కర్నూల్

ఆదోని ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోనిటౌన్, మార్చి 19: ఆదోనిలో జిల్లా ఎస్పీ, ఆదోని డిఎస్పీ ఆదేశాల మేరకు అత్యంత సమస్యాత్మక ప్రాం తాలతో పాటు ప్రధాన కూడళ్ళలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి ప్రత్యేకంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టౌన్ సిఐ రామయ్యనాయుడు, తాలూకా సిఐ దైవ ప్రసాద్‌లు పేర్కొన్నారు. ఈమేరకు శనివారం మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమర్‌తో సిఐలు చర్చించారు. ఇప్పటికే కర్నూ లు, నంద్యాల పట్టణాల్లో సిసికెమెరాలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారని ఆదోనిలో కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా అత్యంత సమస్యత్మక ప్రాంతాలైన పాతబస్తి ప్రాంతంలో 50శాతం దాకా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని అలాగే ఎక్కువగా గొలుసు దొంగతనాలు జరుగుతున్న త్రిటౌన్ పోలీస్ స్టేషన్, టూటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోకొన్ని సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తామని కమిషనర్‌కు టౌన్ సిఐ వివరించారు. అందుకు మున్సిపాలిటీ నుంచి నిధులు కేటాయించాలని సూ చించారు. నంద్యాలలో సుమారు రూ. 40 లక్షలతో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారని, ఆదోనిలో కూడా ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సూచించారు. ప్రధానంగా టూటౌన్ ప్రాంతంలో సిసి కెమెరాల కంట్రోల్ పాయింట్ ఏర్పాటు చేస్తామని వివరించారు. దీనిపై కౌన్సిల్ చర్చించి సిసి కెమెరాల ఏర్పాటుకు మున్సిపాలిటీ నుంచి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని, నిధులు కేటాయిస్తామని మున్సిపల్ కమిషనర్ హామీ ఇచ్చారు.