఎం.ఆంజనేయరావు, ఆచార్య క్రోవి పార్థసారధిలు, ప్రతిభా శిరోమణి పురస్కారం గట్టెం వెంకటేష్, నాట్య శిరోమణి పురస్కారం డాక్టర్ సుధా కలవగుంట (యుఎస్‌ఎ)లు, విద్యా శిరోమణి పురస్కారాలను ఎల్‌ఆర్ వెంకటరమణ, కృష్ణసాయిబాబు, కందాళ చందన, నాదెండ్ల రామారావు, సత్యనారాయణమూర్తి, నారాయణరావు, కాసుల పద్మావతి, గంగరాజు, ఆంజనేయశాస్ర్తీ, భాస్కరరాజు, సుంకర శ్రీనివాసరావు, రాజేశ్వరరావు, దేవరపల్లి బెనర్జీ, అబిన్ అలెక్స్, డాక్టర్ గంగిరెడ్డి రమణ, సుధాస్రవంతి, డాక్టర్ సుమిత బోస్ తదితరులకు ఎటువంటి ప్రాంతీయ వర్గ భేదాలు లేకుండా వేదికపై మంగళ వాయిద్యాల నడుమ పుష్ప మాలాంకృతులను గావించి దుశ్శాలువను కప్పి సంస్థ జ్ఞాపికతో ప్రశంసాపత్రాన్ని ప్రదానం చేశారు. వేదికపై పద్మశ్రీ డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగిస్తూ పది వత్సరముల నుంచి భారతీయ సంస్కృతీ వికాసానికి, ఉత్తమ విద్యావ్యాప్తికి కృషిచేస్తూ గుర్తింపు పొందిన ప్రసిద్ధులను సంస్థ సత్కరించి పురస్కారాలను ప్రదానం చేయటం ప్రశంసించదగిన విషయమని, ముప్పది మంది రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల నుంచి మహోత్కృష్టమైన ఉపాధ్యాయులను, కళారంగాన విశిష్ట ప్రతిభ కలిగి విదేశాల్లో నాట్యాచారిణిగా కీర్తి అందుకున్నవారిని సత్కరించటం అభినందనీయమన్నారు. వేదికపై సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ తుర్లపాటి పట్ట్భారామ్, ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.పట్ట్భారామ్, ఐజెయు ఉపాధ్యక్షులు ఆంజనేయులు, సిహెచ్ వెంకట సుబ్రహ్మణ్యం (ప్రధానోపాధ్యాయులు) తదితరులు పాల్గొన్నారు. ప్రారంభంలో చిన్నారులు చేసిన నాట్య ప్రదర్శన రమణీయంగా సాగింది.

అన్ని కాల్వలకూ సాగునీరు
* అధికారులకు బుద్ధప్రసాద్ ఆదేశం
చల్లపల్లి, సెప్టెంబర్ 18: అవనిగడ్డ నియోజకవర్గంలో అన్ని ప్రధాన కాలువల చివరి భూములకు సాగునీరు ఇచ్చితీరాలని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోడూరు మండలం ఊటగుండం పరిధిలోని అక్రమ తూములను తక్షణమే తొలగించాలని, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. డెల్టా ఆధునికీకరణ పనుల్లో చేపట్టిన కాలువల లైనింగ్ పనులు దిగువ నుండి కాకుండా ఎగువ ప్రాంతం నుండి చేపట్టాలన్నారు. దిగువన పనులు చేపట్టటంతో చివరి భూములకు సాగునీరు అందటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు సాగునీటి సరఫరా పుష్కలంగా ఉంటుందని, ఇరిగేషన్ ఉన్నతాధికారులు అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయిలో సరఫరా క్రమబద్ధీకరణకు విశ్రాంత అధికారుల సేవలు తీసుకోవాలన్నారు. ఊటగుండం ఛానల్ 14వ నెంబరు కాలువపై చేపట్టిన లైనింగ్ పనులు రైతులకు అసౌకర్యంగా ఉన్నాయని, వాటిని వెంటనే సరిదిద్దాలని మండలి సూచించారు. వి కొత్తపాలెం పరిధిలోని 7, 9, 10, 11 పంట కాలువలు, అన్ని ప్రధాన పంట కాలువలపై ఉన్న అక్రమ తూములను తొలగించాలని ఆదేశించారు. వేకనూరు - వక్కపట్లవారిలెం కాలువ రిటైనింగ్‌వాల్ పనులు జరిగిన ప్రదేశాల్లో కాలువలో గుట్టలుగా ఉన్న మట్టిని వెంటనే తొలగించాలని ఎఎంసి ఛైర్మన్ మండవ బాలవర్ధనరావు సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ సమావేశంలో కెసి డివిజన్ ఇఇ ఎం రవి బాబు, ఐడిఎస్ ఇఇ కె సుబ్బారావు, డిఇ వేణుగోపాల్, ఎఇలు డి శ్రీనివాస్, రాంకుమార్, చలపతిరావు, చల్లపల్లి, ఘంటసాల ఎంపిడిఓలు ప్రసాద్, సుబ్బారావు, ఎలక్ట్రికల్ ఎఇ సుధీర్, జెడ్పీటిసి కృష్ణకుమారి పాల్గొన్నారు.
పారిశ్రామిక హబ్‌గా జిల్లా
* గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య
కూచిపూడి, సెప్టెంబర్ 18: కృష్ణా జిల్లాను పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్, పామర్రు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి వర్ల రామయ్య అన్నారు. మొవ్వ మండల టిడిపి అధ్యక్షులు పోతుల నాగదేవ చంద్రహాస్ అధ్యక్షతన స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పామ్ర రు నియోజకవర్గం పరిధిలోని నిమ్మలూరులో కేంద్ర ప్రభుత్వ రక్షణ పరికరాల తయారీ సంస్థ నూతన భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉద యం 11గంటలకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి మండలం నుండి వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు నిమ్మలూరుకు తరలి రావాలని రామయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కిలారపు మంగమ్మ, వైస్ ఎంపిపి నన్నపనేని వీరేంద్ర, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా రామయ్య ఇద్దరికి ఆటోలు అందజేశారు.