కృష్ణ

పోలవరం కాలువ పనులు వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, ఫిబ్రవరి 4:పోలవరం కాలువ పనులు వేగవంతంగా చేయాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశించారు. పనులు ఆశినంత వేగంగా జరగటం లేదని, ఈ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నూజివీడు మండలం పల్లెర్లమూడి, సీతారామపురం గ్రామాల వద్ద జరుగుతున్న పోలవరం కాలువ పనులను గురువారం పరిశీలించారు. జరుగుతున్న పనులపై జలవనరుల శాఖ అధికారులు, రైతులతో మంత్రి దేవినేని ఉమా ముచ్చటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పనులు వేగవంతంగా నిర్వహించేందుకు గాను అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, పనిచేసే అధికారులకు రివార్డులు, పనిచేయని అధికారులపై చర్యలు ఉంటాయని మంత్రి ఉమా హెచ్చరించారు. జనవనరుల శాఖ అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, పోలవరం కాలువ పనులు నాణ్యతతో, వేగవంతంగా జరిగేలా చూడాలన్నారు. జూన్ మొదటి వారానికి ప్రకాశం బ్యారేజ్‌ను నీరు అందించటం ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ ఎస్‌ఇ శ్రీనివాసయాదవ్, ఇఇ చినబాబు, డిఇఇ పద్మినీదేవి, ఎఇ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.