కృష్ణ

దుక్కులు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 28: అకాల వర్షాలకు వ్యవసాయ భూములు మెత్తబడటంతో జిల్లాలో రైతన్నలు దుక్కులను ముమ్మరం చేశారు. మే మొదటి వారంలో కురిసిన వర్షాలకు కొన్ని చోట్ల దుక్కులు పూర్తి చేయగా, మిగతా ప్రాంతాలలో శుక్ర, శని వారాల్లో కురిసిన వర్షాలకు దుక్కులను ప్రారంభించారు. కొన్ని ప్రాంతాలలో పశువుల మేతకు పిల్లి పెసర, చొప్ప, జొన్న విత్తనాలను వేస్తున్నారు. అలాగే ఈ అకాల వర్షాలు కూరగాయలు, ఆకు కూరల తోటలకు ఊరటనిచ్చాయి. అలాగే ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలతో పాటు పశుపక్షాదులు సేదతీరాయి. వృద్ధులు, చిన్నారులు ఊపిరి పీల్చుకున్నారు. రోహిణీ కార్తెలో రోళ్లు పగులుతాయన్న పెద్దల మాటలకు విరుద్ధంగా వాతావరణం చల్లబడటంతో వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పశుగ్రాసం కొరకు అల్లాడుతున్న పశువులు పచ్చిగడ్డి జీవం పోసుకోవటంతో కడుపునిండా తింటున్నాయి.