కృష్ణ

కేబుల్ ప్రసారాలు డిజిటలైజేషన్‌పై 24న కేబుల్ ఆపరేటర్లతో సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 21: కేబుల్ ప్రసారాలు డిజిటలైజేషన్‌పై ఈ నెల 24న స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ‘మల్టి సిస్టం’ ఆపరేటర్లు (ఎంఎస్‌ఓ) లోకల్ కేబుల్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. కేబుల్ ప్రసారాలను డిజిటలైజేషన్ ప్రక్రియ మూడో దశలో పట్టణాలు, చిన్న నగరాల్లో వచ్చే నెల (డిసెంబర్) 31 లోపున పూర్తి కావాలని కేంద్ర ప్రభుత్వం గడువు విధించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే పెద్ద నగరాలన్నింటిలోనూ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినందున జిల్లాలోని 9 పట్టణ ప్రాంతాల్లోని కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్‌ఓలతో సమావేశమై కేబుల్ ప్రసారాల డిజిటలైజేషన్‌పై ప్రగతిని సమీక్షిస్తామన్నారు. కేబుల్ ప్రసారాల డిజిటలైజేషన్‌కు సంబంధించి జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు.
కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు 40 రోజులు మాత్రమే వున్న దృష్ట్యా, డిజిటలైజేషన్ పరికరాలైన సెట్ టాప్ బాక్సులు ఏర్పాటును కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్‌ఓలు వేగవంతం చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని జెసి గంధం చంద్రుడు కోరారు. ఇప్పటివరకు తమ పరిధిలో వున్న కేబుల్ కనెక్షన్ల వివరాలను వినియోగదార్ల పేరు, ఆధార్ నెంబరుతో సహా వివరాలు సమావేశానికి తీసుకురావాలన్నారు. వీరిలో సెట్ టాప్ బాక్సులు ఏర్పాటుచేసుకున్న వినియోగదార్ల పేర్లు చిరునామాతో సహా అందించాలన్నారు.
డిజిటలైజేషన్ ప్రయోజనాలు
కేబుల్ ప్రసారాల డిజిటలైజేషన్ వల్ల వినియోగదారులకు విస్తృతమైన ప్రయోజనాలు చేకూరతాయని జెసి వివరించారు. వినియోగదారులు కోరుకున్న ఛానెళ్లను మాత్రమే చూడగలిగి అవకాశం వుంటుందన్నారు. నాణ్యమైన ప్రసారాలను వీక్షించే అవకాశం వుంటుందన్నారు. కోరుకున్న చలన చిత్రాలను వీక్షించే అవకాశం కలుగుతుందన్నారు. కేబుల్ ఆపరేటర్లకు సైతం ఖచ్చితమైన వినియోగదార్ల సంఖ్య తెలియడంతో పాటు వారి ఆదాయం పెరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బ్యాండ్ విడ్త్ స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి ఉపయోగిస్తుందన్నారు.
టోల్ ఫ్రీ నెంబరు
కేబుల్ ప్రసారాల డిజిటలైజేషన్‌పై సందేహాలు అడిగి తెల్సుకునేందుకు వీలుగా దేశవ్యాప్తంగా టోల్ ఫ్రీ నెంబర్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు జెసి తెలిపారు. 1-800-180 4343 నెంబరుకు ఫోన్‌చేసి తెలుగులో మాట్లాడి సందేహాలు తీర్చుకోవచ్చని జాయింట్ కలెక్టర్ తెలిపారు.